పేదవాళ్ళకి తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలని అమ్మ కోరిక దాన్ని తీర్చాలని అనుకుంటున్నట్టు దివ్య చెప్తుంది. చాలా మంచి ఆలోచన అని నందు దివ్యని మెచ్చుకుంటాడు. మనం కూడా కేఫ్ లో పేదవాళ్ళకు ఫ్రీ గా ఫుడ్ పెడదామా అని లాస్య వెటకారంగా అంటుంది. నువ్వు వెటకారంగా అన్న నా మనసులో ఆలోచన అదే ఉందని నందు అంటాడు. జాబ్ రేకమెండేషన్ చేస్తానని అభి అంటాడు కానీ దివ్య మాత్రం వద్దని తనే స్వశక్తితో జాబ్ సెర్చ్ చేసుకుంటానని చెప్తుంది. ఆ మాటలు విని తులసి సంతోషంగా ఉంటుంది.


Also Read: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం


అభి, అంకితకి బిడ్డలు లేరని తులసి బాధపడుతుంది. వాళ్ళకి ఇంకా వయస్సు ఉంది కంగారు పడాల్సిన పని లేదులే అని పరంధామయ్య ధైర్యం చెప్తాడు. చదువు పూర్తయింది కదా దివ్యకి పెళ్లి చేద్దామని పరంధామయ్య అంటాడు. పిల్లల గురించి ఆశలు ఉంటాయి కాదనను కానీ ఈ కాలంలో పిల్లలు పెళ్లి కంటే జీవితంలో సెటిల్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తులసి అంటుంది. ఇవే కాదు విడాకులు తీసుకున్న తల్లికి బిడ్డగా మంచి సంబంధం కొంచెం కష్టమే అని బాధపడుతుంది. వాళ్ళ మాటలు అన్నీ లాస్య విని దివ్యని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ వేస్తుంది. దివ్య ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి బయల్దేరుతున్నానని చెప్తుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నావ్ కదా డ్రాప్ చేస్తానని నందు అంటాడు. కానీ దివ్య మాత్రం తులసితో వెళ్తానని చెప్తుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు నా వెంటే ఉండాలని దివ్య అడుగుతుంది.


Also Read: దిండ్లు పెట్టి జంప్ అయిన స్వప్న, కనిపెట్టేసిన కావ్య- రాజ్ పెళ్లి ఎవరితో జరగనుంది?


రాజ్యలక్ష్మి హాస్పిటల్ కి దివ్య ఇంటర్వ్యూకి వస్తుంది. ఆ హాస్పిటల్ ఎండీ వచ్చినా కూడా దివ్య తనని పట్టించుకోకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండటం చూసి రాజ్యలక్ష్మి సీరియస్ లుక్ ఇచ్చి వెళ్తుంది.. హాస్పిటల్ పెట్టింది ఫ్రీ సర్వీస్ చేయడానికి కాదు బిజినెస్ చేయడానికి అని రాజ్యలక్ష్మి అంటుంది. తన కొడుకు సంజయ్ అమ్మాయిల పిచ్చోడిలా కనిపించేశాడు. కనిపించిన అమ్మాయి మీద మోజు పడి తనవైపు తిప్పుకోవాలని ట్రై చేస్తాడు. దివ్యని ఇంటర్వ్యూ చేస్తారు. వీడియో కాన్ఫిరెన్స్ లో దివ్యని రాజేశ్వరి చూస్తూ ఉంటుంది. యారగెంట్ అనుకున్నా ఓబిడియంట్ గానే ఉందని అనుకుంటుంది. తర్వాత తనకి జాబ్ ఇస్తున్నట్టు రాజేశ్వరి చెప్తుంది. దీంతో దివ్య చాలా సంతోషంగా థాంక్స్ చెప్తుంది. కానీ రాజేశ్వరి అక్కడే ఫిట్టింగ్ పెడుతుంది. హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్ కి అవసరం ఉన్నా లేకపోయినా కనీసం ఐదు టెస్ట్ లు రాయాలని చెప్పేసరికి దివ్య షాక్ అవుతుంది. 


ఇక ఇప్పటి వరకు లాస్య, గాయత్రిలు విలన్ గా కథ నడిపించారు. ఇప్పడు మూడేళ్లు ముందుకు జరిపేసి దివ్య ఎంట్రీ చూపించారు. తనతో పాటు సీరియల్ కి కొత్త విలన్ కూడా వచ్చింది. తనకి దివ్య, తులసి ఇద్దరూ ఎదురుతిరుగుతారు. ఇప్పుడు దివ్య జీవితం ఎటు పోతుందో చూడాలి మరి.