Guppedanta Manasu Serial Today Episode : శైలేంద్రకు ఎండీ సీటు ఇవ్వలేదన్న కోపంతో అందరికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో మహేంద్ర నువ్వు ఆడిన నాటకం మాకందరికీ తెలుసని.. అందుకే మేము నీతో నాటకం ఆడాల్సి వచ్చిందంటాడు. దీంతో శైలేంద్ర మను కాలేజీకి యాభై కోట్లు ఇవ్వనే లేదని చెప్తాడు. దీంతో మహేంద్ర అదంతా తమకు తెలుసని అంటాడు. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు. యాభై కోట్ల అప్పును నువ్వు క్రియేట్ చేశావని కూడా తెలుసు అంటాడు మహేంద్ర. మను, వసు కూడా నువ్వు రాజీవ్ కు చేసిన మోసం కూడా మేమే చెప్తామని అప్పుడు వాడే నిన్ను చూసుకుంటాడని బెదిరించడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. తర్వాత ఫుల్‌గా తాగి శైలేంద్ర భాదపడుతూ ఇంటికి వస్తాడు. ధరణి, దేవయాని చూస్తారు.
దేవయాని: నాన్నా నువ్వు డ్రింక్ చేయడం ఏంట్రా? ఇంతకీ ఏం జరిగిందిరా శైలేంద్ర.
శైలేద్ర: మమ్మీ అంతా మోసం ఆ మను గాడు మోసం.. ఆ వసుధార మోసం..
దేవయాని: ధరణి వీడు బాగా తాగాడు బయటకు తీసుకెళ్లి తలమీద వాటర్ పోద్దాం పద
ధరణి బకెట్ తో నీళ్లు తీసుకొచ్చి శైలేంద్ర మీద పోస్తుంది. దేవయాని అసలు ఏం జరిగిందని గట్టిగా అడుగుతుంది. కాలేజీలో జరిగింది చెబితే మమ్మీ నన్ను వాయిస్తుంది అని మనసులో అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో కూర్చున్న మహేంద్ర, శైలేంద్ర గురించి మాట్లాడుతుంటాడు.
మహేంద్ర: కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఈరోజు మనం శైలేంద్ర గాణ్ని కొట్టిన దెబ్బకు వాడికి ఈ పాటికి బుద్ది వచ్చి ఉంటుంది. ఇన్నాళ్లు వాడి దుర్మార్గాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వాడు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోవాలి.
వసు: కరెక్టు మామయ్యా తను చేసిన పాపాలన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వస్తుంది. కానీ ఇప్పుడు మనం తనతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా దెబ్బ తిన్న వాడు మానసింగా ఇంకా బలంగా అవుతాడు.
మహేంద్ర: వాడి బొంద వాడు మానసికంగా కానీ శారీరకంగా గానీ ఎంత బలవంతుడైనా కానీ ఇకనుంచి మనం మాత్రం వెనకడుగు వేసేదే లేదు. వాన్ని అడుగడుగునా తల దించుకునేలా చేయాలి. మను ఏం ఆలోచిస్తున్నావు
మను: అదే సార్ మీరందరూ కలిసి నన్ను నిర్ధోషి అని నిరూపించి నన్ను బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు నన్ను బయటకు తీసుకురాకపోతే నా పరిస్థితి ఎంటా అని ఆలోచిస్తున్నాను. నేను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉండేవాడిని.
మహేంద్ర: అది సహజం మను చేయని నేరానికి ఎక్కడ శిక్ష పడుతుందోనని ఎవరికైనా భయం ఉంటుంది.
మను: నా భయం శిక్ష గురించి కాదు సార్. నాకు శిక్ష పడితే ఇక నేను నా తండ్రి గురించి తెలుసుకోలేనని. కానీ ఇప్పుడు ఏ భయాలు లేవు. ఇక నా అన్వేషణ మొదలు పెడతాను. ఇక నా తండ్రి ఎవరు? అని తెలుసుకుంటాను.
అనగానే అనుపమ కోపంగా మనును తిడుతుంది. ఇప్పుడే ఒక సమస్య నుంచి బయటపడ్డావు మళ్లీ ఎందుకు ఇదంతా అంటుంది. దీంతో మను నా తండ్రి ఎవరో తెలుసుకుని నిలదీసేవరకు నా అన్వేషణ ఆపనని అంటాడు. దీంతో అనుపమ మనును తిట్టి లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు శైలేంద్ర ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ కలిసి నన్ను పూల్‌ను చేశారు అని కోపంతో రగిలిపోతుంటాడు. ఇంతలో దేవయాని వచ్చి శైలేంద్ర చెంప పగులగొడుతుంది. ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో జరిగిందంతా శైలేంద్ర చెప్తాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది. మరోవైపు రాజీవ్ జైల్లో వసుధార ఫోటో గోడ మీద గీసి ఫోటోతో మాట్లాడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: కావ్య కళ్యాణ్ రామ్ మొన్ననే బర్త్ డే చేసుకుంది.. ఇప్పుడేమో లేడీ బాంబ్లా ముస్తాబైంది