కార్తీకదీపం (Karthika Deepam) ఏప్రిల్ 14 గురువారం ఎపిసోడ్


సౌందర్య:  హిమ ఎవరి బండిపై వెళుతోంది..నన్ను చూసి కూడా ఎందుకు ఆగడం లేదనుకుంటూ సౌందర్య వాళ్లను ఫాలో అవుతుంది. కంగారుపడిన హిమ... త్వరగా పోనీ జ్వాలా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య హిమలో చాలా మార్పు కనిపిస్తోంది ఏం జరిగి ఉంటుంది..ఈ మార్పు మంచిదే అయినా సడెన్ గా హిమలో మార్పేంటో అర్థంకావడం లేదనుకుంటూ కారు స్పీడు పెంచుతుంది సౌందర్య. నాకన్నా స్పీడ్ గా వెళుతున్నారేంటి కావాలనే నన్ను తప్పించుకునేందుకే అలా చేస్తున్నారా...హిమ ఎందుకిలా చేస్తోంది, అసలు బైక్ పై ఉన్న అమ్మాయి ఎవరు అని అనుకుంటుంది. అటు హిమ మాత్రం జ్వాలని స్పీడ్ స్పీడ్ అంటూ హడావుడి పెడుతుంది. సౌందర్య కారు ఓ సెడన్ గా ఆగిపోవడంతో హిమ హమ్మయ్య అనుకుంటుంది...ఇంతలో మళ్లీ స్టార్ట్ చేసి ఫాలో చేస్తుంది. ఇక తప్పించుకునే ఛాన్స్ లేదనే ఉద్దేశంతో బండి ఆపు జ్వాలా అని చెప్పి కిందకుదిగి నువ్వెళ్లిపో అంటుంది. నువ్వెక్కడ దిగాలో చెప్పు దింపేసి వెళతా అంటుంది జ్వాల. కానీ హిమ కోపంగా నిన్నెళ్లమని చెప్పాను కదా అని ఫైర్ అవడంతో...అబ్బో నీకు కోపం కూడా వస్తోందే అనుకుంటా నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.  నువ్వు బైక్ పై ఎందుకు వెళుతున్నావ్, నన్ను చూసి కూడా ఎందుకు ఆపడం లేదని సౌందర్య అడిగితే..ఆటో అమ్మాయితో వెళుతున్నా ఓ పేషెంట్ ని చూసేందుకు అని చెప్పిన హిమ అన్నీ రోడ్డుపైనే మాట్లాడుకోవాలా..కళ్లు తిరుగుతున్నాయ్ కార్లో వెళుతూ మాట్లాడుకుందామా అంటుంది. 


Also Read: రిషి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక మహేంద్ర-జగతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు


