Guppedanta Manasu  Serial Today Episode: మనుకు తన తండ్రిని వెతికి తీసుకొస్తానని మహేంద్ర ప్రామిస్‌ చేస్తాడు. చేతిలో చేయ్యి వేయి అనుపమ నీ తండ్రి గురించి చెప్పినా చెప్పకపోయినా నేనే నీ తండ్రిని వెతుకుతాను. లోకంలో నీ తండ్రి ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని మహేంద్ర, మనుకు మాటిస్తాడు. దీంతో వసుధార, అనుపమ షాక్‌ అవుతారు. నాకు ఓపిక ఉన్నంత వరకు ఊరూ వాడ జల్లెడ పట్టి నీ తండ్రి గురించి తెలుసుకుంటాను. అవసరమైతే సోషల్‌ మీడియాను వాడతాను. ఇప్పటివరకు నువ్వు లవర్స్‌ని కలిపి వాళ్లను చూసింటావు. కానీ నేను తండ్రి కొడుకులను కలపబోతున్నాను.. అంటూ మహేంద్ర చెప్పగానే  మను హ్యాపీగా ఫీలవుతాడు.  తర్వాత వసు, అనుపమ కిచెన్‌ మాట్లాడుకుంటుంటారు.


వసు: మామయ్య,  మను గారికి అలా ప్రామిస్‌ చేశారు. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఇప్పుడు మామయ్య తనను తానే వెతుక్కోవాల్సి వచ్చింది.


అనుపమ: అసలు ప్రామిస్‌ చేయకుండా ఉంటే బాగుండేది.


వసు: కానీ ప్రామిస్‌ చేశారు కదా మేడమ్‌. కానీ ఇప్పుడు మనం ఇరుక్కు పోయాం. ఇన్ని రోజులు మను గారికి తెలిస్తే ఎలా అనుకునే వాళ్లం. కానీ మామయ్యకు తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్‌ అవుతారో..


అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ.. మహేంద్రను ఎలాగైనా ప్రామిస్‌ వెనక్కి తీసుకొమని చెబుదామని అనుపమ అంటుంది. ఇంతలో అక్కడికి మహేంద్ర రావడంతో ఇద్దరూ షాక్‌ అవుతారు. తానెందుకు ప్రామిస్‌ చేశానోనని ఆలోచిస్తున్నారా? ఒక కొడుకుగా అడుగుతున్నాను అని రిక్వెస్ట్‌ చేసినప్పుడు ప్రామిస్‌ చేయాల్సి వచ్చిందని మహేంద్ర చెప్తారు. దీంతో అనుపమ నీ ప్రామిస్‌ వెనక్కి తీసుకో అని అడిగితే నేను తీసుకోనని మహేంద్ర చెప్తాడు. తర్వాత కాలేజీలో ఉన్న వసుధార దగ్గరకు ఎంజేల్‌ వస్తుంది. తాను కాలేజీలో జాబ్‌ చేయాలనుకుంటున్నానని తనకు ఏదైనా జాబ్‌ ఇవ్వమని వసును అడుగుతుంది. వసు ఫస్ట్‌ వద్దని వారించినా తర్వాత సరే అంటుంది. దీంతో ఎంజేల్‌ హ్యపీగా ఫీలవుతుంది. మరోవైపు మను వస్తుంటే శైలేంద్ర సాంగ్ పాడుతూ ఉంటాడు.


శైలేంద్ర: ఏం రాశారు బ్రదర్ లిరిక్స్‌.. నా గొంతులో ఎలా ఉంది బ్రదర్‌ ఈ పాట


మను: వరెస్టుగా ఉంది. ఇంకోసారి పాడకు..


శైలేంద్ర: పాడను కానీ నీ చిక్కులు వీడుతున్నాయా? నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయా?


మను: నా తండ్రి గురించి నువ్వే తెలుసుకో.. నీ లైఫ్‌ టైం సెటిల్‌మెంట్‌ చేస్తా.. నిజం చెప్తున్నాను నీ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కేసు నుంచి నేను అసలు బయటపడను అనుకున్నాను. కానీ నీవల్ల బయటపడ్డాను.


శైలేంద్ర: లైఫ్‌ టైం సెటిల్‌మెంటా? ఏం చేస్తావు బ్రదర్‌.. ఇంతకముందు లాగా చెక్‌ ఇచ్చినట్టే ఇచ్చి చించేసినట్టా..? లేక ఎండీ పోస్ట్‌ ఇస్తానని మోసం చేసినట్టా?


మను: నీకు ఏం కావాలో ఒక క్లారిటీ తెచ్చుకో.. అప్పుడు నేను కచ్చితంగా ఇస్తా.. నువ్వు అంటున్నావు కదా ప్రతిసారి  నేను నా తండ్రిని తెలుసుకోనని అందుకే నువ్వే తెలుసుకో..


శైలేంద్ర: నీ తండ్రి గురించి తెలిస్తే ఏం చేస్తావు బ్రదర్‌


మను: నువ్వు ఎలా చస్తావో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నా చేతిలో భయంకరంగా చస్తాడు.


అని మను చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత మను తండ్రి గురించి తెలుసుకుని చెబితే వీడు వాణ్ని చంపి జైలుకు పోతాడు. అప్పుడు నా పని సులువవుతుంది అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. తర్వాత చాంబర్‌కు వచ్చిన మనుకు ఎంజేల్‌ కనిపిస్తుంది. ఎందుక ఇక్కడ ఉన్నావని అడిగితే చిలిపిగా మనును చూసి కన్ను కొడుతుంది. మను ఏం  చేస్తున్నావని అడిగితే నేనేం చేయలేదని ఏం చేశానో నువ్వే చెప్పమని ఎంజేల్‌ అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ‘భారతీయుడు’ రీ రిలీజ్ - పాత మూవీకి కొత్త ట్రైలర్, విడుదల ఎప్పుడంటే?