గుప్పెడంతమనసు ఫిబ్రవరి 23 ఎపిసోడ్ (Guppedanta Manasu February 23rd Update)


ధరణి వంట చేసుకుంటూ ఉండగా మహేంద్ర గేమ్స్ ఆడుకుంటాడు. ఇంతలో జగతి..ధరణిని పిలిచి వంట విషయంలో సహాయం చేయాలా అని అడగితే వద్దులే చిన్న అత్తయ్య అని అంటుంది. అక్కయ్య ఎక్కడికి వెళ్లారని అడిగితే.. నేను వచ్చేసరికి పెద్ద అత్త ఇంట్లో లేరు అనడంతో వెంటనే మహేంద్ర వదిన బయటకు వెళ్ళింది అంటే ఎవరికో మూడిందని అర్థం అంటాడు. ఎందుకు మహేంద్ర అలా మాట్లాడుతావు అని జగతి అంటుండగా..దేవయాని-రిషితో కలసి రావడం చూసి ఆశ్చర్యపోతారు.


రిషి:నేను మీతో తర్వాత మాట్లాడతాను పెద్దమ్మ మీరు ఇంకోసారి ఇలా చేయకండి
దేవయాని: అది కాదు రిషి 
రిషి: పెద్దమ్మా ఇప్పటివరకు మీరు నా బాగోగులు చూసుకున్నారు నేను కాదు అనను కానీ మా విషయంలో మాత్రం మీరేం మాట్లాడకండి ఆ విషయం గురించి నేనే ఆలోచిస్తాను . మీరు దయచేసి ఇంకొకసారి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లొద్దు మళ్ళీ నేను ఇలా మీకు చెప్పే పరిస్థితిని తీసుకురాకండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మహేంద్ర, జగతి, ధరణి ముసిముసిగా నవ్వుకుంటూ ఉండగా అదిచూసి దేవయాని కోపంతో రగిలిపోతుంటుంది. 


Also Read: నాకు-వసుకి మధ్య మీరెందుకు పెద్దమ్మ అంటూ షాక్ ఇచ్చిన రిషి, దేవయానికి చక్రపాణి వార్నింగ్


వసుధార పాటలు వింటూ పని చేసుకుంటూ రిషి గురించి తనలో తానే మాట్లాడుతూ ఉంటుంది.అప్పుడు చక్రపాణి బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. నేను ఎందుకు వచ్చాను...ఇదే మాట వసుధార అడిగితే నా దగ్గర సమాధానం ఏముంది అనుకుంటూ సమాధానం ఉందిలే అనుకుంటాడు. ఇంతలో వసుధార...తండ్రి ఇంట్లోనే ఉన్నాడు అనుకుని... నాన్నా ఏం చేస్తున్నారు ఆ టిపాయ్ ని ఖాళీ చేయండి..నేను ఉప్మా చేస్తున్నాను అంటుంది. ఆ తర్వాత నాన్న ఇటురండి అని పిలుస్తుంది...రిషి వెళ్లి వెనుకే నిల్చుంటాడు..అప్పుడే వెనుక్కు తిరిగిన వసుధార రిషిని చూసి అలాగే ఉండిపోతుంది...( బ్యాగ్రౌండ్ లో ఓ రొమాంటిక్ సాంగ్). ఇంతలోనే ఉప్మావైపు తిరిగి మళ్లీ వెనక్కు తిరిగే సరికి రిషి అక్కడ ఉండడు..రిషి సార్ వచ్చినట్టు భ్రమపడ్డానా అనుకుంటుంది వసుధార..ఇంతలో చక్రపాణి వచ్చి రిషి సార్ అని పిలవడంతో ఆశ్చర్యపోయి కిచెన్లోంచి బయటకు వస్తుంది వసుధార..
వసుధార: సార్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చారా లేక అప్పుడే వచ్చారా లేక ఇదంతా నా భ్రమనా  అనుకుంటూ... అక్కడికి వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ 
రిషి మౌనంగా ఉంటాడు...చక్రపాణి కాఫీ తీసుకుని వచ్చేందుకు వెళతాడు
వసుధార: సర్ ఇందాక మీరు కిచెన్ లోకి వచ్చారా 
రిషి: కిచెన్ లో నాకేం పని అదేమైనా నాకు హాబీ నా 
వసు:ఇంకా నా మీద కోపం తగ్గలేదా సార్
రిషి:  పెన్ను,పెన్సిల్ తీసుకుంటే వచ్చే కోపం కాదు..పోవడానికి..
వసు: అన్నీ వివరంగా చెప్పానుకదా సార్
రిషి: వివరాలు నాకు అక్కర్లేదు...
వసు: పొద్దున్నే వచ్చారు సార్ 
రిషి: ఓ పెన్ డ్రైవ్ ఇచ్చి..ఇందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీటైయిల్స్ ఉన్నాయి. ఇవి నువ్వు ప్రజెంట్ చేయొచ్చు 
వసు: ఈ కోపం ఎన్నాళ్లు సార్..నావల్ల పొరపాటు జరిగింది 
రిషి: పొరపాటు కాదు వసుధార తప్పు జరిగింది .. మరోసారి అడుగుతున్నాను నీ మెడలో ఉన్న తాళిని తీసేస్తావా తీయలేవు కదా 
చక్రపాణి అక్కడికి కాఫీ తీసుకొస్తాడు..రిషి సార్ ఉప్మా తింటారని వసుధార అంటుంది..ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా రిషి అక్కడినుంచి వెళ్లిపోతాడు..