జ్వాల ఇంకా రాలేదేంటి ఆకలేస్తోందని అనుకున్న సత్యం ( సౌందర్య అల్లుడు)...కాల్ చేద్దామా అనుకునే లోగా బండిపైనుంచి దిగి వస్తుంది. నువ్వొచ్చావ్ క్యారేజీ బాక్స్ ఏదమ్మా అనగానే మా అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అంటుంది. నువ్వు అసిస్టెంట్ ని కూడా పెట్టుకున్నావా అనేలోగా ఆటోలోంచి ప్రేమ్ కిందకు దిగుతాడు. వీడా నీ అసిస్టెంట్ అని నవ్వుతాడు సత్యం. నువ్వేంట్రా ఆటోలో అనగానే....
ప్రేమ్: డాడీ మీరేం మాట్లాడకండి...క్వశ్చన్స్ అన్నీ దార్లో మమ్మీ అడిగింది, చెప్పలేక నా తలప్రాణం తోకకు వచ్చింది... మనింటికి ఆటో అమ్మాయి రావొద్దు,  ఫుడ్ వద్దు...కావాలంటే నేనే వంటనేర్చుకుని చేస్తాను...షెఫ్ ని అవుతాను...మీకు దండం పెడతాను డాడీ అర్జెంట్ గా ఈ తిక్కని ఇక్కడి నుంచి పంపించెయ్...
సత్యం: ఏం జరిగింది...అమ్మా జ్వాలా నువ్వైనా చెప్పొచ్చుకదా...
జ్వాల: దార్లో రెగ్యులర్ చెకింగ్ కోసం పోలీసులు ఆపారంటూ మొదలుపెట్టి జరిగిన విషయం చెబుతుంది. అందుకే తన బైక్ ని నేను తీసుకొచ్చాను.. నా ఆటోని తనని తీసుకురమ్మని చెప్పాను...నీ బైక్ అక్కడ పార్క్ చేశాను చూసుకో పో...
సత్యం: బండ్లు మార్చుకున్నారన్నమాట...ఎలా ఉందిరా ఆటో డ్రైవింగ్...బాగానే నడిపావన్నమాట
ప్రేమ్: అక్కడ మమ్మీ షాంపూ లేకుండా తలస్నానం చేయించింది..ఏంటి డాడీ మీరు..ఇదంతా నీవల్లే జరిగిందని జ్వాలపై ఫైర్ అవుతాడు
జ్వాల: ఇది మొదలు పెట్టింది నువ్వు...ముగించింది నేను...
సత్యం: ఒకటి నాకు ఆకలేస్తోంది.... రెండు మీ గొడవ ఎప్పుడూ ఉండేదే...
ప్రేమ్: ఫొటో ఎగ్జిబిషన్ కి మమ్మీ వస్తానంది...మీరు కూడా వస్తే బావుంటుంది...
సత్యం: అక్కడ మీ మమ్మీ ఉంటుంది..నన్ను చూడగానే ఏదో అంటుంది..నేను, నువ్వు ఇద్దరూ బాధపడతారు..నేను వస్తే అనవసరంగా మీ మూడ్ పాడవుతుంది..
ప్రేమ్: ఏంటి డాడ్ ఎప్పుడూ ఇలాగే అంటారు..
డ్వాల: మీ మూడ్ ఎందుకు పాడవుతుందో నేను చూస్తాను సత్యం సార్..మీరు వెళ్లకుండా ఉండటం కరెక్ట్ కాదు...


స్వప్న ఇంట్లో
రా నిరుపమ్ ఫ్రెష్ అయి రా భోజనం వడ్డిస్తా అన్న తల్లి స్వప్నతో నువ్వు రా కూర్చో అంటాడు.
నిరుపమ్: నువ్వేంటో నీ మనసేంటో నీ ప్రేమేంటో నాకు బాగా తెలుసు కదా అమ్మా..కానీ అందరి ముందూ ఎందుకంత కోపంగా ఉంటావ్
స్వప్న: ఇప్పుడు వాళ్ల టాపిక్ అవసరమా నిరుపమ్
నిరుపమ్: అందరితో బంధాలు కలుపుకుంటే కలుస్తాయ్..తెంపుకుంటే తెగుతాయ్..
స్వప్న: అన్నీ మన చేతుల్లో ఉండవ్..వాళ్ల బుద్ధి కూడా సరిగా ఉండాలి కదా...
నిరుపమ్: ఓ మాట అడుగుతాను కాదనకూడదు
స్వప్న: ఆ ఇంటివాళ్లకు సంబంధించింది కాకుండా ఏదైనా అడుగు...
నిరుపమ్: ప్రేమ్ ఫొటో ఎగ్జిబిషన్ పెడుతున్నాడు కదా దానికి డాడీని కూడా పిలుద్దాం మమ్మీ... అక్కడ ప్రేమ్ ని అందరూ పొగుడుతుంటే నువ్వు,నేను మాత్రమే ఉంటాం, డాడీ కూడా ఉంటే ప్రేమ్ సంతోషిస్తాడు కదా..
స్వప్న: ఆయనేంటో ఆయన పెంపకం ఏంటో తెలుస్తోంది కదా...నేను ఫొటో ఎగ్జిబిషన్ కి రావాలంటే మీ డాడీని పిలవకు


