Guppedanta Manasu  Serial Today Episode: జగతి, రిషి చనిపోవడం, వసుధార వెళ్లిపోవడం, మీరు ఎండీగా ఉండేందుకు అయిష్టపడటం వల్లే ఈరోజు కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్‌ చేసుకుంటుంది. ఇలా జరుగుతున్నందుకు నాకూ చాలా బాధగా ఉంది అని మినిస్టర్ అంటాడు. అయితే శైలేంద్ర‌ ను ఎండీ చేస్తే మా కాలేజీ మా ద‌గ్గ‌రే ఉంటుంద‌ని, మా కుటుంబం ప‌రువు నిల‌బ‌డుతుంద‌ని  దేవ‌యాని అంటుంది. అయితే శైలేంద్రకు ఎండీ ప‌ద‌విని ఇవ్వ‌మ‌ని రిషి, వ‌సుధార‌ల‌లో ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి చెప్పాల‌ని ఇదివ‌ర‌కే చెప్పానని మంత్రి గారు చెప్పి డాక్యుమెంట్ల‌పై అంద‌రిని సంత‌కాలు పెట్టమంటాడు.  


మ‌హేంద్ర: నాన్న రిషి...నీకు ప్రాణ‌మైన కాలేజీని నేను కాపాడ‌లేక‌పోతున్నాను. నన్ను క్షమించు నాన్నా.


శైలేంద్ర: ఈ రంగా గాడు ఇంకా రాలేదు. ఫోన్‌ స్విచ్చాప్‌ చేశాడు. అంటే వీడు నాకు హ్యాండిచ్చాడా? అసలు ఏమైంది వీడికి. ( మనసులో అనుకుంటాడు.)


మంత్రి: శైలేంద్ర నువ్వు కూడా సంతకం పెడితే అయిపోతుంది. రా వచ్చి సంతకం పెట్టు.


శైలేంద్ర: ఆ వస్తున్నాను సార్‌. ఈ రంగా గాడు నాకు పెద్ద దెబ్బే వేశాడు.


  అనుకుంటూ వచ్చి పేపర్స్‌ పై సంతకం పెడుతుండగా వసుధార అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. వసుధారను చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతారు. శైలేంద్ర, దేవయాని షాక్‌ అవుతారు. భయంతో వణుకుతూ శైలేంద్ర దెయ్యం అంటూ దేవయాని పక్కకు వెళ్తాడు.


వసుధార: నేను దెయ్యం ఏంటి? శైలేంద్ర నేను  రాననుకున్నావా? రాలేననుకున్నావా?


దేవయాని: వ‌సుధార బ‌తికే ఉంది. నువ్వు మాట్లాడ‌కుండా నోరుమూసుకో


మహేంద్ర: అమ్మా వసుధార నువ్వు తిరిగి వ‌చ్చావంటే రిషి కూడా..


వసుధార: నేను రిషి నీడ‌ను మామయ్య... నీడ వ‌చ్చిన‌ప్పుడు రూపం వ‌స్తుంది క‌దా


 అని వ‌సుధార చెప్పగానే రిషి అలియాస్‌ రంగ గ్రాండ్‌గా  స్టైలిష్ గా  కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు. రిషిని చూసి స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల‌వుతారు. పూల వర్షం కురిపిస్తూ.. ఘ‌నస్వాగ‌తం ప‌లుకుతారు. రిషి వ‌స్తున్నాడంటూ వ‌సుధార ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్తుంది. అయితే నిజంగానే రిషి వచ్చాడా? లేక రంగానే ఇలా వస్తున్నాడా? అర్థం కాక దేవయాని, శైలేంద్ర తికమక పడుతుంటారు. రిషిని  చూడ‌గానే మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ ఫీలవుతాడు. అందరూ ఆనందపడతారు. మంత్రి గారు వెళ్లిపోతారు. ఎండీ సీటు దక్కలేదన బాధతో శైలేంద్ర కళ్లు తిరిగి కిందపడిపోతాడు.తర్వాత  శైలేంద్ర క‌ళ్లు తెర‌వ‌గానే రిషిని చూసి భ‌య‌ప‌డ‌తాడు.


రిషి: అదేంటి అలా భయపడుతున్నారు.


శైలేంద్ర: నువ్వు.. నువ్వు..


రిషి: నేను రంగాను సార్‌ ఎందుకు మీరు అంతలా భయపడుతున్నారు.


శైలేంద్ర: నిజంగానే నువ్వు రంగావేనా? మరి నిజంగా రిషిలా ఎలా నటించావు.


రిషి: అదా నేను కాలేజీలో అడుగుపెట్టగానే ఆ అమ్మాయి కనిపించింది. నేను రిషినే అనుకుని చాలా హ‌డావిడి చేసింది. నేను తన నుంచి ఎస్కేప్ అయ్యే చాన్స్‌ కూడా ఇవ్వకుండా ఇలా అరెంజ్‌ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్‌.?


 అని వ‌సుధార తెలియ‌న‌ట్లుగా అడిగి ఆమె ఆమె గురించి నాకు ఎందుకు చెప్ప‌లేద‌ని శైలేంద్ర‌ ను ప్రశ్నిస్తాడు. నా ద‌రిద్రం కొద్ది వ‌సుధార ఫొటో నీకు చూపించ‌లేదు. నా ఖ‌ర్మ అలా కాలింది కాబ‌ట్టే ఆమె క‌రెక్ట్ టైమ్‌లో కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి మ‌న ప్లాన్ మొత్తం చెడ‌గొట్టింద‌ని శైలేంద్ర బాధప‌డ‌తాడు.మ‌రి ఇప్పుడు ఏం చేయాల‌ని శైలేంద్ర‌ ను అడుగుతాడు రిషి. తాను చెప్పిన‌ ఫైల్స్‌ పై సంత‌కాలు చేయాల‌ని, వ‌ద్ద‌న్న వాటిని ప‌క్కన ‌పెట్టాలని రిషికి చెబుతాడు శైలేంద్ర‌.


రిషి: అయితే కాలేజీ విష‌యంలో రిషిగా నాట‌కం ఆడుతాను కానీ...వ‌సుధార‌కు భ‌ర్త‌ గా మాత్రం న‌టించ‌ను.


శైలేంద్ర: అలా మాట్లాడితే ఎలా బ్రదర్‌. వసుధార దగ్గర రిషిలా ఉండకపోతే వాళ్లకు అనుమానం వస్తుంది. చూడు నీకు  ఇస్తాన‌న్న డ‌బ్బుకు రెండింత‌లు ఎక్కువే ఇస్తాను .


రిషి:  కాలేజీలో ఆ అమ్మాయి చేసిన ఓవర్‌ యాక్షన్‌ చూస్తుంటే ఆమెతో నటించడం చాలా కష్టం అనిపిస్తుంది సార్‌.


వసుధార: ఏంటి ఓవర్‌ యాక్షన్‌, కష్టం అంటున్నారు. ( అంటూ వసుధార వస్తుంది.)


అనగానే శైలేంద్ర మాట మారుస్తాడు.  కాలేజీలో నేను క‌ళ్లు తిరిగిప‌డిపోవ‌డం చూసి కొంద‌రు స్టూడెంట్స్ ఓవ‌ర్‌ యాక్షన్‌ అనుకుంటున్నారు.. అంటూ నువ్వు రిషిని తీసుకురావడం చాలా హ్యాపీగా ఉందని శైలేంద్ర అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.