'జబర్దస్త్' షోలో రష్మీ, సుధీర్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ని నడిపి భారీ రేటింగ్స్ ను రాబట్టారు. అయితే వారి మధ్య కెమిస్ట్రీ చూసిన చాలా మంది నిజంగానే రష్మీ, సుధీర్ లవర్స్ అనుకొని.. వారిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. చాలా కాలంగా వీరి పెళ్లి విషయం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ విషయంపై అటు సుధీర్.. ఇటు రష్మీ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.
కానీ ఈ పెళ్లి రూమర్స్ మాత్రం ఆగలేదు. తాజాగా గెటప్ శ్రీనుకి సుధీర్-రష్మీల పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు 'జబర్దస్త్' ఫేమ్ గెటప్ శ్రీను. సుధీర్ తో అతడికి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. వీరి కాంబినేషన్ లో కామెడీ స్కిట్స్ బాగా వర్కవుట్ అవుతుంటాయి. సుధీర్ తో క్లోజ్ రిలేషన్ ఉండడంతో గెటప్ శ్రీనుని సుధీర్-రష్మీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగాడు ఓ నెటిజన్.
దానికి గెటప్ శ్రీను.. 'సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరు. షూటింగ్ అయిపోయిన తరువాత రష్మీది వేరే లోకం, సుధీర్ ది వేరే లోకం.. జనాలను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వారు తెరపై అలా నటిస్తారు అంతేకానీ రియల్ కాదు' అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గెటప్ శ్రీను 'జబర్దస్త్' షో నుంచి తప్పుకున్నారు. ఆయన చేతులో పలు సినిమాలు ఉండడంతో షో నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరి ఫ్యూచర్ లో 'జబర్దస్త్'లో స్కిట్స్ చేస్తారో లేదో చూడాలి!