Guppedanta Manasu  Serial Today Episode:  తన బావ కోసం హైదరాబాద్‌ వచ్చిన సరోజ, ధనరాజ్‌ సహాయంతో శైలేంద్ర ఇంటికి వెళ్తుంది. ఇంట్లో శైలేంద్ర దేవుడి దగ్గర నిలబడి తాను కాలేజీకి ఎండీని కాబోతున్నానని.. ఇంతవరకు ఏం చేసినా ఎండీ సీటు కోసమే చేశానని తప్పు చేసి ఉంటే క్షమించమని కళ్లు మూసుకుని దేవుణ్ని ప్రార్థిస్తుంటాడు. కళ్లు తెరవగానే ఎదురుగా సరోజ, ధనరాజ్‌ కనిపిస్తారు. సరోజను చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని శైలేంద్ర ఇరిటేటింగ్‌గా ధనరాజ్‌, సరోజకు చెప్తాడు. అయితే సరోజ తాను రంగా కోసం వచ్చానని బావా అంటూ గట్టిగా పిలుస్తుంది. ఆ సౌండ్‌కు ఫణీంద్ర, ధరణి, దేవయాని కిందకు వస్తారు.  


ఫణీంద్ర: ఎవ్వరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.


సరోజ: మా బావ కోసం వచ్చాను. ఇతనే మా బావను మా ఊరి నుంచి తీసుకొచ్చారు.  


 అని రిషి ఫోటో చూపిస్తుంటే శైలేంద్ర అడ్డుపడతాడు.


శైలేంద్ర: మీ బావను నేనే తీసుకొచ్చాను కానీ ఇవాళే మీ బావ మీ ఊరికి వెళ్లిపోయాడు.   



 అని శైలేంద్ర చెప్తూ .. ధ‌నరాజ్ కు సరోజను తీసుకెళ్లు అని సైగ చేస్తాడు. ధనరాజ్‌  కూడా స‌రోజ‌ను క‌న్వీన్స్ చేస్తాడు.  మా బావ ఒకవేళ ఊరిలో కనక లేకపోతే మళ్లీ వస్తానని వార్నింగ్‌ ఇస్తున్నట్లు చెప్పి సరోజ అక్కడి నుంచి ధనరాజ్‌తో వెళ్లిపోతుంది. స‌రోజ వెళ్లిపోగానే ఫణీంద్ర కోపంగా శైలేంద్రను తిడుతూ ఆమె బావ ఎవ‌రు? అత‌డిని నువ్వెందుకు ఇక్క‌డికి తీసుకొచ్చావ‌ని అడుగుతాడు. చిన్న పని ఉండి తెలిసిన వ్యక్తి కాబట్టి తీసుకొచ్చాను అని శైలేంద్ర ఏవో మాటలు చెప్పి తప్పించుకుంటాడు. మరోవైపు  రిషి, వసుధారలు కలిసి ఆలోచిస్తుంటారు.


వసుధార: సర్‌ ఎవ‌రికి ఎండీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌బోతున్నారు.


రిషి: అన్ని అర్హ‌త‌లు ఉన్న నువ్వేమో ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి ఒప్పుకోవ‌డం లేదు... ఏం నిర్ణ‌యం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. వసుధార నువ్వు ఎవ‌రి పేరు చెబితే వారినే ఎండీగా ప్ర‌క‌టిస్తాను.


వసుధార: ఎవరి పేరు చెప్పాలో..  ఏం చేయాలో నాకు తెలుసు సర్‌. ( అని మనసులో అనుకుంటుంది.)


తర్వాత రిషి, వ‌సుధార క‌లిసి కారులో వెళుతుండ‌టం స‌రోజ చూసి వాళ్ల కారును ఫాలో అవుతుంది. మ‌రోవైపు శైలేంద్ర‌ కు పాండు ఫోన్ చేస్తాడు.


పాండు: సార్‌ నమస్తే..  నేను పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నాను. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న మ‌ధ్య జ‌రిగిన డీలింగ్స్‌ మొత్తం పోలీసులకు చెప్తాను.


దోపీడి, దుర్మార్గాలు చేస్తూ ఎంతో మంది క‌న్నీళ్ల‌కు కార‌ణ‌మ‌య్యాను. ఇప్పుడు మంచివాడిగా మారిపోవాల‌ని అనుకుంటున్నాను.


శైలేంద్ర: అరేయ్‌ ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెబితే నేనే అక్కడికి వస్తాను.


అని పాండును కన్వీన్స్‌ చేస్తాడు. తర్వాత రిషికి ఫోన్‌ చేస్తాడు శైలేంద్ర.


శైలేంద్ర: నువ్వు కూడా నీ ఆలోచనలు మార్చుకున్నావా? బోర్డ్ మీటింగ్‌లో వ‌సుధార చెప్పిన‌ట్లు కాకుండా నేను చెప్పిందే చేయాలి.


రిషి : స‌రే సార్‌ మీరు చెప్పిందే చేస్తాను. మీరెందుకు పదే పదే టెన్షన్‌ పడుతూ నాకు ఫోన్‌ చేస్తున్నారు.


 అని వసుధారతో కలిసి కారులో వెళ్తున్న రిషి మాట్లాడతాడు. అయితే రిషి కారును ఫాలో అవుతున్న సరోజ నాలుగు రోడ్ల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. కారు ఎటు వెళ్లిందో తెలియక తికమక పడుతుంది. ఇంతలో ధనరాజ్‌ కోపంగా నువ్వు నా కోసం వచ్చావా? మీ బావ కోసం వచ్చావా? అంటూ ప్రశ్నించడంతో సరోజ తన మాటలతో ధనరాజ్‌ ను కూల్‌ చేస్తుంది. మరోవైపు కారులో వెళ్తున్న రిషికి బుజ్జి ఫోన్‌ చేసి నిన్ను వెతుక్కుంటూ సరోజ సిటీకి వచ్చిందని ధనరాజ్‌ సాయంతో నువ్వు ఎక్కడున్నది కనిపెట్టిందని చెప్పడంతో.. వసుధార ఏమైందని అడుగుతుంది. దీంతో మా సరోజ సిటీకి వచ్చిందట బుజ్జి చెప్పాడు అనడంతో వసుధార రిషి మీద అలుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.