గుప్పెడంతమనసు ఆగస్టు 31 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 31 Episode 543)


కాలేజీలో పరీక్షల హడావుడి నడుస్తుంటుంది. అంతా సవ్యంగా జరిగేలా చూసుకుందాం అని మహేంద్ర, జగతి, మిగిలిన స్టాఫ్ కి చెప్పేసి రిషి వెళుతుండగా వసుధార ఎదురుపడి థ్యాంక్యూ సార్ అని చెబుతుంది. మనసులోనే మురిసిపోతాడు రిషి. అటు వసుధార ఎగ్జామ్ హాల్లో కూర్చుని రిషి ఇచ్చిన పెన్ చూసుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే లోపలకు వచ్చిన రిషి మనసులో
రిషి: ఈ పరీక్షలు నీకే కాదు నాక్కూడా..నిన్ను నీ లక్ష్యం వైపు నడిపేందుకు ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధం
వసు: నాపై నాకన్నా మీకే ఎక్కువ నమ్మకం ఉంది అది నిలబెట్టుకుంటాను
రిషి: నీ నీడలా ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను ఇదే రిషి వాగ్ధానం అనుకుంటాడు
రిషి వెళ్లిపోయిన తర్వాత పరీక్ష రాసుకుంటుంది వసుధార. 
వసుధార పరీక్ష ఎలా రాసిందో, ఎన్ని మార్కులు స్కోర్ చేసిందో..కాలేజీలో ఏమీ మాట్లాడలేదు..ఓసారి కాల్ చేయనా అనుకుని పరీక్షలు అయ్యేవరకూ మాట్లాడకూడదనే షరతు గుర్తుచేసుకుంటాడు. తనైనా అర్థం చేసుకుని మెసేజ్ పెట్టొచ్చు కదా అనుకుంటండగా గౌతమ్ వస్తాడు అక్కడకు. 
గౌతమ్: నీలో నువ్వే మాట్లాడుకోవాలా మాతో కూడా మాట్లాడొచ్చు కదా..నీ మానసిక పరిస్థితిని ఫ్రెండ్ గా నేను అర్థం చేసుకుంటానంటూ..నీ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం నాకు తెలుసంటూ వసుకి కాల్ చేస్తాడు.
రిషి: తిన్నాదా అడుగు అని సైగ చేస్తాడు..
గౌతమ్: నేను తిన్నానురా అని కామెడీ చేశాక..వసుధారా తిన్నావా అని అడుగుతాడు
వసు: తిన్నాను 
గౌతమ్: పరీక్ష ఎలా రాశావ్..లాస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఎలా రాశావ్ అని రిషి చెబితే అడుగుతాడు
వసు: లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఉంటుందని మీకెలా తెలిసింది..స్పీకర్ ఆన్సర్ చేశారా... ఏం చదువుతున్నాననే కదా అడుగుతున్నారు..చదువుకోవాలి సార్, కాసేపు రిలాక్సేషన్ కోసం మా ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి.. గౌతమ్, రిషి షాక్ అయి చూస్తుండగా..చందమామతో అని చెబుతుంది. 
గౌతమ్: రిషి ఏదో చెప్పబోతుంటే..ఇక నీ గాలి  ఊదుడు ఆపు అంటాడు.  ఇంతలో రిషి ఫోన్ లాక్కుంటాడు. వసు మాత్రం అటువైపు నేను టైమ్ కి తింటాను, చదువుకుంటాను..ఇలా డిస్టబ్ చేయకూడదని చెప్పి అందరికీ గుడ్ నైట్ అంటుంది..