Also Read:  నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ ప్రేమిస్తున్నది హిమనే, మరి జ్వాల సంగతేంటి


సౌందర్య ఇంట్లో
 నువు బైక్ పై వెళ్లడం ఏంటి అన్న సౌందర్యతో..నువ్వింకా ఆ విషయం మరిచిపోలేదా...బైక్ పై వెళితే తప్పేంటి అంటుంది. అనుకోకుండా జ్వాల కలిసిందని చెప్పడంతో.. మంచి పిల్లలా ఉందని అంటుంది సౌందర్య. శౌర్య ఉండి ఉంటే నిన్ను చాలా బాగా చూసుకునేది కదా  అని సౌందర్య అంటే... ఇప్పుడు చూసుకుంటున్నది కూడా శౌర్యే నానమ్మ అని మనసులో అనుకున్న హిమ... తన కోపం తగ్గిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తా అనుకుంటుంది. నువ్వేం బాధపడకు హిమా..ఎప్పటికైనా మన శౌర్య మన దగ్గరకు వస్తుందన్న సౌందర్య....నువ్వింత హ్యాపీగా ఉండేందుకు కారణం అయిన జ్వాలని నాకు పరిచయం చేయొచ్చు కదా అంటుంది. మాటని డైవర్ట్ చేస్తూ నానమ్మ నాకు జ్యూస్ కావాలని అడగడంతో సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


జ్వాల-ఆనంద్: బస్తీలో ఎవర్నో డ్రాప్ చేసిన జ్వాల....అప్పట్లో తల్లితో కలసి ఉన్న ఇల్లు చూసి ఆగిపోతుంది. చిన్నప్పటి విషయాలు గుర్తుచేసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. తండ్రి ఫొటో ముందు దీపం చూసి.. అసలు ఏం జరుగుతోంది, ఇంట్లో ఎవరూ లేరని చెబుతున్నారు, ఇల్లు శుభ్రం చేస్తున్నారు, దీపం పెడుతున్నారు..ఇదంతా ఎవరు చేస్తున్నారు...మోనిత ఆంటీ ఏమైనా చేస్తున్నారా.. అసలు మోనిత ఆంటీ ఎక్కడకు వెళ్లింది...ఇక్కడకు వచ్చేది మోనిత ఆంటీనా లేక హిమనా అనుకుని తిరిగి వెళ్లిపోతుండగా..రవ్వ ఇడ్లీ కనిపిస్తాడు. నువ్వేంట్రా ఇక్కడున్నావ్ అని అడిగితే ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అని చెప్పి ఆటో ఎక్కుతాడు. రవ్వ ఇడ్లీ ఆ ఇంట్లో నా ఫోన్ మర్చిపోయి వచ్చాను తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. లోపలకు వెళ్లిన రవ్వఇడ్లీ( మోనిత కొడుకు ఆనంద్) అక్కడ తండ్రి ఫొటో చూసి షాక్ అవుతాడు...


రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
మీ ఫొటో గ్రఫీని ప్రోత్సహించింది ఎవరు..సాధారణంగా పిల్లల సక్సెస్ వెనుక తల్లి ఉంటుందని గెస్టులు అనడంతో..మా డాడ్ నన్ను ప్రోత్సహించారని చెబుతాడు ప్రేమ్. ఇంతలో జ్వాల ...సత్యంని తీసుకొస్తుంది. మై డాడ్ ఈజ్ మై హీరో అని గర్వంగా చెబుతాడు ప్రేమ్. ఇదంతా చూసి స్వప్న కోపంతో మండిపోతుంటే.. అటు నిరుపమ్ మాత్రం జ్వాల చేయిపట్టుకుని మరీ నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్ థ్యాంక్యూ అంటాడు. మీరు నాకు పరిచయం కావడమే పెద్ద గిఫ్ట్ అంటుంది జ్వాల. నా కొడుకుల నుంచి దూరం అయ్యేందుకుఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంటుంది స్వప్న.