గుప్పెడంతమనసు జులై 13 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 13 Episode 501)
వసుని ముందుసీట్లో కూర్చోకుండా చేసి రిషి పక్కన కూర్చున్న సాక్షి...వసుని ఉడికించే పనిలో కావాలని యంగేజ్ మెంట్ విషయాలన్నీ మాట్లాడుతుంటుంది. అసెందుకు యంగేజ్ మెంట్ గురించి మాట్లాడుతోంది అనుకుంటాడు రిషి. తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ ఉండగా..వెనుక కూర్చున్న వసుని చూస్తుంటాడు రిషి.
సాక్షి: అంతా బావుంటే మనిద్దరికీ ఈ పాటికే పెళ్లై ఉండేది కదా
వసుధార: కారు ఆపుతారా
సాక్షి: దిగిపోతావా...
వసు: నేను దిగిపోవడం కాదు..అందరం దిగి వెళ్లాలి...ఇల్లు వచ్చేసింది మనం ముందుకు వచ్చేశాం
నాకేమైంది అనుకుంటూ కారు వెనక్కు తిప్పుతాడు రిషి...
రిషి-సాక్షి ఇంట్లోకి రావడం చూసి దేవయాని ముఖం వెలిగిపోతుంటుంది..జగతి-మహేంద్ర షాక్ అవుతారు....
ఏంటంకుల్ సాక్షితో వచ్చాడని గౌతమ్ అంటే అదే నాక్కూడా అర్థంకావడం లేదంటాడు మహేంద్ర...అప్పుడే వచ్చి రిషి పక్కనే నిల్చుంటుంది వసుధార...
హాయ్ వసుధారా రా అని జగతి, మహేంద్ర, గౌతమ్ ముగ్గురూ పలకరిస్తారు.... ( వీడేంటి ఇద్దర్నీ ఇంటికి తీసుకొచ్చాడు...ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదనుకుంటాడు గౌతమ్)
తనెందుకు వచ్చిందని దేవయాని అడగడంతో...కాలేజీకి సంబంధించిన వర్క్ ఉంది అందుకే వచ్చిందని చెబుతాడు రిషి...
రిషి నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా వర్క్ అంతా కంప్లీట్ చేస్తానంటుంది సాక్షి...
డాడ్ మీరుకూడా ఈ వర్క్ లో ఇన్వాల్వ్ అవండని ఆదేశిస్తాడు రిషి
వసు: సాక్షి ప్రోగ్రామ్ పేరుతో రిషికి దగ్గరవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. మొదట నన్ను బెదిరించింది, రిషి సార్ ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంది...ఇప్పుడు మంచితనం అనే ముసుగు వేసుకుని వచ్చింది...సాక్షికి దేవయాని మేడం తోడైంది...వీళ్ల ట్రాప్ లో పడకుండా రిషి సార్ ని కాపాడుకోవాలి...
జగతి: వసు ఏం ఆలోచిస్తున్నావ్
వసు: ఓ బాధ్యతను భుజానికెత్తుకున్నాను దాని గురించే ఆలోచిస్తున్నాను
సాక్షి దేవయానితో కలసి వెళితే...జగతి వసు మరోవైపు వెళతారు....
ఏమయ్యా గౌతమ్ ఏదో జరుగుతుంది అంటాడు మహేంద్ర
జగతి: రిషితో వచ్చావేంటి....
వసు: సాక్షి రిషి సార్ కి దగ్గరయ్యేందుకు చాలా ప్రయత్నిస్తోంది...నేను ప్రింట్ తీసిన ఫైల్ తను కొట్టేసి సార్ దగ్గర మార్కులు కొట్టేసింది. రిషి సార్ వెంట ఉండాలని తప్ప తనకు ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటప్పుడు ప్రాజెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగాలంటే నేనుకూడా రిషి సార్ తో ఉండాలి అనుకున్నాను. లక్కీగా రిషి సార్ రమ్మన్నారు..కాదనకుండా వచ్చేశాను
దేవయాని: నువ్వొచ్చావ్ బానేఉంది..మళ్లీ రిషితో వసుని ఎందుకు తీసుకొచ్చావ్
సాక్షి: ప్రయత్నించాను కానీ..తెగేవరకూ లాగడం ఎందుకని వదిలేశాను...
దేవయాని: ఈ ప్రాజెక్ట్ వంకతో రిషి మనసులో స్థానం సంపాదించాలి...ఎంతో కష్టపడితే కానీ కోపంగా ఉన్న రిషి మనసు మార్చలేకపోయాం...ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నావని నమ్మించి నీపై ఉన్న చెడు అభిప్రాయం తీసెయ్యగలిగాను...ఇప్పుడు రిషి మనసులో నువ్వు తెల్లకాగితం..రిషి నిన్ను పెళ్లి చేసుకోవాలి, వసుని రిషి మర్చిపోవాలి...
సాక్షి: నేనేంటో నా టాలెంట్ ఏంటో చూపిస్తాను....
గౌతమ్ ఏదో ఆలోచిస్తూ రూమంతా తిరిగేస్తుంటాడు...ఇంతలో అక్కడకు వచ్చిన రిషితో..
గౌతమ్: అసలు నువ్వు బాష తెలియని పుస్తకం లాంటోడిరా..కొనుక్కో గలం కానీ చదువుకోలేం... అలా ఉంటుంది నీతో ప్రెండ్ షిప్.
రిషి: ఏంట్రా నీ ప్లాబ్లెమ్
గౌతమ్: ఇంటికి సాక్షి-వసుధార ఇద్దరూ ఎందుకు వచ్చారు
రిషి: ప్రాజెక్ట్ గురించి వచ్చారు
గౌతమ్: వసుకి ప్రాజెక్ట్ పై అవగాహన ఉంది వచ్చింది... సాక్షి ఎందుకొచ్చినట్టు
రిషి: సాక్షికి ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే ఇంట్రెస్ట్ ఉంది అందుకే వచ్చింది
గౌతమ్: అసలు సాక్షి నాకు నచ్చలేదు.. ఓ చిక్కుముడి విప్పాక మరో చిక్కుముడి విప్పుకుంటాం..కానీ నువ్వు చిక్కుముడులు విప్పడానికి బదులు కొత్త చిక్కుముడులు వేసుకుంటాం. నువ్వేం చేస్తున్నావో, ఎటు వెళుతున్నావో క్లారిటీ ఉందా... ( మీకు క్లారిటీ లేదన్న వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు రిషి)
రిషి: నాకు కొన్ని విషయాలపై క్లారిటీ ఉంది, మరికొన్ని విషయాలపై క్లారిటీ లేదు...కానీ తెచ్చుకుంటాను. సాక్షి విషయంలో అవసరానికి మించి ఆలోచించవద్దు... అనవసర విషయాలు ఆలోచిస్తే నీకే ప్రాబ్లెమ్
గౌతమ్: నేను ఇంతసేపు నీతో మాట్లాడాను కదా..ఒక్క ప్రశ్నకు అయినా అర్థం అయ్యేట్టు సమాధానం చెప్పావా...చెప్పవ్..చెబితే రిషివి ఎందుకవుతావ్... భోజనానికి రా...
రిషి: గౌతమ్ అడిగినదాంట్లో అర్థం ఉంది..కానీ నా క్లారిటీ నాకుంది....
దేవయాని: అదేంటో కొందరు వడ్డిస్తే అసలు తినబుద్ధే అవదు
వసు: క్షుదా తురాణం నరుచి న పక్వం అన్నారు పెద్దలు
దేవయాని: అంటే..
వసు: ఆకలేసిన వారికి రుచిగా ఉందా లేదా అనేది అవసరం ఉండదని అర్థం మేడం
మహేంద్ర: నిజంగా ఆకలేస్తే మిగిలిన విషయాలు ఏవీ పట్టించుకోరన్నది దాని భావం..
గౌతమ్: బాగా చెప్పావ్ వసుధారా...
దేవయాని: సాక్షి నువ్వుకూడా ఏదైనా చెప్పు మంచిగా...
సాక్షి: ఉప్పుకప్పురంబు అని చెప్పగానే అంతా నవ్వుతారు...నాకు అదే తెలుసు నేను అదే చెప్పాను
జగతి: అంతే కదా అక్కయ్యా..ఎవరికి ఏం తెలుసో అదే మాట్లాడుతారు...
రిషికి వడ్డించేందుకు వసుధార వెళ్లడం చూసి సాక్షి నువ్వు వడ్డించు అంటుంది దేవయాని.. పర్లేదు రిషి అంటూ వెళ్లి రిషిపై వాటర్ పోసేస్తుంది చూసుకోకుండా.... రిషి వెళ్లి మరో చైర్లో కూర్చుంటాడు. ( గతంలో వసుధార పొరపాటున వసు వంపేసినప్పుడు తనని తిట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది వసుధార- సాక్షి నువ్వేం ఫీలవకు పొరపాటున తగిలి పడింది కదా ఓకే అంటాడు)
వచ్చి కూర్చోమ్మా వసుధార అంటాడు మహేంద్ర....రిషి పక్కన కూర్చుంటుంది...
అంతా భోజనం చేస్తారు... సాక్షి మాత్రం వసుని తినేసేలా చూస్తుంటుంది....
రిషి: ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు
మహేంద్ర: బాబూ గౌతమూ ఓ పాట పాడు
రిషి: భోజనం అయ్యాక వర్క్ పై కూర్చుందాం
వసు: ఇక్కడ కూడా ఆర్డర్స్ వేస్తున్నారు..ఇది ఇల్లా కాలేజీనా ( ఆ మాట విన్న రిషి ఏదో అంటున్నావ్ అంటాడు)
వసుధారా నీ మనసులో ఏముందో నన్నెందుకు రిజెక్ట్ చేశావో ఎలా తెలుసుకోవాలి అనుకుంటాడు రిషి....
Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి
అంతా కలసి ప్రాజెక్ట్ వర్క్ మొదలు పెడతారు. ఈ చదువుల పండుగను పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి ఈవెంట్ లా అందరికీ తెలిసేలా చేద్దాం అంటుంది సాక్షి... వెంటనే స్పందించిన వసుధార మనం చేసేపనిలో బాధ్యత కనిపించాలి కానీ హంగు, ఆర్భాటాలు కనిపించకూడదు అంటుంది.... ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
నిద్ర వస్తోంది కాఫీ తాగితే బావుంటుంది అనుకుంటుంది వసుధార... ఇంతలో రిషి కాఫీతెచ్చి ఇస్తాడు.... థ్యాంక్స్ మేడం అనేసి ఆ తర్వాత రిషిని గమనిస్తుంది. ఏదో చెప్పాలి అన్నావ్ అని రిషి అంటే మనసులో మాట చెప్పేయాలి అనుకుంటుంది.