Guppedantha Manasu Rishi:  గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ కావడంతో యువత బాగా కనెక్టైంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు. కాలేజీ ఎండీగా మెప్పిస్తున్నాడు ముఖేష్ గౌడ. స్టైలిష్ గా, ఈగో ఉన్న వ్యక్తి, మంచోడిగా, కోపిష్టిగా, జెంటిల్మెన్ గా, ప్రిన్స్ గా ఇలా రకరకాల వేరియేషన్స్ తో అమ్మాయిల మనసు గెలుచుకున్నాడు. ఆ పాత్రలో తనని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేనంతగా నటిస్తున్నాడు. తల్లి ప్రేమను కోల్పోయిన బాధ, తల్లి కారణంగా తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిపై అంతులేని ప్రేమ, తాను ఎంతో మంచిది అనుకున్న పెద్దమ్మ సవతి ప్రేమ, అనుక్షణం నీడలా వెంటాడుతూ మృత్యువును పరిచయం చేస్తున్నాడని తెలుసుకోకుండా అన్నయ్యపై అభిమానం, తండ్రి ఆనందం కోసం ఏదైనా చేసే కొడుకుపాత్రలో ముఖేష్ గౌడ నట అద్భుతం. ఇదంతా నటనా జీవితం.. అయితే తన వ్యక్తిగత జీవితంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ముఖేష్ తండ్రి కన్నుమూశారు.
కొన్నేళ్లుగా ఇంటి దగ్గర్నుంచే చికిత్స అందించే ఏర్పాట్లు చేశాడు ముఖేష్. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. సంతాపం ప్రకటిస్తూనే తామున్నామంటూ ధైర్యం చెబుతున్నారు ముఖేష్ గౌడ అభిమానులు.


Also Read: గుప్పెడంతమనసులో ఉప్పెన, కాలేజీ నుంచి రిషి ఔట్ - కొడుకుపై నిందవేసిన జగతి!


ఓసారి  ఓ అవార్డు ఫంక్షన్‌లో తన తండ్రిని అందరికీ పరిచయం చేశాడు ముఖేష్. ఆ సందర్భంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉంటే.. అన్నీ తానై చూసుకున్నాడు రిషి. "మా నాన్నను నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి జీవితంలో ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా లైఫ్‌లో జరిగింది" అంటూ రిషి తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. తండ్రికి తినిపిస్తూ, గడ్డం గీస్తూ.. అన్ని సేవలూ చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకున్నాడు రిషి. నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న ముఖేష్ గౌడ...కొడకుగా కూడా నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు. 






Also Read: తెగించేసిన శైలేంద్ర, తలొంచిన జగతి, కాలేజీకి దూరమైపోనున్న రిషి!


మోడలింగ్‌తో కెరియర్ స్టార్ట్ చేసిన ముఖేష్ గౌడ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెల్చుకున్నాడు. అయితే ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'నాగకన్నిక' అనే సీరియల్‌తో హీరోగా  అడుగుపెట్టాడు. 'ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగులోకి వచ్చినా గుర్తింపు తెచ్చిన  సీరియల్ మాత్రం  ‘గుప్పెంత మనసు’. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసుకు ఎంతో దగ్గరైన ముకేశ్.. తన తండ్రిని కోల్పోయాడని తెలిసి పలువురు సెలబ్రెటీలు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులంతా అండగాఉంటామంటూ పోస్టులు పెడుతున్నారు.