ఎగ్జామ్ సెంటర్ వద్ద ఏం జరిగిందని ఆరా తీసే పనిలో ఉంది జగతి. వసుధార వద్దకు వెళ్లి ఏం జరిగిందని నిలదీస్తుంది. జరిగినవన్నీ ఒక్కోసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదని అంటుంది వసుధార. రిషిని చూస్తే భయమేస్తోందని వసుధారతో జగతి అంటుంది. ఇంతలో మహేంద్ర తీసిన ఫొటోను జగతి పంపిస్తాడు. మందు గ్లాస్‌తో ఉన్న రిషిని చూసి మరింత బాధపడుతుంది జగతి. వసుధారా నీ మౌనం మరిన్ని అనుమానాలకు దారి తీస్తుందని అంటుంది. క్లాస్‌లో ఉండాల్సిన నా కొడుకు బార్‌లో ఎందుకు ఉన్నాడని ప్రశ్నిస్తుంది. రిషి తల్లిగా ఆడుగుతున్నానంటూ రిక్వస్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందని.. ఇంటికి లేట్‌గా ఎందుకు వచ్చాడు.. బార్‌కు ఎందుకు వెళ్లాడు... నీవెందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నిస్తుంది జగతి. లవ్ చేస్తున్నట్టు రిషి చెప్పారని... ఆ రోజున జరిగిన సంఘటన పూర్తిగా జగతికి వివరిస్తుంది వసుధార. 


నువ్వేం ఏం చెబుతున్నావ్‌ అని ఆశ్చర్యపోయిన జగతి... నువ్వు రిషిని రిజెక్ట్ చేశావా అని అడుగుతుంది. నా కుమారుడిని ఎందుకు రిజెక్ట్‌ చేశావో చెప్పగలవా అని జగతి అడుగుతుంది. తన మనసులో ఏముందో చెప్పారు కానీ... నా మనసులో ఏముందో అలోచించలేకపోయారని అంటుంది వసుధార. కలిసి తిరిగనప్పుడు, రిషి సార్ అది, రిషి సార్ ఇదీ అంటు గొప్పలు చెప్పిన నువ్వు రిషిని ఎందుకు కాదన్నావో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది జగతి. మేడం రిషి సార్ నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాలని రూల్ ఏమీ లేదు కదా అని వసుధార సమాధానం చెబుతుంది. వసూ... నీవు ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావ్‌.. నీ ప్రేమను పొందే అర్హత రిషికి లేదంటావా అని జగతి తిరిగి ప్రశ్నిస్తుంది. అర్హతలు గురించి కాకుండా నా మనసు ఏం చెప్పిందే అదే చెప్పానంటుంది వసుధార. నీ మనసు ఏం చెప్పిందని అడుగుతుంది జగతి. 


నేను ఎవర్ని ప్రేమించాలో... నాకు తెలుసు మేడం అంటుంది వసుధార. అంటే నిన్ను ప్రశ్నించే అధికారం నాకు లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నావా అని అడుగుతుంది జగతి. మేడం నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. జీవితంలో ఏదైనా సాధించాలని అందర్నీ వదిలేసి వచ్చి ఒంటరిగా జీవిస్తున్నాను అని చెబుతుంది వసుధార. ప్రేమ ఇవన్నీ నా మనసులో లేవని వసుధార చెబితే... అబద్దాలు చెప్పొద్దని గట్టిగా రియాక్ట్ అవుతుంది జగతి. నీ మనసు ఏంటో నాకు తెలుసు వసుధార... మనసులో ఒకటి పెట్టుకొని... మరొకటి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావ్‌ వసుధార అని అడుగుతుంది జగతి. నీవు ఇలా ఆలోచించవు.. నీ మాటలు ఇవి కావు... నీ మౌనంలో బోలెడు సమాధానాలు దొరుకుతున్నాయి.. అందులో ఏది ఎంచుకోవాలో అర్థం కావడం లేదని నిజం చెప్పమంటుంది జగతి. ఎవరైనా కలిశారా... ఎవరైనా బెదిరించారా... ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్ చెప్పు వసూ అంటుంది జగతి. రిషిని కాదనడానికి... నువ్వు చెప్పినవన్నీ సాకులుగానే ఉన్నాయే తప్ప సరైన కారణాలుగా కనిపించడం లేదంటుంది జగతి. రిషి మారాడన్న టైంలో నువ్వు రివర్స్ అయ్యావేంటని ప్రశ్నిస్తుంది జగతి. నీ మనసుకు నువ్వు సర్ధిచెప్పుకుంటున్నావ్‌ కానీ.. అది సరైన కారణం కాదని.. నీకు నీవైనా ఆలోచించుకో.. అది కరెక్టా కాదా అని నీకే తెలుస్తుందని చెప్పి వెళ్లిపోతుంది జగతి. చిన్నప్పుడు రిషిని నేను బాధ పెట్టిన దాని కంటే వెయ్యిరెట్లు బాధ పెట్టావంటూ రిషీ చెప్పిన డైలాగ్‌నే జగతి చెప్తుంది. రిషి గుండెను ముక్కలు చేశావంటూ వెళ్లిపోతుంది. 


తండ్రి మహేంద్రతో కలిసి కాలేజీకి వస్తాడు రిషి. ఇద్దరం కలిసే వచ్చాం కదా అలా వెళ్లిపోతావేంటని అని అడుగుతాడు మహేంద్ర. నేను క్లాస్‌ వెళ్తున్నానని.. మీరు క్లాస్ చెప్తారా అని ప్రశ్నిస్తాడు రిషి. మనసులో ఏదైనా బాధ ఉంటే మాట్లాడుకుంటే తగ్గుతుంది కదా అని అంటాడు మహేంద్ర. ఎప్పటిలా ఉంటే బాగుంటుందని అంటాడు. మీరు కూడా ఎప్పటిలా లేరని.. మీతోపాటు చాలా అంశాలు ఎప్పటిలా లేనప్పుడు నేను ఎప్పటిలా ఉండాలంటే ఎలా డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. 


కొన్ని రోజుల నుంచి హుషారుగా లేవని...  ఏమైందని గౌతమ్‌ను ధరణి అడుగుతుంది. చాలా అయ్యాయని.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటాడు. అన్నీ చెప్పుకోలేమంటాడు. అలా అని అన్నీ దాచుకోవడం కరెక్ట్ కాదని అంటుంది. ఇంతలో జగతి వచ్చి మహేంద్ర గురించి అడుగుతుంది. ఆయనతో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మహేంద్ర వస్తాడు. రిషి ఎక్కడ ఉన్నాడని ఆరా తీస్తుంది జగతి. ఇప్పుడే కాలేజీలో డ్రాప్ చేసి వచ్చానంటుంది. కాలేజీకి వెళ్లాడా అని ఆశ్చర్యపోతుంది జగతి. నీతో మాట్లాడాలని చెప్పి మహేంద్రను లోపలికి తీసుకెళ్తుంది జగతి. 


రిషి, జగతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ కాలేజీలో అడుగు పెడుతుంది వసుధార. తన ఫ్రెండ్‌ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఆమె వచ్చి ఎగ్జామ్‌ గురించి అడుగుతుంది. రిషి సార్‌ కూడా వచ్చారంటా.. ఆయనతో కలిసి లాంగ్ జర్నీ చేశావంటే... చాలా హ్యాపీగా జరిగి ఉంటుందని అంటుంది వసుధార ఫ్రెండ్ పుష్ప. ఆమెతో మాట్లాడుతూ తనకు తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వెళ్లు నేను వస్తానంటూ ఆమెను పంపించేస్తుంది వసుధార. 


క్లాస్‌లో రిషి ఉన్నప్పుడు వసుధార వచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతుంది.  ఆమె గొంతు విన్న రిషి కోపంతో చాక్‌పీస్‌ను బోర్డుపై గట్టిగా రుద్దుతాడు.