Guppedanta Manasu Serial Today Episode: ధనరాజ్ వచ్చి నేను పెళ్లి చేసుకోబోతున్నానని కానీ ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటి సెట్ కావడం లేదని నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదని.. అనాథనని ఒక్కరూ పిల్లను ఇవ్వడం లేదని అందుకే ఇప్పుడు వచ్చిన ఒక సబంధం వాళ్లకు మీరే నా అన్నయ్య అని మేడం గారు మా అమ్మగారు అని చెప్పాను. అందుకే మన ముగ్గురం కలిసి పెళ్లి చూపులకు వెళ్లాలని అడుగుతాడు. అమ్మాయి ఫోటో చూపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు సరోజ. అయితే శైలేంద్ర మేమెందుకు రావాలని మేము రాలేమని చెప్తాడు. అయితే మీ సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు ధన్ రాజ్. దీంతో దేవయాని సరే వస్తామని చెప్తుంది. ధనరాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు వసుధార రంగకు కాఫీ తీసుకుని వస్తుంది.
వసుధార: సర్ కాఫీ తీసుకొండి సర్
రంగ: నేను కాఫీ తాగను
వసుధార: ఎందుకు సర్. చెప్పండి సర్ ఎందుకు తాగరు.
రంగ: ఎందుకంటే ఎం చెప్తాం నేను టీ తాగుతాను. కాఫీ తాగే అలవాటు నాకు లేదు మేడం గారు.
వసుధార: పర్వాలేదు సార్ ఇప్పుడు అలవాటు చేసుకోండి.
రంగ: ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు అవసరం లేదు.
వసుధార: అలా అనకండి సార్. ఇదేం వ్యసనం కాదు నా చేతి కాఫీ ఎంతో బాగుంటుంది. ఒక్కసారి తాగండి. కష్టపడి చేశాను.
అని వసుధార ఫోర్స్ చేయగానే రంగ కాఫీ తీసుకుని కొంచెం తాగి వ్యాక్ ఇది కాఫీనా అంటూ పక్కకు పెట్టేస్తాడు. దీంతో వసుధార రిషితో ఉన్న ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని సర్ నా మీద రివేంజ్ తీర్చుకుంటున్నారేమో అనుకుంటుంది. ఇంతలో రాధమ్మ వస్తుంది. కాఫీ తాగి చాలా బాగుందని అయినా ఏరా రంగా నీకు కాఫీ అంటే అంత ఇష్టం.. నన్నెప్పుడు కాఫీ పెట్టమని అరుస్తావు అంటుంది. దీంతో వసుధార బాధపడుతుంది. రంగ కాఫీ తాగి చాలా బాగుందని మెచ్చుకుని వెళ్లిపోతాడు. తర్వాత ధనరాజ్, శైలేంద్ర, దేవయాని పెళ్లిచూపులకు సరోజ ఇంటికి వస్తుంటారు. సరోజ బుజ్జికి ఫోన్ చేసి నీకు పెళ్లి కొడుకు ఫోటో పెట్టాను చూడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్లు అటు నుంచి అటే రిటర్న్ పోవాలని చెప్తుంది. మరోవైపు రాధమ్మ, రంగాతో మాట్లాడుతుంది.
రాధమ్మ: ఒరేయ్ వెళ్దాం పదర..
రంగ: ఇప్పుడు మనం అక్కడకు వెళ్లి ఏం చేస్తాం నాన్నమ్మ
రాధమ్మ: ఇంటికి వచ్చి మరీ చెప్పాడు కదరా?
రంగ: ఆయన ఎలా చెప్పారో విన్నావు కదా? ఆయన మర్యాదగా పిలిచాడా? వెటకారంగా మాట్లాడి పోయాడు. బంధువులం కదా పిలవకపోతే మాటొస్తుందేమోనని పిలిచాడు.
రాధమ్మ: లేదు నాన్నా మనం వెళ్లడం మంచిది. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల గురించి గుచ్చి గుచ్చి అడుగుతారు.
రంగ: చూడు నాన్నమ్మ నేను అక్కడకు వస్తే సరోజ ఇంకా బాధపడుతుంది. నన్ను అక్కడ చూసి నాకు బావ అంటే ఇష్టం నేను బావనే పెళ్లి చేసుకుంటాను అంటే మొత్తానికే మోసం వస్తుంది. రమ్మని పిలిచిన వాళ్లే మళ్లీ నన్నే తిడతారు నాన్నమ్మ.
అనగానే రాధమ్మ ఎంత చెప్పినా రంగా వెళ్లడు. దీంతో రాధమ్మ ఒక్కతే వెళ్తుంది. మరోవైపు ఊర్లోకి వచ్చిన శైలేంద్ర కారును బుజ్జి అడ్డగిస్తాడు. మీరు చూడ్డానికి వెళ్తున్న అమ్మాయి నేను ప్రేమించుకున్నామని చెప్తాడు. ధనరాజ్ నమ్మడు. దీంతో బుజ్జి కంగారులో రంగా, సరోజ కలిసి ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.