Guppedanta Manasu Serial Today Episode: రంగ అవసరం తీరాక వాణ్ని చంపేయాలని దేవయానితో చెప్తాడు. శైలేంద్ర. లేదంటే వాడు మన రహస్యాలు ఎప్పుడైనా బయటపెడితే మనకే ప్రమాదం అంటాడు. అయితే చాటు నుంచి ధరణి వింటుంది. ఎవరిని చంపేయబోతున్నారని శైలేంద్ర, దేవయానిలను అడుగుతుంది. దీంతో శైలేంద్ర ధరణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. మరోవైపు మను కోసం తాను రాసిన లెటర్‌ను శైలేంద్రనే దొంగిలించాడని వసుధార అనుమానపడుతుంది. కాలేజీ సీసీటీవీ ఫుటేజ్‌లో శైలేంద్ర లెటర్ తీసుకోవడం చూసి షాక్ అవుతుంది. ఇంతలో రిషి వస్తాడు. రిషిని గమనించిన వసుధార లాప్‌టాప్ క్లోజ్ చేస్తుంది. ఏం చూస్తున్నావని వసుధారను అడుగుతాడు రిషి. వసుధార తడబడుతుంది. రిషి పట్టుబట్టడంతో వీడియో చూపిస్తుంది.
రిషి: ఆ లెటర్‌లో ఏం రాశావు వసుధార.
వసుధార: ఆ లెటర్ లో ఉన్న విషయం మనుకు తప్ప ఇంకెవరికి చెప్పకూడదు.
రిషి: నువ్వు చెప్పలేను...చెప్పకూడదు అనుకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ ఒక్కటి అడుగుతాను. ఆ లెటర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లెమ్ అవుతుందా? ఎవరికైనా ప్రమాదం జరగుతుందా?
అని అడుగుతుండగానే బుజ్జి ఫోన్ చేస్తాడు. రిషి బయటకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేదని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని బుజ్జి చెప్తాడు. నువ్వు నిజంగానే రిషి అని నాకు ఎప్పుడో డౌట్ వచ్చిందని బుజ్జి చెప్తాడు. నువ్వు రిషివే అయితే రంగాగా ఎందుకు నటించావని రిషిని ప్రశ్నిస్తాడు బుజ్జి. త్వరలో వాటికి సమాధానాలు తెలుస్తాయని రిషి చెప్తాడు. మరోవైపు తాను మను కోసం రాసిన లెటర్ ఎందుకు దొంగిలించావని వసుధార, శైలేంద్రను నిలదీస్తుంది. వసుధార ఎంత తిట్టినా శైలేంద్ర పట్టించుకోడు. ఆ లెటర్ నా దగ్గరే భద్రంగా ఉందని చెప్తాడు. బాధ్యత లేకుండా కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లతో మాట్లాడాలంటే కంపరంగా ఉందని శైలేంద్ర అంటాడు. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు.
రిషి: నా భార్యను నువ్వు ఏవేవో మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోను. వసుధార ఏదైనా పదవి తీసుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైన వాటిని దాటుకుంటూ ఆ బాధ్యతకు న్యాయం చేస్తుంది. ఇంకోసారి నా భార్యను ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు.
వసుధార: శైలేంద్ర నేను మను కోసం రాసిన లెటర్ ఇవ్వు.
శైలేంద్ర: ఇవ్వను గాక ఇవ్వను . అవసరమైనప్పుడు ఆ లెటర్‌ను అస్త్రంగా వాడుకుంటాను. టైం చూసి ఆ లెటర్ మనుకు ఇస్తాను. అప్పుడు మహేంద్ర ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
వసుధార: ఆ లెటర్‌ను నువ్వు మనుకు ఇస్తే...మహేంద్ర, మను కలిసిపోతారు. అప్పుడు నీ గొయ్యినువ్వే తవ్వుకున్నట్లు అవుతుంది.
అని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. శైలేంద్ర షాకింగ్‌గా అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు రంగాకు సరోజ ఫోన్ చేస్తుంది. ఫోన్ వసుధార లిఫ్ట్ చేయడంతో సరోజ షాక్ అవుతుంది. తర్వాత ధన్‌రాజ్ ద్వారా రంగా అడ్రెస్ కనిపెట్టాలని సరోజ అనుకుంటుంది. తర్వాత అనుపమను కలవడానికి వసుధార వెళ్తుంది. వసుధారను అనుపమ మెచ్చుకుంటుంది. రిషిని తీసుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించావని అభినందిస్తుంది. అయితే మీరు మాతో పాటు ఉంటే మేము మరింత సంతోషంగా ఉంటామని అనుపమను అడుగుతుంది వసుధార. మీరు మహేంద్రను ఒంటరిగా వదిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా ఎందుకు వచ్చారని అడుగుతుంది. అయితే దేవయానికి మను తండ్రి ఎవరన్నది తెలిసిందని, అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్‌మెయిల్ చేసిందని వసుధారతో చెబుతుంది అనుపమ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.