Also Read: వంటింట్లో ఇల్లాలు - ఇంట్లో ప్రియురాలు -బావుందయ్యా డాక్టర్ బాబు!
రెండో పరీక్ష జరుగుతుంటుంది. వసు చుట్టూనే రిషి తిరుగుతూ ఉంటాడు..రిషిని చూస్తూ పరీక్ష రాస్తుంటుంది వసుధార. అలా పరీక్షలు జరుగుతుంటాయి. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వసు-పుష్పని చూసిన రిషి.. పుష్పతో మాట్లాడుతున్నట్టు వసుతో మాట్లాడతాడు. అటు మర్నాడు ఉదయం మహేంద్ర సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కాలేజీకి టైమ్ అయింది వెళదాం పద అంటుంది 
మహేంద్ర: సంతోషం అనాలో, బాధ అని చెప్పాలో అర్థం కావడం లేదు. పరీక్షలు అయిపోతే వసు-రిషి మధ్య గ్యాప్ వస్తుందని మనసులో అనిపిస్తోంది.ఇద్దర్నీ ఒక్కటి చేసేది ఎలా 
జగతి: పరీక్ష బాగా రాస్తుంది..తన విజయాన్ని చూసి రిషి పొంగిపోతాడు..ఇప్పుడప్పుడే తనని డిస్టబ్ చేయొద్దు
ఇంతలో రిషి, గౌతమ్ వస్తారు..వెళదాం డాడ్ అని రిషి అంటే..ఓ కాఫీ తాగి వెళదాం అంటాడు మహేంద్ర.... పరీక్షలు, స్టూడెంట్స్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని ఎంట్రీ ఇస్తుంది...
రిషి: మన కాలేజీ సాధించే విజయాలకు పెద్దమ్మ చాలా సంతోషిస్తారు తెలుసా
మహేంద్ర: వదినగారు మన కాలేజీ విజయాలకు, నీ విజయాలకు మనస్ఫూర్తిగా పొంగిపోతారు..మొన్న ఫేర్ వెల్ పార్టీకి స్వీట్స్ చేయించినట్టే ఈసారి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో 
వదినా అని రిషి పిలుస్తాడు...( ధరణి క్యారెక్టర్ మార్చారు)
దేవయాని: నాకేం వద్దు ..నీకు ఏమైనా కావాలా రిషి
రిషి: చూశారా డాడ్..పెద్దమ్మ నాగురించే ఆలోచిస్తుంటుంది
మహేంద్ర: నీ విజయాలకూ ఆనందిస్తారు..వసుధార విజయాలకూ ఆనందిస్తారు
దేవయాని: కాలేజీకి టైమ్ అవుతోంది నువ్వెళ్లునాన్నా
కాఫీ వద్దులే వదినా అనేసి...ఈ పరీక్షలు అవగానే మీకో గుడ్ న్యూస్ చెబుతానంటాడు. ఇప్పుడే చెప్పొచ్చుకదా అంటే..  వసుధార గొప్ప విజయం సాధించి, కాలేజీకి మంచి పేరు తెస్తుంది కదా అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి అనేసి పదండి అంటాడు రిషి...
వాళ్లు వెళ్లగానే కాఫీ ఇవ్వు అంటుంది దేవయాని..ఇందాక వద్దన్నారనగానే ఇప్పుడు కావాలంటున్నాకదా ఇవ్వు అంటుంది...
అందరి మనసుల్లో ఆ వసుధార ఉంది..ఈ ఇంటి సొంత మనిషిలా చూస్తున్నారు ఏం చేయాలి..వసుధార అన్న పేరు, ఆలోచనే రిషి మనసులో లేకుండా చేయాలి అనుకుంటుంది  దేవయాని...


Also Read: మనసు మాట్లాడమంటోంది షరతు వద్దంటోంది - ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే!


ఇప్పటికీ చదవడమేనా..ఇంక ఒక్క పరీక్ష అయిపోగానే ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతాం కదా అనుకుంటారు. అందర్నీ వదిలి వెళుతున్నందుకు నీకు బాధలేదా..మళ్లీ మనం అందరం కలుస్తాం అనే నమ్మకం నాకులేదంటుంది పుష్ప... రిషి ఎంట్రీ ఇస్తాడు..ఎప్పటిలా మనసులో మాట్లాడుకుంటారు...పరీక్షలు బాగా రాశారా అని అడుగుతాడు. 
ఎపిసోడ్ ముగిసింది....