ఆరేళ్లక్రితం మొదలైన కార్తీకదీపం సీరియల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య సీరియల్ అయిపోతుందంటూ వార్తలొచ్చినా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను చంపేసి నెక్ట్స్ జనరేషన్ తో సీరియల్ కొనసాగిస్తున్నారు.  ఇంతకీ అసలు విషయం ఏంటంటే సీరియల్ గురించి కాదు డిస్కషన్...ఇందులో వంటలక్క గురించి...


Also Read: రిషికి హగ్ ఇచ్చి దేవయానికి షాకిచ్చిన వసుధార, మహేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు
సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉండే ప్రేమీ విశ్వనాథ్..తాజాగా ఓ కీలక ప్రకటనను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. పలు ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ వివరాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్, అకౌంటెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కావాలంటూ అందుకు అర్హతలు ఏంటనేది పేర్కొంది. ''అన్ని రకాల ఫోర్ వీలర్ (ఆటోమేటిక్, మాన్యువల్) డ్రైవర్లు కావలెను. ఇందుకు అర్హత వాహనాలు నడపడం వచ్చి ఉండాలి. అలాగే అకౌంటెంట్ ఉద్యోగాలకు tally వచ్చిన అభ్యర్థులు కావలెను. ఈ ఉద్యోగానికి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంపికైన వారు కొచ్చిలోని ఎర్నాకులంలో పని చేయాల్సి ఉంటుంది'' అని తన ప్రకటనలో పేర్కొంది. వంటలక్క ఇచ్చిన ప్రకటన ఇస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి ఓ రేంజ్ లో రియాక్షన్ వస్తోంది.. 


 






Also Read: బస్తీలో ఉన్న ఇంట్లో తండ్రి కార్తీక్ ఫొటో చూసి షాక్ అయిన మోనిత కొడుకు ఆనంద్, జ్వాలకి తెలిస్తే ఏం జరగుతుంది
'కార్తీకదీపం' సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది వంటలక్క. బుల్లితెర బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కగా జీవించేసింది. పుట్టినప్పటికి నుంచీ ఎన్నోకష్టాలు అనుభవించిన వంటలక్క..డాక్టర్ బాబుని చేరుకుంది ఇక సంతోషంగా ఉంటుంది అనుకునే సమయంలో ఆ రెండు క్యారెక్టర్స్ ని చంపేశారు. దీంతో వంటలక్క ఫ్యాన్స్ చాలా నిరాశచెందారు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు చనిపోవడంతో వారి నెక్స్ట్ జనరేషన్ తో సీరియల్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా సాగిస్తున్నారు.