గుప్పెడంతమనసు మే 23 ఎపిసోడ్
రిషి టేబుల్‌పై ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ చెక్‌లను దొంగతనం చేసిన శైలేంద్ర వాటిని బిల్డర్ సారథికి ఇస్తాడు. సారథి ద్వారా మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్‌ను రిషి అక్రమంగా వాడుతున్నట్లు మినిస్టర్‌కు కంప్లైంట్ ఇస్తాడు. ఇందులో నిజాలేమిటో తెలుసుకోవాలని అనుకున్న మినిస్టర్ వసుధారకు ఫోన్ చేసి జగతితో కలిసి తన ఛాంబర్‌కు రమ్మని పిలుస్తాడు. జగతితో కలిసి వసుధార మినిస్టర్ ఆఫీస్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటోంది.ఇంతలోనే వారి గదిలోకి వచ్చిన శైలేంద్ర ఆ చెక్‌లను సారథికి వసుధారనే ఇచ్చిందని ఆరోపిస్తాడు. ఎందుకిలా చేశావ్? దేనికోసం చేశావ్ అని వసుధారపై నిందలు వేస్తాడు. రిషి ఎప్పుడూ అలాంటి తప్పులు చేయడు. నాకు తెలుసి అది నువ్వే చేశావ్ అని కోపంగా వసుధారపై అరుస్తాడు. రిషి సార్ పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగించే పని నేను ఎప్పుడూ చేయనని క్లారిటీ ఇస్తుంది వసుధార. శైలేంద్ర ఇక వదిలెయ్ అన్న జగతి..నువ్వు కానీ-రిషి కానీ తప్పు చేయరు వసు..ఇది ఎవరో చేసిన కుట్ర అని ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిపడేస్తుంది జగతి.
Also Read: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర
మినిస్టర్ ఛాంబర్‌కు వసుధార బయలుదేరుతుండగా అడ్డుపడతాడు శైలేంద్ర. జగతిని బ్లాక్‌మెయిల్ చేసి వసుధార మినిస్టర్ ఛాంబర్‌కు రానీయకుండా చేస్తాడు. దాంతో జగతి, శైలేంద్ర కలిసి మినిస్టర్ దగ్గరకు వెళతారు. చెక్ విషయాన్ని రిషికి చెప్పొద్దని వసుధారతో అంటుంది జగతి. శైలేంద్రతో కలిసి మినిస్టర్ దగ్గరకు బయలుదేరుతుంది జగతి. కారును ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తుండటంతో జగతి భయపడుతుంది.
శైలేంద్ర: ఇప్పుడే నేను తలచుకుంటే నీ ప్రాణాలను గాల్లో కలిపేయగలను
జగతి:రిషిపై నాకు ఉన్న ప్రేమ, నా ధైర్యం రెండు ఎప్పటికీ తగ్గవు
శైలేంద్ర: కోట్ల రూపాయల చెక్‌పై రిషి, వసుధార దొంగ సంతకం నేనే చేశాను. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అనడంతో జగతి షాక్ అవుతుంది...రిషి, వసుధార సంతకాన్ని ఫోర్జరీ చేసి సారథికి ఇచ్చి మినిస్టర్‌ను కలిసేలా చేశాను. రిషిపై ఉన్న అసూయ, ద్వేషంతోనే ఇవన్నీ చేశాను
రిషి హీరో అవుతుంటే...నేను జీరో అయితే చూస్తూ ఉండాలా? అది జరగదు. వాడిని జీరోను చేసి నేను హీరో అవ్వాలనే ఈ పనిచేశాను
జగతి: ఎమోషనల్ అయిన జగతి...మోసం చేస్తూ నా కొడుకు ఇబ్బంది పెట్టొద్దంటుంది
శైలేంద్ర: మినిస్టర్‌గారితో నేను చెప్పినట్టే నువ్వు చెప్పాలి
జగతి: నేనెప్పుడూ అబద్దం చెప్పను
శైలేంద్ర: నా మాట వినకపోతే నువ్వు మట్టిలో కలిసిపోతావు
జగతి: నా ప్రాణాలు పోయినా రిషి పేరుప్రతిష్టలకు భంగం కలిగే పని చేయను
శైలేంద్ర : నువ్వు బతికి ఉన్నా లేకపోయినా రిషి ఈ ఈష్యూలో ఇరుక్కొని జైలుకు వెళతాడు. వాడితో పాటు ముద్దుల శిష్యురాలు వసుధార కూడా జైలుకు వెళుతుంది. రిషి మెడికల్ కాలేజీ కల ఆగిపోతుంది. డీబీఎస్‌టీ కాలేజీ మూతపడుతుందని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు
జగతి: కన్నీళ్లు పెట్టుకున్న జగతి.. ఇప్పుడు రిషిని కాపాడుకోవడం ముఖ్యం, కాలేజీ ప్రతిష్టను కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం అని చెబుతుంది. అందుకోసం ఏం చేయాలని శైలేంద్రను బతిమిలాడుతుంది
శైలేంద్ర: డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ సీట్‌లో నేను కూర్చవాలి. అందుకు రిషి, వసుధార ఈ దేశంలోనే ఉండకూడదు. నువ్వే దగ్గరుండి వారిని ఎక్కడికైనా దూరంగా పంపించు అంటూ మినిస్టర్ దగ్గర ఏం చెప్పాలో వివరిస్తాడు.