జగతి మహేంద్ర ఇద్దరూ కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు. రిషి-వసుధార ప్రాబ్లెమ్ ఓ కొలిక్కి వచ్చింది కదా పెళ్లిచేద్దాం అని ఉంది కానీ రిషి ఒప్పుకోడేమో అని మహేంద్ర అంటే.. రిషి మాటని గౌరవిద్దాం నువ్వు తొందరపడకు అంటుంది జగతి. 


Also Read:  ఫిబ్రవరి 23 రాశిఫలాలు, ఈ రాశులువారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు


కాలేజీలో స్టూడెంట్స్ తో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వసుధార మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వచ్చి వసుధార మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు వసుధార బోర్డు మీద రాస్తుండగా రిషి సైలెంట్ గా వెళ్లి ఏమీ తెలియనట్టుగా ఒక బెంచ్ లో కూర్చుంటాడు. అప్పుడు వసుధార రిషి ని పట్టించుకోకుండా మిషన్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తూ ఉంటుంది. వసు మాత్రం అక్కడ రిషి సార్ ఉన్నట్టు అనిపిస్తోంది అదంతా నా భ్రమే అనుకుంటుంది. ఆ తర్వాత రిషి నిజంగానే వచ్చాడని గమనించి సార్ ఎప్పుడొచ్చారని అడుగుతుంది
రిషి: నా ఉంగరం నాకు ఇచ్చేయ్ 
వసు:ఎలా ఇస్తారు సార్ నేను ఇవ్వను 
రిషి:ఎందుకు ఇవ్వవు 
వసు: అందులో నా పేరు కూడా ఉంది సార్..వి అక్షరం నాకు ఇచ్చి ఆర్ తీసుకోండి 
రిషి: అలా ఎలా సాధ్యమవుతుంది 
వసు: మన పేర్లు కాదు సార్ కలిసిపోయింది మన ఆత్మలు మన బంధం కలిసి పోయింది. మెడలో తాళి బయటకు చూపిస్తూ ఈ రెండు అక్షరాలు ఎప్పటికీ ఇలాగే కలిసిపోవాలి మనం కూడా కలిసే ఉండాలి 
రిషి: బంధం అంటే బాధ పెట్టడం అని ఎక్కడైనా ఉందా వసుధార అంటూ బాధగా మాట్లాడి నువ్వే ఆలోచించు.. తప్పు నువ్వు చేశావ్ శిక్ష నాకుపడింది..ఇది ఎంతవరకూ కరెక్టో నువ్వే ఆలోచించు  అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు వసుధార తనలో తానే మాట్లాడుకుంటూ అప్పుడు ఏదో జరిగిపోయింది సార్...కానీ ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే ఎలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది.