జగతి, మహేంద్రతోపాటు అందరం కలిసే ఉందామని రిషి ఇచ్చిన షాక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్క రిషి పెద్దమ్మ దేవయాని మినహా ఈ నిర్ణయంపై అంతా హ్యాపీగానే ఉన్నారు. ఇంట్లో ఉండేందుకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలంటూ జగతిని ప్రశ్నిస్తుంది దేవయాని. ఇదే విషయాన్ని ఒంటిరిగా ఉన్న రిషిని వెళ్లి అడుగుతుంది జగతి
జగతి: మహేంద్రతో కలిసి ఇంటికి రమ్మన్నావు. నువ్వు అని పిలిచే చనువు నాకు ఉందని అనుకుంటున్నాను. అందుకే నువ్వు అని పిలుస్తున్నాను. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నన్ను ఏ హోదాలో ఈ ఇంటికి రమ్మంటున్నావ్..
రిషి- మేడం సూటిగా అడిగారు కాబట్టి సూటిగా సమాధానం చెబుతాను. నాకు డాడ్ అంటే ఇష్టం. డాడ్‌కు మీరు అంటే ఇష్టం. డాడ్ నా దగ్గర ఉంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ దగ్గర ఉంటే నేను డాడ్‌ను మిస్ అవుతున్నాను. మన ఇద్దరి మధ్యలో డాడ్ నలిగిపోతున్నారు. డాడ్ వెనుకబడిపోతున్నారు. డాడ్ పడిపోతున్నారు. డాడ్ పడిపోవడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతా వ్యక్తిత్వ పరంగా ఉన్నతంగా ఉండాలి. ఏ హోదాలో రావాలని అని అడిగారు. రావాలి అనుకుంటే ఏ హోదాలో రావాలో ఆలోచించాల్సిన అవసరం లేదు. వద్దనుకుంటే ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. రావాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. డాడ్ కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఆయన కష్టపడాలి అని మీరు అనుకుంటే మీ నిర్ణయాన్ని మీరే తీసుకోండి. డాడ్ కోసం ఆలోచిస్తూ నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. డాడ్ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఏంటో మీకూ తెలుసు, నాకూ తెలుసు.
జగతి- ఆ ఒక్కటేంటో నాకు తెలుసు రుషి. అమ్మగా నన్ను ఒప్పుకోవు కదా రిషి(రిషి తన డైలాగ్ చెప్తుండగానే మనసులో అనుకుంటుంది జగతి)
రిషి-ఆ ఒక్కటి ఎప్పటికీ జరగదు. అందరూ శరీరానికి పచ్చబొట్టు వేసుకుంటే నా మనసుకు ఇష్టం లేని పచ్చబొట్టులా అది మిగిలిపోయింది. మీరు డాడ్ కోసం ఉండిపోండి. లేదంటే వెళ్లిపోండి. డాడ్ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అందరి ముందూ చెప్పాను. తన మీద మీకు ఎంత గౌరవం ఉందో మీరు నిరూపించుకోండి.
జగతి- రిషి నువ్వు ఎంత తెలివైనవాడివో తెలుసు. కానీ ఇంత తెలివిగా నన్ను ఇరికిస్తావని నేను అనుకోలేదు. మహేంద్రపై నాకు ఎంత ప్రేమ ఉందో పరీక్ష పెడుతున్నావా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి నన్ను నెట్టేశావా? (మనసులో అనుకుంటుంది జగతి)
రిషి- మేడం, నా మనసులో మాట చెప్పాను. మీరు ఎప్పటికీ ఆయన భార్యగానే ఉంటారు. మీ ఇద్దరి కోసం నేను ఒక మెట్టు దిగి ఆలోచించాను. మీరు ఇంకా అక్కడే ఉండి ఆలోచిస్తున్నారు. డాడ్ కోసం మీ ఆలోచనలను , దారిని మార్చుకోలేరా.. నా దృష్టిలో ఎలాగో మంచి తల్లి కాలేకపోయారు. ఒక మంచి భార్యగా ఉంటారని ఆశిస్తున్నాను. (వెళ్లిపోతూ చెబుతాడు)
ఈ డైలాగ్ చెబుతున్నప్పుడు మహేంద్రం తన గది కిటికిలోంచి చూస్తూ బాధతో చూస్తుంటాడు. ఆయన్ని రిషిగానీ, జగతి గానీ అబ్జర్వ్ చేయరు. మొహంపైనే రిషి చెప్పిన మాటలకు లోలోనే కుమిలిపోతుంది జగతి. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ ఎర్రబడ్డ కళ్లతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో ఉండిపోతుంది. ఆమె చూసి మహేంద్ర కూడా దీనంగా మొహం పెడతూ తలదించుకుంటాడు.
సీన్ కట్ చేస్తే తెల్లారిపోతుంది.
రిషి, వాళ్ల పెద్దనాన్న ఫణీంద్రభూషణ్ హాల్‌లో కూర్చొని పేపర్ చదువుతుంటారు. వంటింట్లో ధరణి ఉంటుంది. జగతీ అని పిలుస్తూ మహేంద్ర వస్తాడు. అక్కడ ధరణిని చూసి తడబడతాడు. వెంటనే ధరణి అందుకొని...
ధరణి- మామయ్య గారూ.. చిన్నత్తయ్య గారు ఇక్కడి రాలేదు.
మహేంద్ర- రాకపోవడమే ఇళ్లంతా వెతికాను. ఇంట్లో లేది కదా.
ధరణి- ఇంట్లో లేకపోవడమేంటి మామ్మయ్యగారు.
మహేంద్ర- అవును ధరణి, అంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఇవాళ మనింట్లో జగతి చేతితో కాఫీ తాగుదామనుకున్నాను.
వీళ్ల డిస్కషన్ కొనసాగుతుండగానే దేవయాని ఎంట్రీ ఇస్తుంది.
దేవయాని- ఏంటి ధరణీ, పొద్దున్నే ఏదో గొప్ప చర్చే పెట్టుకున్నట్టు ఉన్నారు. ఏమైంది మహేంద్ర.
మహేంద్ర- వదినా అది... జగతీ... జగతీ కనిపించడం లేదు.(ఇది విన్న దేవయానికి ఆనందం, షాక్, బాధ పడుతున్నట్టు ఇలా అన్ని కలగలిపిన ఎక్స్‌ప్రెస్ పెడుతుంది. ) మీరు ఏమైనా చూశారా
దేవయాని- ఏంటీ( బీభత్సమైన కన్నింగ్ ఫేస్ పెట్టి)జగతి కనిపించడం లేదా?
ఆ మాటకు మహేంద్ర, ధరణి ఏదో చెబుతుంటే వినకుండానే దేవయానికి ఏవండీ అని పిలుస్తూ హాల్‌లోకి వెళ్లిపోతుంది. ఆమెను పిలుస్తూ మహేంద్ర, దేవయాని వెనకాలే వెళ్తారు. తర్వాత సీన్ హాల్‌లోకి మారుతుంది.
దేవయాని- ఏవండీ... ఏవండీ.. విన్నారా.. జగతి ఇంట్లో కనిపించడం లేదు.
ఆ మాట విన్న ఫణింద్ర, రిషి ఇద్దరూ షాక్ అవుతారు. లేచి నిలబడతారు.
ఫణీంద్ర- జగతి ఇంట్లో కనిపించకపోవడం ఏంటి దేవయానీ?
దీన్ని సాకుగా చూపి తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది దేవయాన్ని. సిశ్చుయేషన్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సీన్‌కు మంచి మసాలా దట్టించి ఎక్కిస్తుంది.
దేవయానికి- మీకు ఇంకా అర్థం కాలేదా? తన మొహం చెల్లక వెళ్లిపోయిం ఉంటుందండీ.
ఈ డైలాగ్ విన్న మహేంద్ర షాక్ తింటాడు. రిషి మాత్రం రాత్రి ఆమె మేడపై జరిగిన డిస్కషన్ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏ హోదాలో రమ్మన్నావనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్లాష్ అవుతుంది. ఇంతలో ఫణీంద్ర అందుకొని దేవయానిని గద్దిస్తాడు.
ఫణీంద్ర- మొహం చెల్లకపోవడం ఏంటి దేవయానీ? అర్థం లేకుండా మాట్లాడకు.
దేవయాని- ఏవండి నేను మాట్లాడే వాటిలో మీకు నచ్చనవి ఉంటాయేమో కానీ నేను చెప్పినవన్నీ నిజాలేనండీ. ఇప్పటికైనా అర్థమైందా? తను ఎప్పుడూ స్వతంత్రురాలే. అంతా తన ఇష్టమే. రిషి పాపం పెద్దమనుసు చేసుకొని ఇంట్లో ఉండమన్నాడు. మహేంద్ర సంబరపడ్డాడు. మేమంతా సంతోషించాం. చూశారా. రాత్రికి రాత్రే చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందంటే... ఎవర్ని గౌరవించినట్టూ... ఆ... అంటే ... రిషి మాటంటే లెక్కలేదా రిషితో పని లేదంటూ మొహం చెల్లకుండా వెళ్లిపోయిందా?
దేవయాని రాజేసిన నిప్పుతో రిషికి కోపం వస్తుంది.
రిషి- ఏంటి డాడ్ ఇది? మీ నిర్ణయాన్ని ఉదయం లోపు చెప్పమంటే... తెల్లారక ముందే మీరు నిర్ణయం తీసుకున్నారా?
ఇంట్లో ఈ డిస్కషన్ నడుస్తుండగానే ధరణి తన మనసులో ఏదేదో ఆలోచిస్తోంది. చిన్నత్తయ్య ఎందుకు వెళ్లిపోయిందో అంటూ మనసులోపలే అనుకుంటుంది. అలా వెళ్లిపోదు కదా అనుకుంటుంది. అది విన్నట్టుగా అనేలా ఫణి అందుకుంటాడు.
ఫణీంద్ర- జగతి అలా చేయదుగా, మర్యాదగా ఉంటుంది కదా.
దేవయాని- ఇంకా మర్యాద ఎక్కడండీ? తనను ఇంటికి పిలిచి మర్యాదగా చెబితే మనం మన పరువు తనకు లెక్కలేనట్టుగా జగతి వెళ్లిపోయింది. ఏం మహేంద్ర... నీక్కూడా చెప్పకుండా వెళ్లిపోయిందంటే... తను దృష్టిలో నీ స్థానమేంటో ఇప్పటికైనా అర్థమైందా
తనకు ఇక్కడ ఉండే అర్హత లేదని తనకు అర్థమైపోయింది. ఏ అర్హతతో ఉంటుందని తనకు కూడా నిజం తెలిసిపోయిందేమో
దేవయానికి డైలాగ్స్ నడుస్తుండగానే ఫణింద్ర గుమ్మం వైపు చూస్తారు. ద్వారం వద్ద వసుధార, జగతి ఇద్దరూ నిలుచొని ఉంటారు. వెంటనే చిటికేసి రజనీకాంత్ స్టైల్‌లో దేవయానికి సైగ చేస్తాడు.
ఫణీంద్ర- దేవయానీ... ఒక్కసారి అటు చూడు.
దేవయానీతోపాటు రిషి, మహేంద్ర, ధరణి అంతా చూస్తారు. దేవయాని బిత్తరపోతుంది. రిషి, మహేంద్ర ఆశ్చర్యపోతారు. ధరణి మొహం వెలిగిపోతుంది. ఫణింద్ర మొహంలో ఆనందం తాండవిస్తుంది. జగతి తీసుకొచ్చిన బ్యాగ్‌ను చూస్తు దేవయానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
మహేంద్ర గుమ్మం వద్దకు ఎదురొస్తూ ఏంటి జగతి ఇది... ఎక్కడి వెళ్లిపోయావంటూ ప్రశ్నిస్తాడు. ఏంటిది మేం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అంటూ అడుగుతాడు. చెప్పకుండా వెళ్లడమేంటి జగతి అని ప్రశ్నిస్తాడు.
మహేంద్ర- ఏమనుకోవాలి. నాక్కూడా చెప్పకుండా వెళ్తే ఎలా? చెప్పు.
మహేంద్ర ఇన్ని అడుగుతున్నా జగతి సమాధానం చెప్పకుండా తల దించుకొని ఆలోచిస్తుంటుంది.
దేవయాని - వెళ్లిపోయింది అనుకుంటున్న దరిద్రం మళ్లీ వచ్చిందేంటి. అదీ సూట్‌కేస్‌తో వచ్చిందేంటి (మనసులో అనుకుంటుంది)
ఇంతలో జగతి రియాక్ట్ అవుతుంది.
జగతి- నేను వెళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వసుధార. రెండు నా నిర్ణయం. మన అందరం ఇక్కడే ఉన్నాం. వసు ఒంటరిగా ఉందని నేను తన దగ్గరకు వెళ్లాను.
