Guppedanta Manasu Serial Today Episode: వసుధారను స్కూల్ లో టీచర్ గా జాయిన్ చేయడానికి రంగా తీసుకెళ్తాడు. అక్కడి హెడ్మాస్టర్.. రంగా చెప్పారు కాబట్టి మిమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్‌గా తీసుకుంటున్నానని మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా? అని అడుగుతారు. అయితే తీసుకురాలేదని వసుధార చెప్పగానే సర్టిఫికెట్స్ తర్వాత నేను తీసుకొస్తానని మేడం చాలా బాగా పాఠాలు చెప్తారని రంగ చెప్పగానే బోర్డు మీద ఫార్ములా కంప్లీట్ చేయమని హెడ్మాస్టర్ చెప్తాడు. దీంతో వసుధార తప్పుగా కంప్లీట్ చేస్తుంటే.. ఫార్ములా తప్పుగా రాస్తున్నారని రంగా, వసుధారను తిట్టి మొత్తం తుడిచేసి ఫార్ములా కరెక్టుగా కంప్లీట్ చేస్తాడు. ఫణీంద్ర ఒక్కడే కూర్చుని మను, శైలేంద్ర గురించి ఆలోచించి శైలేంద్రను పిలిచి మను ఎందుకు వచ్చాడని అడుగుతాడు.
శైలేంద్ర: ఆల్‌రెడీ చెప్పాను కదా డాడ్. ఏదో క్యాజువల్‌గా మాట్లాడటానికి వచ్చారు.
ఫణీంద్ర: లేదు మీరు క్యాజువల్‌గా మాట్లాడుకోలేదు. సీరియస్‌గానే మాట్లాడుకున్నారు. ఆ మను నాకు ఏదో చెప్పడానికే వచ్చారని నాకు అర్థం అయ్యింది. కాలేజీ విషయంలో నువ్వేమైనా జోక్యం చేసుకున్నావా? లేదంటే తన పర్సనల్ లైఫ్‌లోకి ఇన్వాల్వ్ ఆయ్యావా?
శైలేంద్ర: లేదు డాడ్ నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదు. అయినా తన పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు చెప్పండి.
దేవయాని: ఏంటండి ఇది మరీ విడ్డూరం కాకపోతేనూ ఆ మను మన ఇంటికి వస్తే మీరు మన కొడుకు తప్పు చేసినట్లు డౌట్ పడుతున్నారేంటి?
ఫణీంద్ర: దేవయాని నువ్వు మధ్యలో రాకు వీడి మీద డౌట్ వచ్చింది కాబట్టే క్లియర్ చేసుకుంటున్నాను. దేవయాని నేను మళ్లీ చెప్తున్నాను మీ అదృష్టం బాగుండి వీడు ఎండీ అయితే నాకే అభ్యంతరం లేదు. కానీ ఆ మను ఎండీ అయితే నాకేం సంబంధం లేదు.
ALSO READ: భర్తతో కలిసి ‘కల్కీ 2898 ఏడీ’ చూసిన దీపిక - రణవీర్ స్పందన ‘అత్యుత్తమం’
అని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోతాడు. దీంతో శైలేంద్ర కోపంగా వెంటనే ఆ మను గాడిని లేపేయాలి అని చెప్పగానే అది అంత ఈజీ కాదు అని దేవయాని చెప్తుంది. వసుధార రాసిన లెటర్ అస్త్రంగా చేసుకుని వాడి అడ్డు తప్పించుకుందాం అంటుంది దేవయాని. ఇంతలో ధరణి టీ తీసుకుని వచ్చి మీరేదే కుట్ర చేస్తున్నారా? అని అడుగుతుంది. మీరు మాట్లాడుకుంది నేను విన్నానని చెప్పడంతో దేవయాని, శైలేంద్ర షాక్ అవుతారు.
మరోవైపు సరోజ ఇరిటేటింగ్ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది.
బుజ్జి: సరోజ కాలు నేలమీద నిలబడను అంటుందా? నీ మనసు నిలకడగా ఉండలేకపోతుందా?
సరోజ: ఈ వసుధార ఎక్కడి నుంచి దాపరించిందో ఏంటో కానీ తను వచ్చినప్పటి నుంచి నాలో కంగారు మొదలైంది. అది ఇంకా బావను పట్టుకుని రిషి సార్ అంటుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టు అనిపిస్తుంది.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెంటనే మనం అక్కడకు వెళ్దాం పద అని బుజ్జిని తీసుకుని వస్తుంది. మరోవైపు క్లాస్‌రూంలోంచి బయటకు వచ్చిన వసుధార మీరే నా రిషి సార్ అని కచ్చితంగా చెప్తున్నాను అంటుంది. కాలేజీలో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన మీరు ఇంత చిన్న ఊరిలో ఎలా ఉంటున్నారు. అనగానే ఇప్పుడేంటి నేను మీ రిషి సార్ అంటారా? అనగానే అవును నేను కావాలనే ఆ ఫార్ములా తప్పుగా రాశానని.. అలా రాస్తే నా రిషి సార్‌కు కోపం వస్తుంది. అని వెళ్లబోతూ వసుధార కింద పడబోతుంటే రంగ, వసుధారను పట్టుకుంటాడు. దూరం నుంచి చూస్తున్న సరోజ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. నేను రంగానే కావాలంటే నాకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోండని కోపంగా చెప్తాడు. నేను పుట్టిన హాస్పిటల్‌కు నేను చదివిన స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేసుకోండని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.