గుప్పెడంతమనసు జులై  15 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 15 Episode 503)


వసుధారకి కాఫీ ఇచ్చిన తర్వాత తిరిగి రూమ్ కి వెళ్లిన రిషి తన ఆలోచనల్లోనే మునిగితేలుతాడు. అభినందన సభలో వసు తన మెడలో దండ తీసి వేసిన విషయం గుర్తొచ్చి ఆ దండ తీసుకుని మళ్లీ వేసుకుంటాడు. నన్ను కాదండోంది..నా మెడలో దండవేసింది. తన మనసుని నేను చదవలేకపోతున్నానా, అసలేం జరుగుతోంది...ఎందుకు నో చెప్పిదో ఇప్పటికీ అర్థం కావడం లేదు అనుకుంటాడు రిషి. నన్నెప్పుడైనా సినిమాకు  రమ్మన్నారా అన్న మాటలన్నీ గుర్తుచేసుకుని నో చెప్పినప్పటి నుంచీ ఇంకా చనువుగా ఉంటోంది వసుధాని ఎలా అర్థం చేసుకోవాలి... ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను ఓ అడుగు ముందుకు వేయాలా...అయినా నో చెప్పిన తర్వాత కూడా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు..  


అటు వసుధార కూడా ఏదో ఆలోచించుకుంటూ రిషి రూమ్ వైపు వస్తుంది. డోర్ బయటవరకూ వచ్చాక నేనెందుకు ఇక్కడకు వచ్చాను అనుకుంటూ వెనక్కు తిరిగి వెళ్లిపోతుంది. వసుధార ఫోన్లో రిషి ఫొటో చూస్తూ రూమ్ లోకి వస్తుంది. వసు చేతిలో ఫోన్ లాక్కున్న సాక్షి...రిషి ఫొటో నువ్వు చూడడం ఏంటి అంటుంది.
వసు: నా ఫోన్ లాక్కోవడం తప్పు, నేను ఎవరి ఫొటోలు చూడాలన్నది నా ఇష్టం...అవసరం లేని విషయాల్లో నువ్వు తలదూర్చకు అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి కోపంగా చూస్తున్నావ్... నేనిప్పుడు ఎక్కడికి వెళ్లొస్తున్నానో తెలుసా, చెప్పనా... పోనీ ఆప్షన్లు ఇవ్వనా...
సాక్షి: చెప్తే చెప్పు లేదంటే మానెయ్
వసు: నేనెక్కడి నుంచి వస్తున్నానంటే...రిషి సార్ గదిలోకి....
సాక్షి: నువ్వు రిషి గదిలోకి వెళ్లావా
వుసు: రిషి సార్ ని చూడాలి అనిపించింది వెళ్లాను...ఆయన నిద్రపోతారని వచ్చేశాను. అయినా రిషి సార్ గదిలోకి నేను వెళ్లగలను, నువ్వు వెళ్లగలవా... ఒకవేళ వెళ్లినా నీ మనసులో ఓ కుట్ర పెట్టుకుంటావ్...కానీ నాకు ఓ క్లారిటీ ఉంది. సినిమాల్లో, కథల్లో చూడు...విలన్లు గెలిచినట్టు కనిపిస్తారు కానీ గెలవరు...
సాక్షి: ఈ మధ్య నీకు ధైర్యం చాలా ఎక్కువైంది 
వసు: ఏంటి సాక్షి నువ్వు..ఇప్పుడే కదా నేను కథ చెబితే జడుసుకున్నావ్... ధైర్యం అనేది పూలమొక్కలా రోజూ పెరగదు... పుట్టుకతో రావాలి... వెళ్లి పడుకో..
 
Also Read: శాడిస్ట్ లా తయారైన శౌర్య - హిమ అనుకుని రౌడీబేబీకి మళ్లీ ఐ లవ్ యూ చెప్పిన డాక్టర్ సాబ్


