Guppedanta Manasu  Serial Today Episode: రిషి ఇక రాడని, ఎన్నటికీ రాడనుకున్న వాళ్ల కోసం ఎదురుచూడటం అమాయకత్వం అవుతుంది. రిషి ఇక లేడన్న విషయం నువ్వు జీర్ణించుకోవాలి. రిషి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలసు. రిషి అంటే నాకు కన్నకొడుకు కన్న ఎక్కువ ఇష్టం అంటాడు ఫణీంద్ర. కానీ వసుధార రిషి వస్తాడని ఇంక టైం ఉంది కదా సార్‌ అంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి నేను ఒప్పుకోను అంటుంది.


దేవయాని: ఏంటి వసుధార చెప్తుంటే నీకు అర్థం కాదా? నిన్న మంత్రిగారు మాట్లాడుతుంటే లెక్క లేకుండా మధ్యలోనే వెళ్శి పోయావట. ఇంత మంది ఎందుకిలా చెప్తున్నారని నువ్వు ఆలోచించవా? రిషి అంటే నీకొక్కదానికే ప్రేమ ఉన్నట్లు ఇంకెవరికీ ప్రేమ లేనట్లు మాట్లాడుతున్నావు.


శైలేంద్ర: అవును వసుధార కొంచెం అర్థం చేసుకో రిషి నా తమ్ముడు. రిషి నేను రామలక్ష్మణుల్లా ఉండాలని డాడీ ఎప్పుడు చెప్తుండేవారు. నేను కూడా తనతో అలాగే కలిసిపోయి ఉండేవాణ్ణి.  


మహేంద్ర: ఏంటి మహేంద్ర ఇంత మంది ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్‌గా ఉంటావేంటి? వసుధారకు నువ్వైనా చెప్పు అర్థం అయ్యేలా


ఫణీంద్ర: మహేంద్ర అసలు నీ అభిప్రాయం ఏంటో చెప్పు..


మహేంద్ర: నా అభిప్రాయం ఏం లేదు అన్నయ్యా.. వసుధార ఏది అంటే అదే వసుధార బతికున్నాడని నమ్మితే నేను నమ్ముతాను. లేదు రిషి చనిపోయాడనుకుని నమ్మితే నేను చనిపోయాడని నమ్ముతాను.


 అనగానే ఫణీంద్ర ఇదిలాగే ఉంటే మనం అందరం ఎప్పటికీ బాధపడుతూనే ఉంటామని చెప్తాడు. దీంతో సార్‌ నేను ఇక్కడ బతికి ఉన్నానంటే రిషి సార్‌ బతికే ఉంటాడు. లేదు రిషి సార్‌ చనిపోయారంటే నేను చనిపోయినట్టే అని వెళ్లిపోతుంది వసుధార. మహేంద్ర కూడా వెళ్లిపోతాడు. తర్వాత అనుపమ, మను, మహేంద్ర, వసుధార కూర్చుని మాట్లాడుకుంటుంటారు.


వసు: అవును మామయ్య ఫణీంద్ర సార్ మీ అభిప్రాయం అడిగినప్పుడు సూటిగా ఎందుకు చెప్పలేకపోయారు.


మహేంద్ర: ఎందుకు చెప్పలేదు అమ్మా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సపోర్టు చేస్తానని అన్నాను కదా!


వసు: ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మీరు సపోర్టు ఇస్తానంటే నేను ఏ నిర్ణయం తీసుకుంటానని మీరు అనుకుంటున్నారు.


మహేంద్ర: నేనేమి అనుకోవడం లేదమ్మా.. నా మనసులో అయితే ఏమీ లేదు.


మను: మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు మేడం..


వసు: అప్పుడు  అందరి ముందు ఏ మాటైతే ఇచ్చానో ఆ మాట మీద నిలబడతాను. ఆ విధంగానే నా నిర్ణయాలు ఉంటాయి.


అనుపమ: కానీ ఇప్పుడు వసుధార ఉంది కానీ రిషి లేడు కదమ్మా..


వసుధార: అయితే వసుధార కూడా లేనట్టే..


 అనడంతో అందరూ షాక్‌ అవుతారు. తర్వాత అందరూ వసుధారను ఓదారుస్తారు. కానీ వసుధార బాధపడుతుంది. సర్‌ లేడంటే నేను ఉన్నా లేనట్టేనని మంత్రిగారికి ఫోన్‌ చేసి రేపు బోర్డు మీటింగ్‌ కు రమ్మని చెప్పండి నేను అక్కడే నా నిర్ణయం చెప్తాను అని వెళ్లిపోతుంది వసుధార. బోర్డు మీటింగ్‌లో అందరూ వెయిట్‌ చేస్తుంటారు. వసుధార మీటింగ్‌కు రాకుండా తన చాంబర్‌లో బాధపడుతూ కూర్చుంటే మను వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నారు మేడం అని అడుగుతాడు. మీరే నిర్ణయం తీసుకున్నారో తెలియక మాకు కంగారుగా ఉంది మేడం అనడంతో నేనేం చనిపోను అంటుంది వసుధార. ఆ మాటకు మను షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ - టాలీవుడ్ నుంచి ఇంకెవరు?