Guppedanta Manasu Telugu Serial Today Episode: వసుధార కారు ఆగిపోవడంతో మను ఏమైందని అడుగుతాడు. కారు ప్రాబ్లమ్ వచ్చిందని వసుధార అంటుంది. నేను చూస్తాను. మీరు కారు స్టార్ట్ చేయండి అని మను అంటాడు. కారు చూసిన మను ఇలా కుదరదు మెకానిక్‌ను రమ్మనాలి అని మను అంటాడు. సరే నేను ఆన్‌లైన్‌లో మెకానిక్‌ను పిలిచి రిపేర్ చేసుకుని వెళ్తాను అని వసుధార అంటుంది. దానికి మీరు ఇక్కడ ఉండటం దేనికి. మెకానిక్‌నే ఇంటికి తీసుకురమ్మనండి. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నేను ఇంటికి వెళ్లట్లేదు అండి. వేరే చోటుకు వెళ్తున్నాను అంటే మీరు ఎక్కడికి వెళ్లినా నేను డ్రాఫ్ చేస్తాను అని వసుధారను కారులో ఎక్కించుకుని వెళ్తాడు. మరోవైపు రాజీవ్, శైలేంద్ర మాట్లాడుకుంటుంటారు. ఇంతలో మను, వసుధార కారులో వెళ్లడాన్ని శైలైంద్ర చూసి రాజీవ్‌కు మను, వసుధార వెళ్లడాన్ని చూపిస్తాడు శైలైంద్ర. అది చూసి షాక్ అవుతాడు రాజీవ్.
రాజీవ్: నా మరదలితో ఆ మను గాడు ఏంటీ భయ్యా. ఉండు ఇప్పుడే వాన్ని ఏసేస్తాను.
శైలేంద్ర: ఏయ్ ఆగు ఇప్పుడే నాకో ఐడియా వచ్చింది నువ్వు ఆగు.. ఇప్పటిదాకా మనకు ఏ ఆలోచనలు రాలేదు. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకుంటే నీకు వసుధార, నాకు ఆ మను గాడి పీడ విరగడవుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు.
రాజీవ్: ఏం చేయబోతున్నావ్ భయ్యా..
శైలైంద్ర: వెయిట్ అండ్ సీ బ్రదర్
అని చెప్పి శైలైంద్ర రాజీవ్ ను కూల్ చేస్తాడు. మరోవైపు ఎక్కడికి వెళ్తున్నాం మేడమ్. ఏమైనా సీక్రెటా అని మను అంటాడు. దాంతో రిషి సార్ దగ్గరికి అని వసుధార చెప్పడంతో మను షాక్ అయి కారు ఆపుతాడు. రిషి సార్‌తో నాకున్న జ్ఞాపకాలు పంచుకునేందుకు వెళ్లే ప్లేస్ అది. బస్తీకి వెళ్తున్నాం, మాకు సిటీ నుంచి బస్తీకి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉంటంది. బస్తీలో వాళ్ల జీవితం వేరేగా ఉంటుంది. ప్రతిసారి ఆ లైఫ్ స్టైల్‌ను ఆస్వాదించేవాళ్లం అని వసుధార చెబుతుంది. తర్వాత ఇద్దరు కలిసి బస్తీకి వెళ్తారు. ఓ చోట మను కారు ఆపుతాడు. దిగిన వసుధార ఆ బస్తీలోని రోడ్లు చూసి రిషిని గుర్తు చేసుకుంటుంది. తర్వాత వసును ఇంటి దగ్గర డ్రాఫ్ చేస్తాడు మను.
వసు: లోపలికి వచ్చి మంచి నీళ్లు తాగి వెళ్లండి. బయట తాగలేదు కదా.
మహేంద్ర: అమ్మా వసుధార ఎక్కడికి వెళ్లారు?
వసు: మిషన్ ఎడ్యుకేషన్ మీద ఇద్దరం వెళ్లాం. నేను ఒక్కదాన్నే వెళ్తుంటే కారు రిపేర్ అయింది. మనునే లిఫ్ట్ ఇచ్చాడు. ఆయన చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. రిషి సార్ నేను ఇదివరకు తిరిగిన ఏరియాల్లోనే తిరిగాం. అదే విషయం మనుకు చెప్పాను. ఆయన కూడా మంచి ఐడియాస్ చెప్పాడు.
మహేంద్ర: వెరీ గుడ్ మను. ఇక నుంచి మిషన్ ఎడ్యుకేషన్‌లో నువ్ పాల్గొనవచ్చు
వసు: చింతల్ బస్తీలో పిల్లల తల్లిదండ్రులు చదివించేలేం అని చెబితే మను గారు వాళ్లను మోటివేట్ చేసి ఒప్పించారు మామయ్యా.
మహేంద్ర: హో గ్రేట్ మను
మను: ఈ గొప్పతనం నాది కాదు. మిషన్ ఎడ్యుకేషన్‌ది. చదువుకోవాల్సిన పిల్లలను ఏవేవో కారణాలు చెప్పి పనికి పంపిస్తున్నారు వాళ్ల తల్లిదండ్రులు. అలాంటి వాళ్లందరికి ఈ ప్రాజెక్ట్ ద్వారా చదువు అందించడం గొప్ప విషయం.
అనుపమ: అలసిపోయి ఉంటారు. రండి భోజనం చేద్దాం.
దీంతో మను లేదు స్నాక్స్ తిన్నాం..ఆకలిగా లేదు అంటే మొహమాట పడొద్దు. నువ్ ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వొద్దు. రా భోజనం చేద్దాం అని మహేంద్ర అంటాడు. స్నాక్స్ తిన్నామని చెప్పాగా. ఇప్పుడు భోజనం వద్దు. ఏమనుకోకండి. మంచి నీళ్లు ఇవ్వండి చాలు అని మను అంటే.. అనుపమ తీసుకొచ్చి ఇస్తుంది. తర్వాత మనును ప్రేమగా చూస్తుంది అనుపమ. మను వెళ్లిపోతాడు. అలాగే చూస్తుంది అనుపమ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: భర్తతో నయన్ విడాకుల రూమర్స్ - ఆ ఒక్క స్టోరీతో క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్