రాజ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్వప్న రాహుల్ తో చెప్తుంది. కావ్య వచ్చి తనని తీసుకుని ఇంటికి వెళ్తుంది. రాజ్ వాళ్ళ కుటుంబానికి స్వప్న ఒక చిన్న స్టోరీ అల్లి చెప్పి నమ్మిస్తుంది. వాళ్లిద్దరీ జాతకం చూసిన పంతులు మూడు నెలల వరకు ముహూర్తం లేదని అంటాడు. ఆ మాటకి కుదరదని కనకం అని తన అక్క ఆస్ట్రేలియా వెళ్తుందని మరొక అబద్ధం చెప్తుంది. వారంలో తను వెళ్ళిపోతుంది అందుకే అంత దూరంలో ముహూర్తం అంతే కుదరదని అంటుంది. అయితే వారంలో మంచి ముహూర్తం చూడమని చెప్తారు. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. డబ్బు ఉంటే చాలు నాలుగు రోజుల్లో కూడా పెళ్లి చేయవచ్చని రుద్రాణి అంటుంది. పెళ్లి అంత త్వరగా పెట్టుకోవడంతో స్వప్న బిక్కమొహం వేస్తుంది.
Also Read: ఫుల్ ఖుషీగా తులసి కుటుంబం- లాస్యకి పెద్ద షాక్ ఇచ్చిన దివ్య
ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు. తను అనుకున్నట్టే జరిగిందని రుద్రాణి ఇప్పుడు నడిపిస్తా అసలు కథ అని మనసులో అనుకుంటుంది. కావ్య ఇంటి బయట కిటికీలో నుంచి లోపల జరుగుతున్న నిశ్చితార్థం చూస్తుంది. అప్పు వచ్చి కనకం, స్వప్న వాళ్ళని కాసేపు తిడుతుంది. సొంత బిడ్డల్ని బిడ్డలు అని చెప్పుకోకుండా అమ్మ ఈ పెళ్లి చేస్తుంది ఇది జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి అని అప్పు అరుస్తుంది. అక్క మన రక్తం పంచుకుని పుట్టినదే కదా అని పెళ్లి చూపులు పెట్టుకుని గంటలు గంటలు బయట ఉంది అయినా తనని రాజ్ క్షమించాడని కావ్య చెప్తుంది. ఇక నిశ్చితార్థం జరిగినందుకు స్వప్న చిరాకుగా వెంటనే రాహుల్ కి కాల్ చేస్తుంది. రాజ్ గురించి మీకు తెలుసు మరి నేను ఎలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నారని స్వప్న అంటుంది. తనకి కూడా బాధగా ఉందని రాహుల్ నటిస్తాడు.
మీతో పర్సనల్ గా కలిసి మాట్లాడాలి అని స్వప్న అంటుంది. సరే అంటాడు. కోటీశ్వరురాలిని చేసుకోవాలని అనుకున్నావ్ కానీ నేను తనని దక్కించుకుంటానని రాహుల్ అనుకుంటాడు. రాజ్ కంటే ఎంతో ఆస్తిపరుడైన రాహుల్ ని చేసుకుంటున్నా అని స్వప్న మనసులో అనుకుంటుంది. వారంలో పెళ్లి ఏంటని రాజ్ తండ్రి శుభాష్ అందరి మీద అరుస్తాడు. ఆ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుందో మన ఇంటికి కోడలిగా వస్తే ఇక్కడే ఉండాలి కదా అని అంటాడు. కానీ ఇంట్లో వాళ్ళందరూ శుభాష్ కి నచ్చజెప్పడంతో సరే అనేస్తాడు. అన్నయ్య త్వరలో పెళ్లి కొడుకు అవబోతున్నాడని చెల్లెలు ఆట పట్టిస్తుంది. కనకం మీద భర్త కృష్ణమూర్తి అరుస్తాడు. పెళ్లి చూపుల టైమ్ లో ఇంట్లో ఉండకుండా పార్లర్ కి వెళ్ళిపోయిన దాన్ని నమ్మి ఎలా చేస్తామని అంటాడు.
Also Read: రుద్రాణి ప్లాన్ సక్సెస్, రాజ్ పెళ్లి ఖాయం- రాహుల్‌తో లేచిపోయేందుకు స్వప్న స్కెచ్
పెళ్లి చేయడానికి అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొస్తావని భర్త నిలదీస్తాడు. కావ్యకి మంచి పేరు ఉంది తను వెళ్ళి అడిగితే అప్పు పుడుతుందని కనకం చెప్తుంది. పెళ్లి కోసం అప్పులు, అబద్దాలు చెప్పి నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకని అంటాడు. రాజ్ ని ఆట పట్టించడానికి మరదలు, చెల్లెలు వస్తారు. పెళ్లి కదా మీరిద్దరూ రాత్రి పూట కూడా మాట్లాడుకోవడం లేదా అని రేఖ అంటుంది. స్వప్న మనస్పూర్తిగా పెళ్లికి ఒప్పుకుందా అని రాజ్ అనుమానిస్తాడు. రాజ్ తో పెళ్లి చూపులు జరిగాయంట కదా అని అప్పు కావ్యకి కంగ్రాట్స్ చెప్తుంది. దేవుడి కరుణించి రాజ్ తో నీ పెళ్లి జరిగేలా చేస్తే నీ ఇంట్లో దాసిగా పని చేస్తానని అప్పు అంటుంది. నేనేమీ స్వప్నని కాదని కావ్య చెప్తుంది. అందరూ వస్తున్నారని తెలిసి కూడా అక్క పెళ్లి చూపుల దగ్గర లేకుండా పార్లర్ కి వెళ్ళడం ఏంటని అప్పు అనేసరికి కావ్య స్వప్న మీద అనుమానపడుతుంది. అబద్దం చెప్పి అక్కడికి ఎందుకు వెళ్లిందో కనుక్కోవాలని అనుకుంటుంది. కావ్య స్వప్న గదికి వస్తుంది. అప్పుడే రాజ్ స్వప్నకి కాల్ చేస్తాడు. ఫోన్ వస్తుందని కావ్య తనని లేపుదామని చూసేసరికి దుప్పటి కింద దిండ్లు పెట్టి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఈ టైమ్ లో అక్క ఎక్కడికి వెళ్ళిందని డౌట్ పడుతుంది.