రూమ్ బాల్కనీ నుంచి వసు రూమ్ వైపు చూస్తుంటాడు. లేట్ గా పడుకుని ఉంటుంది నిద్రలేచిందా... వద్దు వద్దు అనుకుంటూ వసు గురించి ఆలోచిస్తున్నానేంటి..ఇంకోసారి ఆలోచించకూడదు... తనకు ఈ ఇంట్లో సౌకర్యంగా ఉంటోందా...అయినా ఇఫ్పుడే కదా తన గురించి ఆలోచించవద్దు అనుకున్నాను అనుకుంటాడు. అటు వసుధార రూమ్ లో ఏదో వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే రిషి వస్తాడు
రిషి: కాసేపైనా నిద్రపోయావా 
వసు: పడుకున్నాను సార్
రిషి: వర్క్ అయిపోయిందా...
వసు: మెయిన్ పాయింట్స్ రాసుకుని చెక్ చేసుకోవాలి అంతే
రిషి: ఏం వెతుకుతున్నావ్
వసు: పెన్సిల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను సార్...
వసు ఈ రోజు కొత్తగా కనిపిస్తోందని రిషి అనుకుంటే...రిషి సార్ ఏంటి అలా చూస్తున్నారని వసు అనుకుంటుంది.  వసుకి దగ్గరగా వెళతాడు రిషి...  ఓ రొమాంటిక్ సాంగ్ పడుతుంది అక్కడ. దగ్గరగా వెళ్లిన రిషి..వసు జుట్టు ముడికి పెట్టుకున్న పెన్సిల్ తీసి ఇస్తాడు.  పెన్సిల్ ని ఇలా కూడా వాడతారా అంే ఏదో ధ్యాసలో పడి అలా పెట్టాను సార్. 
రిషి: మర్చిపోవడం ఓ గొప్ప వరం కొందరికి మర్చిపోలేకపోవడం పెద్ద శాపం ఇంకొదరికి, పని ధ్యాసలో పడి టిఫిన్ చేయడం కూడా మర్చిపోయావా 
వసు: మిగిలిన కాస్త పని కంప్లీట్ చేసి  తింటాను సార్... మీరు ఎదురుగా ఉన్నా చెప్పాలేకపోతున్నాను...
రిషి: కొన్ని రోజుల నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది...
వసు: నాలో చాలా మార్పు వచ్చింది సార్.. ఇప్పుడే చెప్పేస్తాను..ఇంతకన్నా మంచి అవకాశం రాదనుకుంటూ మీకో మాట చెప్పాలి అంటుంది
నేను కూడా చెప్పాలని రిషి అంటే... నువ్వే చెప్పు నువ్వే చెప్పు అనుకుంటారు...
రిషి: కొందర్ని చూస్తుంటే నాకు అర్థం కాదు..అప్పటికప్పుడు మనసు మార్చుకుంటారు.. అప్పుడే అభిప్రాయం చెబుతారు ఆ వెంటనే ఇంకోటి చెబుతారు. మనుషులు మాట ఎందుకు మారుస్తారో చెప్పు...కష్టమైన నష్టమైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేమాటపై ఉండడం మంచి లక్షణం కదా...  రిషి సాక్షిని ఉద్దేశించి మాట్లాడతాడు.
ఏదో చెబుతానన్నావ్ కదా చెప్పు అని రిషిఅంటే... కొంచెం క్లారిటీ మిస్సైంది వర్క్ పూర్తయ్యాక అడుగుతాను అనేస్తుంది... తొందరగా రెడీ అయి వచ్చి టిఫిన్ చేయి అంటాడు రిషి.
వసు: నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది కానీ చెప్పే అవకాశం రాలేదు...నా మనసులో మాటని ఎక్కువ రోజులు దాచుకోలేను సార్ నేనే చెబుతాను...


Also Read: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని


సాక్షి-దేవయాని:  సాక్షి చేతికి రెండు కప్పులు ఇచ్చిన దేవయాని...నీకిదే అవకాశం...టైంతో పని లేకుండా పని చేస్తూ వసుధార మార్కులు కొట్టేస్తోంది..నీకేమో ఆ తెలివితేటలు లేవు. పొద్దున్నే కాఫీ ఇచ్చినవాళ్లు రోజంతా గుర్తుంటారట అని చెబుతుంటుంది.  నువ్వేదో తెలివైనదానివని ఫీలువుతున్నావేమో...నువ్విచ్చే చచ్చు పుచ్చు సలహాలు నాకు ఉపయోగపడవని నాకు తెలుసు. కానీ నాకు సపోర్టుగా ఉన్నావని నీ మాట వింటున్నట్టు నటిస్తున్నాను అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ధరణి...అత్తయ్యగారు కాఫీ అని అడిగితే.. నువ్వేం బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు అవసరం అయినప్పుడు నేను అడుగుతాను నీపని నువ్వు చేసుకో అనేసి వెళ్లిపోతుంది.  పొద్దున్నే సాక్షి చేతికి కాఫీ ఇచ్చి పంపించారంటే మళ్లీ ఏం కొత్త ప్లాన్ వేశారో అత్తయ్యగారు అనుకుంటుంది ధరణి.  సాక్షి రిషకి కాఫీ ఇవ్వాలని వస్తే... అలా కాఫీ అన్నాను ఇలా ఇచ్చావ్ థ్యాంక్యూ సాక్షి అని కాఫీ తీసుకుంటాడు గౌతమ్. ఇది నాకు అది రిషికి అనేసి గౌతమ్ తీసుకుంటాడు. ఛ..గౌతమ్ నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అనుకుంటుంది.


రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
నువ్వు కాఫీ తెచ్చావేంటి అని రిషి అడుగుతాడు...ఇంతలో అక్కడకు వచ్చి వసుధార కాఫీ కావాలిసార్ తల పగిలిపోతుంది అంటుంది. సరే ఇదే షేర్ చేసుకుందాం రా అని పిలిచి కాఫీ కప్ ఇస్తాడు. సాక్షి షాక్ లో నిల్చుని ఉండిపోతుంది. 


Also Read: అర్థరాత్రి వసు-రిషి కబుర్లు, విశ్వరూపం చూపిస్తానంటోన్న సాక్షి, ముందస్తు హెచ్చరికలు చేసిన గౌతమ్