Guppedanta Manasu Today Episode: మహీంద్రా ని వసు, మనుని  దత్తత తీసుకోవడం  విషయం గురించి మళ్ళీ ఒకసారి అడుగుతుంది. ఎందుకంటే అందరూ  ఒకేలా ఆలోచించరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు మీరు ఒకసారి ఆలోచించండి అని అంటుంది. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను ఎవరు ఎలా అనుకుంటే నాకు ఎందుకు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు ఎవరూ మనకి సపోర్ట్  ఉండదు. సపోర్ట్ గా ఉండటం పక్కన పెడితే మాటలతో ఇంకా వేదని పెంచుతారు అని అంటాడు. అందుకే  మనం చేసే దానిలో న్యాయం ఉంటే చాలు,  అది మంచి వైపు దారితీస్తుందన్న  నమ్మకం ఉంటే చాలు. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి అని అంటాడు మహేంద్ర.


చివరికి మహేంద్ర తన కోడల్ని డైరెక్ట్ గా అడుగుతాడు నేను నా కొడుకు దత్తత తీసుకోవడం తప్పా, ఒప్పా  అని అడుగుతాడు. ఎందుకంటే నాకు నువ్వు మాత్రమే  ఇంపార్టెంట్.   మనుని చూస్తుంటే నాకు పరాయివాడిలా  కనిపించట్లేదు. తను  నా కొడుకు లాగా తన బాధ్యతలు నిర్వహించినట్లుగా కనిపిస్తుంది. రిషి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు తెలియక చాలా దుఃఖంలో కూరుకుపోయిన నాకు, మనో కొడుకులా కనిపించాడు. ఎందుకో తెలియదు కానీ మనుతో మాట్లాడుతుంటే నాకు  రిషితో  మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది అమ్మ అని అంటాడు. మను విషయంలో చాలా ఎమోషనల్ అవుతాడు. మనుతో మాట్లాడమని వసుకి చెబుతాడు.  వసుధార  మనుతో మాట్లాడటానికి వెళుతుంది 


మను: మళ్లీ రాయబారానికి వచ్చారన్నమాట 


వసుధ: మను గారు 


మను: అంతే కదా మరి. ఇంతకుముందు విశ్వనాథంగారి  విషయంలో రాయబారం చేశారు. ఇప్పుడు మీ మామయ్య గారి విషయంలో రాయబారం చేయడానికి వచ్చారు. 


వసుధ: అది కాదండి. అసలు మీరు ఏమి నిర్ణయించుకున్నారు 


మను: ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముంది మేడం. ఏమీ లేదు. దత్తత వెళ్లడానికి నాకు ఇష్టం లేదు. 


వసుధ: అయితే ఇదే విషయం మామయ్యగారు  అడిగినప్పుడు చెప్తే సరిపోతుంది  కదా ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు. 


మను: చెబితే ఆయన నా మాట వినటం లేదు. గట్టిగా చెబితే చనిపోతానని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఎలా చెప్పగలనండి. మహేంద్ర సార్ అంటే నాకు చాలా గౌరవం ప్రేమ. ఆయన కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది మాత్రం చేయను. అందుకు నా మనసు అంగీకరించడం లేదు. 


వసుధ: ఎందుకు 


మను: ఆల్రెడీ చెప్పాను కదండీ మళ్లీ అడుగుతారేంటి. మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు నేను ఎందుకు వెళ్లాలి ఎవరి కోసం వెళ్లాలి. ఇన్నాళ్లుగా నా బాధను అనుభవిస్తున్నది నాకే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు దత్తత వెళితే అయిపోతుందా. నేను ప్రశాంతంగా ఉంటానా. ప్రశాంతంగా ఉండలేను. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండలేను. నన్ను కన్న తండ్రి ఎవరో తెలిసేంతవరకు నా మనసు ఆరాట పడుతూనే ఉంటుంది. నేను ఈ క్షోభ అనుభవిస్తూనే ఉంటాను. 


వసుధ: అది కాదు మనో గారు 


మను: మేడం ముందు ఈ దత్తత విషయం పక్కన పెట్టండి అసలు ఒక బిడ్డకి కన్న తండ్రి ఎవరో చెప్పకుండా ఏ తల్లి అయినా ఉంటుందా ఉండదు కదా.  


వసుధ: మీ బాధ అందరికీ కారణం అనుపమ మేడం. మేడమే ఏం చెప్పకుండా తప్పు చేస్తున్నారు. 


మను: మేడం ప్లీజ్.. తన్ని తప్పు పట్టకండి నేను భరించలేను. తను నిజం చెప్పలేదంటే ఏదో ఒక గట్టి రీజన్  ఉండే ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే వేరే ఎవరికీ చెప్పకుండా ఉన్న కనీసం నాకు చెప్పాలి కదండీ. నేను తన కన్న కొడుకుని కదా. నా దగ్గర ఆ విషయం దాచడం ఎందుకు.  నేను గట్టిగా అడిగినందుకు నా జీవితం నుండి వెలివేసింది. కన్న కొడుకుని పరాయి వాళ్ళు లాగా చూస్తోంది. 


వసుధ: మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరంటే మేడమ్ కి ప్రాణం. 


మను: తెలుసండి కానీ కన్నతల్ని అమ్మా అని నోరార పిలవలేని ఈ జన్మ ఇంకెందుకు అండి. మనకి తెలియని ప్రశ్నలు ఎదురైనా కష్టాలు ఏమైనా, జీవితంలో ఏదైనా సరే, అమ్మతోనే పంచుకుంటాం కదా. కానీ మనకి దారి చూపుతూ ముందుకు నడిపిస్తుంది కదా. మరి నా తల్లి నా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు. ఎందుకు నన్ను ఇలా వేదానికి గురి చేస్తోంది. 


వసుధ: మీరే అంటున్నారు కదండీ ఏదైనా పెద్ద రీజన్ ఉందేమోనని. 


మను: అదేనండి అలాంటిది ఏమన్నా ఉంటే నా తండ్రి గురించి నాకు మాత్రం చెప్పమని మీరు మీ మేడంని అడగగలరా. నా తండ్రి చెడ్డవాడు చెడ్డవాడిని చెప్పమనండి. మంచివాడు అయితే మంచివాడిని చెప్పమనండి. తను ఒక తాగుబోతు అయితే తాగుబోతు అని చెప్పమనండి. తిరుగుబోతు అయితే తిరుగుబోతు అని చెప్పమనండి. ఒకవేళ నా తండ్రి చచ్చిపోయి ఉంటే.. 


వసుధ: మనుగారు


మను: అవును మేడం నా తండ్రి చనిపోయి ఉంటే. చనిపోయాడని చెప్పండి. అంతేకానీ ఇలా మౌనంగా ఉంటూ నన్ను క్షోభ పెట్టొద్దు అని చెప్పమనండి. మన కాళ్లకు ముల్లు గుచ్చుకుంటేనే ప్రాణం విలవిలాడిపోతుంది. అలాంటిది తండ్రి అన్నమాట విన్నప్పుడల్లా వంద గుణపాలు ఒక్కసారి నన్ను గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది. నా తండ్రి ఎవరో నాకు చెప్పమనండి.  


అనుపమ ఇంటికి వెళ్ళిన వసుధార మను అడిగినవన్నీ అనుపమని  అడుగుతుంది. మను తండ్రి చనిపోయాడు కదా అని గట్టిగా ప్రశ్నిస్తుంది.. దీంతో అప్పుడే అక్కడికి వచ్చిన మను పెద్దమ్మ అతను బతికే ఉన్నాడు అని చెబుతుంది.