Also Read: మే 23 రాశిఫలాలు, ఈ రాశివారు జీవితానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు
వసుధార, జగతి కోసం మినిస్టర్ ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అతడి ఛాంబర్‌లోకి శైలేంద్రతో కలిసి జగతి అడుగుపెడుతుంది. వసుధార రాలేదా అని జగతిని అడుగుతాడు మినిస్టర్. వసుధార ఇంపార్టెంట్ పనిలో ఉండి రాలేకపోయిందని జగతి బదులూ శైలేంద్ర సమాధానం చెబుతాడు. శైలేంద్ర సమాధానంతో మినిస్టర్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సారథి దగ్గర ఉన్న చెక్ గురించి జగతిని ఆరాతీస్తాడు మినిస్టర్. ఈ చెక్‌ను అతడి దగ్గరకు ఎలా వచ్చిందని అడుగుతాడు. ఇంతలోనే సారథిపై శైలేంద్ర కోపంతో ఆరుస్తాడు. ఇదంతా ఫ్రాడ్ అని, నమ్మకంగా ఉంటాడని ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్‌ను తానే సారథికి ఇచ్చానని యాక్టింగ్ మొదలుపెడతాడు. ఈ చెక్ నాకు రిషి, వసుధార ఇచ్చారని అంటాడు. నా తమ్ముడు వీడికి చెక్ ఇచ్చి ఉండదు. రిషి ఎప్పుడూ తప్పు చేయడు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేస్తే నమ్మడానికి ఎవరూ లేరని శైలేంద్ర అంటాడు. రిషిని అడ్వాన్స్ అడిగితే తన అకౌంట్‌లో డబ్బులు లేవని అన్నాడని, ఆ తర్వాత పిలిచి ఈ చెక్ ఇచ్చాడని చెబుతాడు. శైలేంద్ర, సారథి ఇద్దరు కలిసి తమ మాటలతో మినిస్టర్ మనసులో అనుమానాలు రేకెత్తిస్తారు.
మినిస్టర్: రిషి డబ్బు మనిషి కాదు ఇదంతా ఏదో కుట్రలాగా ఉంది
సారధి: మా దగ్గర ఆధారాలున్నాటి చెక్‌పై వారి సంతకాలు కూడా ఉన్నాయని, దీనిపై ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు తెలుస్తాయి
సారథి మాటలతో కోపంగా శైలేంద్ర...సారథి కాలర్ పట్టుకుంటాడు. మినిస్టర్ వారిద్దరిని వారిస్తాడు. రిషి తప్పు చేశాడనటానికి పక్కాగా ఆధారాలు ఉన్నాయని జగతితో చెబుతాడు మినిస్టర్ . ఏం చేయాలన్నది మీరే చెప్పాలని అంటాడు. శైలేంద్ర తనకు వార్నింగ్ ఇవ్వడంతో జగతి నిజాన్ని మినిస్టర్‌కు చెప్పలేకపోతుంది. శైలేంద్ర ప్లాన్ ప్రకారమే తప్పు చేసిన వారిని నిలదీద్దామని మినిస్టర్‌తో అంటుంది. ఆమె మాటలతో మినిస్టర్ ఆలోచనలో పడతాడు.
తన కారణంగానే రిషి పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి రావడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రాత్రి రిషి నిద్రపోయిన తర్వాత ఆ గదిలోకి వస్తుంది జగతి. అనుకోకుండా అప్పుడే మేల్కొన్న రిషి...జగతిని తన రూమ్‌లో చూసి ఆశ్చర్యపోతాడు. ఎపిసోడ్ ముగిసింది.