ఈ డైలాగ్ విన్న రిషి షాక్ అవుతాడు. ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదంటూ మనసులో అనుకుంటాడు. తను ఒంటరిగా ఉంటుందని నేను ఆలోచించలేకపోయాను అని అనుకుంటాడు.
దేవయాని- బాగానే ఆలోచించావు. చెప్పి వెళ్లొచ్చు కదా.
ఫణీంద్ర- దేవయానీ...తను వెళ్లానని చెబుతోంది కదా. మళ్లీ ఏంటీ..
జగతి- లేదు బావగారూ.. రాత్రి ఎవర్నీ డిస్టర్బ్ చేయకూడదనే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి. నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.
ఈ డైలాగ్ చెబుతూనే సూట్‌కేస్‌తో జగతి ఇంట్లో అడుగుపెడుతుంది. ఆమె కుడికాలు ఇంట్లో పెట్టడం... దేవయాని మొహం ఎర్రబడ్డం రెండూ ఒకేసారి చూపిస్తారు. మహేంద్ర, ఫణీంద్ర, ధరణి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. రా అంటూ మహేంద్ర జగతిని ఆహ్వానిస్తాడు. ఆమె వసుధారను పిలిచింది. ఈ సీన్‌లో అందరి కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటుంది. రిషి, జగతి మొహంలో మాత్రం అర్థం కాని ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి.
జగతి- ఇంటికెళ్లి నాకు కావాల్సిన పుస్తకాలు, బట్టలు తెచ్చుకున్నాను. అక్కయ్యా... నేను వెళ్లేటప్పుడు నీకు చెబుతామనుకున్నాను. మీరు వెళ్లనిస్తారో లేదో అనుకున్నాను.(ఇక్కడ ధరణి, వసుధార ముసిముసి నవ్వులతో కనిపిస్తుంటారు) అయినా వచ్చేశాను కదా మీరు సంతోష పడతారనే అనుకుంటున్నాను.(ఈ డైలాగ్ విన్న దేవయాని... మొత్తానికి ఉండిపోవడానికి వచ్చినట్టే ఉంది. నేను అంత గట్టిగా మాట్లాడేసరికి ఉండదేమో అనుకున్నాను. అంటూ మనసులో గొనుగుతుంది.) వసుధారకు గురువుగా నా బాధ్యత నెరవేర్చాను. ఈ ఇంటి కోడలిగా బాధ్యతల కోసం వచ్చాను.(మళ్లీ దేవయానికి మొహం కోపంతో ఎర్రబడుతుంది. మిగతా అంతా నవ్వుతారు. ) నన్ను ఒకరు నా అర్హతను ప్రశ్నించారు. అడిగిన అన్ని ప్రశ్నలకు నేను వేసిన అడుగే సమాధానం.
ఇలా చెబుతూనే నన్ను ఆశీర్వదించండీ బావగారూ అంటూ పణీంద్ర కాళ్లకు నమస్కారం చేస్తుంది జగతి. చల్లగా ఉండమ్మా అని ఆయన దీవస్తాడు.
జగతి- వసూ నువ్వ కాలేజీకి వెళ్లాలి ఆ విషయం మర్చిపోకు.
వసుధార- సరే మేడం.
ధరణి- చిన్నమామయ్యగారూ... టిఫిన్ చేద్దాం రండి.
ఫణీంద్ర- ఎస్... అందరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం రండీ.
రిషి- మీరు కానివ్వండి. నాకు పని ఉంది. ఇప్పుడే వస్తాను.
ఫణీంద్ర- సరే పదండి అందరం,.. బ్రేక్ ఫాస్ట్ చేద్దాం.. నువ్వు కూడా రా.
దేవయాని- నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే ఇదంతా జరుగుతుంది రుషీపోయింది అనుకున్న జగతిని మళ్లీ తెచ్చిపెట్టావు. తప్పు చేశావు రిషి. నీ తప్పును తప్పకుండా సరిదిద్దుతాను. (మనుసులో అనుకుంటుంది)
రూమ్‌లోకి వచ్చిన రిషి ఏదో ఆలోచిస్తుంటాడు. తను వెళ్లిపోయిందని తెలిసి... డాడ్ కూడా వెళ్లిపోతారేమో అని నా దగ్గర ఉండరేమో అని టెన్షన్ పడ్డాను. రేపటి నుంచి పొద్దునే డాడ్‌ను చూడొచ్చు. గుడ్‌మార్నిగ్ చెప్పొచ్చు. డాడ్‌తో కలిసి తినొచ్చు. డాడ్ ఇక ఎక్కడీ వెళ్లరు. డాడ్ నాతోనే ఉంటారు. అని మనసులో అనుకుంటుండగానే
వసుధార ఒంటరిగా ఉందని వెళ్లాను అన్న మాట రిషి మైండ్‌లో ఫ్లాష్ అవుతుంది. తన గురించి నేను ఈ రకంగా ఎందుకు ఆలోచించలేకపోయాను అనే గిల్ట్ ఫీల్ అవుతుంటాడు.
కట్ చేస్తే సీన్ కాలేజీకి షిప్ట్ అవుతుంది.
వసుధార చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటుంది. పుట్టిన రోజు నాడు రిషి చెప్పిన మాట గుర్తుకు వస్తుంటుంది. రిషి సార్‌ను అప్పుడప్పుడు తిట్టుకున్నానేమో గానీ.. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో నిజంగా మీరు జంటిల్‌మెన్ అని మనసులో అనుకుంటుండగానే రిషి కారు ఎంట్రీ ఇస్తుంది.
ఈ వసుధార ఎక్కడ ఉందీ అనుకుంటూ కారు దిగుతాడు. వసు కోసం వెతుకుతుంటాడు. అలా కాలేజీ బిల్డింగ్ వైపు చూస్తాడు. అప్పుడెప్పుడో బిల్డింగ్ ఎక్కి వసు చేసిన హంగామా గుర్తుకు వస్తుంది. బర్త్‌డే రోజు వసుధార కౌగిలించుకున్న సంగతి కూడా గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు దూరంగా వెళ్లి థాంక్స్ చెప్పింది. ఇప్పుడు అదే థాంక్స్ దగ్గరకు వచ్చి చెప్పింది. వసుధారలో ధైర్యం పెరిగిందా... మా ఇద్దరి మధ్య దూరం తగ్గిందా... అని మనసులో అనుకొని ముందుకు వెళ్తే ఒంటరిగా కూర్చొని ఉన్న వసుధార కనిపిస్తుంది.
డాడ్ విషయంలో ఒక మెట్టు దిగానని ఏమైనా అనుకుంటుందా... వాళ్ల మేడం గెలిచిందని అనుకోవడం లేదు కదా ఈ వసుధార అని అనుకుంటాడు. వెళ్లి మాట్లాడుదాం అంటాడు.
తనవైపు వస్తున్న రిషిని చూసి ఇలా తలచుకున్నానో లేదో అలా ప్రత్యక్షమైపోయారు అంటూ మనసులో అనుకుంటుంది. కౌగిలింత ఎపిసోడ్ గుర్తుకు తెచ్చుకొని రిషి సార్ మనసులో ఏమైనా అనుకున్నారా అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది.
తర్వాత ఎపిసోడ్-
ఫణి, మహేంద్ర, జగతి ఓ హాల్‌లో కూర్చొని ఉంటున్న టైంలో రిషి ఎంట్రీ ఇస్తాడు. అదే టైంలో జగతి వెళ్లిపోతుంటుంది. రా రుషి ఇంటి నుంచి క్యారేజ్ వచ్చిందంటూ పణీంద్ర పిలుస్తాడు.
నేను ఇక్కడ ఉంటే రిషి తినడేమో అంటూ జగతి అనుకుంటుండగానే సారీ పెదనాన్న మీరు కానివ్వండి అంటూ డోర్ క్లోజ్ చేస్తాడు. వెంటనే వసుధార వద్దకు వచ్చి లంచ్ చేశావా అని అడుగుతాడు. లంచ్ అంటూ ఆమె తడబడుతుంది. వెంటనే పదా లంచ్ చేద్దామంటూ రిషి పిలుస్తాడు. వెంటనే వసుధార రియాక్ట్ అయ్యి మీరు కూడా ఇంకా తినలేదా అంటూ ఎక్స్‌ప్రెషన్ పెడుతుంది. మేడం మీకు భోజనం అంటుండగానే... లంచ్ చేద్దాం పదా అని అన్నాను అంటూ రిషి చిరాకుగా మొహం పెడతాడు. దానికి ఆన్సర్ ఇది కాదేమో అంటూ వెళ్లిపోతాడు.