Guppedanta Manasu  Serial Today Episode: పెళ్లి చూపులకు వస్తున్న ధనరాజ్‌ వాళ్లకు  రంగా, సరోజ కలిసి ఉన్న ఫోటో చూపిస్తాడు బుజ్జి. ఆ ఫోటో చూసిన శైలేంద్ర, దేవయాని షాక్‌ అవుతారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరని అడుగుతారు. మా అన్న రంగా అని చెప్తాడు.  రంగానా అని అనుమానంగా అడగ్గానే.. నిజంగానే రంగా తను ఆటోడ్రైవర్‌ అని నాకు సొంత అన్న లాంటోడు అని చెప్తాడు. దేవయాని రంగ కాదు రిషి అయ్యుండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తుంది. శైలేంద్ర షాక్‌ అవుతారు. ఇంతలో ధనరాజ్‌ నాకు ఈ సంబంధం వద్దని వెళ్లిపోదాం అంటాడు.


శైలేంద్ర: అదేంట్రా ఇక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్దాం అంటావు.


ధనరాజ్: నాకీ అమ్మాయి నచ్చలేదు.


శైలేంద్ర: అది కాదురా ఇక్కడి దాకా వచ్చాము కదా ఒకసారి చూసి వెళ్దాం.  


ధనరాజ్: అరె వద్దన్నాను కద అన్నయ్యా..


దేవయాని: అది కాదు నాన్నా ఇక్కడి దాక వచ్చి చూడకుండా వెళ్లితే బాగోదు.


బుజ్జి: మేడం ఆయన వద్దంటున్నాడు కదా వెళ్లిపోండి.


దేవయాని: రేయ్‌ నీకెందుకు నోరు మూసుకుని ఉండు


   అంటూ ధనరాజ్‌ను వెళ్దాం పద అంటారు. ధనరాజ్‌ వద్దంటాడు. దేవయాని, శైలేంద్ర తమ మాటలతో కన్వీన్స్‌ చేసి ధనరాజ్‌ను తీసుకుని పెళ్లిచూపులకు వెళ్తారు. బుజ్జి ఎంత ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోతారు. బుజ్జి షార్ట్‌ కట్‌లో సరోజ దగ్గరకు వచ్చి వాళ్లు వస్తున్నారని చెప్తాడు. ఇంతలో శైలేంద్ర వాళ్లు సంజీవ ఇంటికి వస్తారు. సంజీవ వాళ్లను లోపలకి తీసుకెళ్తాడు. పెళ్లి కొడుకు గురించి ఆరా తీస్తుంటే దేవయాని తలతిక్క సమాధానాలు చెప్తుంది. ఇంట్లో కూర్చున్న దేవయాని, శైలేంద్ర ఇంట్లో అటూ ఇటూ చూస్తుంటారు. ఏంటి అని సంజీవ అడుగుతాడు.


దేవయాని: ఏవండి అమ్మాయికి రంగ అని బావ ఉన్నాడట కదా?


సంజీవ: వచ్చిందా మీదాకా ఇన్ఫర్మేషన్‌ వచ్చిందా? తప్పు లేదండి. ఒక్కప్పుడు పెళ్లి అంటే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసేవారు. ఇప్పుడు రెండు వైపులా చేస్తున్నారు. అవునండి మా అమ్మాయికి బావ ఉన్నాడు. కేవలం ఉన్నాడంటే ఉన్నాడు. ఇదిగోండి ఈవిడ మనవడే.. బతుకుదెరువు కోసం ఆటో నడుపుతుంటాడు.  అత్తమ్మా మీరోసారి వాడికి ఫోన్‌ చేసి రమ్మను.


   అనగానే రాధమ్మ సరే అని ఫోన్‌ చేయడానికి బయటకు వెళ్తుంది. మరోవైపు రంగ, వసుధార ఆటోలో వస్తుంటారు. సర్‌ మీరు ఈ పెళ్లి చూపులకు వెళ్లడం మీకు అవసరమా అని వసుధార అడుగుతుంది. అవసరమేనని నేను లేకపోతే వసుధార అక్కడ మాకు సంబంధం ఉందని పెళ్ళి చెడగొడుతుంది. అలా జరగకూడదంటే నేను వెళ్లాలి అని చెప్తాడు రంగ. ఇంతలో రాధమ్మ ఫోన్‌ చేసి రంగాను త్వరగా రమ్మని చెప్తుంది.


వసుధార: ఏంటి సార్‌ మీ నాన్నమ్మ ఫోన్‌ చేశారు.


రంగ: మేడం గారు మీకు చెప్పేది అయితే చెప్తాను కదా? ఎందుకు ప్రతిదీ అడుగుతారు.


వసుధార: ఎంటి సార్‌ నేనేదో మిమ్మల్ని ప్రతిసారి విసిగిస్తున్నట్లు మాట్లాడుతున్నారు.


రంగ: అలా ఏం లేదులే మేడం గారు త్వరగా రమ్మని ఫోన్‌ చేశారు అంతే.


  అని రంగ చెప్పగానే మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటుంది వసుధార. మరోవైపు సరోజను తీసుకొచ్చి దేవయాని వాళ్ల ముందు కూర్చోబెడతారు. ధన్‌రాజ్‌ అమ్మాయిని చూడకుండా దేవయానిని చూస్తుంటాడు. ఇంతలో రంగ వస్తాడు. వసుధార లోపలికి వస్తుంటే రంగ వద్దని మీరు బయటే ఉండండని చెప్పి రాధమ్మతో కలిసి లోపలికి వెళ్తాడు. రంగాను చూసిన దేవయాని, శైలేంద్ర షాక్‌ అవుతారు.  శైలేంద్ర రిరిరి అంటుంటే రి రి  కాదండి నేను రంగ మా మామయ్య చెప్పలేదా? అంటాడు. దేవయాని, శైలేంద్ర కంగారుపడుతుంటే రంగ ఎందుకు అలా ఉన్నారని అడుగుతాడు. దేవయాని ఏం లేదండి అని చెప్తుంది. బయటి నుంచి దేవయాని గొంతు విన్న వసుధార ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.