గుప్పెడంతమనసు మే 27 ఎపిసోడ్
వసుధార అబద్ధం చెప్పడం, జగతీ కాలేజ్‌కు దూరంగా ఉంచడంతో బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. జగతి, వసుధార ఎంత చెప్పినా రిషి వినడు.
రిషి: ఈ బాధను మోయడం నా వల్ల కావట్లేదు మేడం, నమ్మి మోసపోయాను.
జగతి: రిషి నిన్ను కాపాడుకోవడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది
రిషి: తప్పంతా నాదే, నమ్మడం నాదే తప్పు. అయినా ఓ మనిషిని కాపాడటానికి వాడి వ్యక్తిత్వాన్ని చంపేస్తారా? ఏం పాపం చేశాను నేను.. మీ కడుపున పుట్టడం నేను చేసిన నేరమా? అన్నదమ్ములు మోసం చేయడం, భార్య-భర్తలు ద్రోహం చేసుకోవడం చూస్తాం.. కానీ కడుపున పుట్టిన బిడ్డకు ఏ తల్లి ద్రోహం చేస్తుంది మేడం
జగతి: నన్ను నమ్ము రిషి నేను నిన్ను ద్రోహం చేయాలి అనులేదు
రిషి: ఇది ద్రోహం కాదు.. నమ్మించడానికి మాటలు లేవనుకుంటా..మీ శిష్యురాలినికూడా కుట్రలో భాగం చేశారు. మనుషులు పుడతుంటారు, చనిపోతారు అది కాలనిర్ణయం. కానీ మీరు బతికుండగానే చంపేశారు. నా జీవితంలో నాకు మాయని మచ్చను మిగిల్చారు.
జగతి: ఏ తల్లి కూడా కొడుకును అన్యాయం చేయదు
రిషి: అవును నిజమే.. ఎక్కడో చదివాను చెడ్డ కొడుకు ఉంటాడు కానీ.. చెడ్డ తల్లి ఉండదని. మీరు నాపై అనర్హత వేటు వేశారు కదా.. అలాగే నేను మిమ్మల్ని చూడటానికి, మాట్లాడటానికి వీలు లేకుండా అనర్హుడిని చేయండి. చిన్నతనంలో నన్ను వద్దనుకున్నట్లుగానే.. ఇప్పుడు కూడా వద్దనుకోండి . ఈ మోసగాడిని ఒంటరిగా వదిలేయండి
జగతి: మీ నాన్న అడిగితే నేను ఏం సమాధానం చెప్పమంటావ్
రిషి: మోసం చేసి పారిపోయాడని చెప్పండి. ముఖం చెల్లక, తలెత్తుకోలేక ఎటో వెళ్లిపోయాడని చెప్పండి . ఆయన నేను మోసగాడు అంటే నమ్మరేమో.. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించండి, నేను కచ్చితంగా తప్పు చేశానని అర్థమయ్యేలా చెప్పండి
Also Read: కాలేజీకి, కుటుంబానికి గుడ్ బై చెప్పేసిన రిషి - శైలేంద్ర ప్లాన్ రివర్స్!
జగతి: రిషి ఈ అమ్మను క్షమించు..
రిషి: "మీరు నన్ను వదిలి వెళ్లిన తర్వాత ఎంతో క్షోభ ఎదుర్కొన్నాను. కానీ మీరు మళ్లీ వచ్చిన తర్వాత మీరు వెళ్లిన కారణంగా కరెక్టేనేమో అని అనుకున్నాను. అందుకే చాలా సార్లు అమ్మా..! అని పిలవాలనుకున్నాను. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని క్షమించడానికి నేను ఎవరిని? తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదనుకుంటా. కానీ కొడుకుగా కాపాడుకుంటున్నానని కారణం చెప్పి.. వ్యక్తిగా నన్ను చంపేశావ్ కదమ్మా?" అని మొదటి సారి అమ్మా అని అంటాడు.
జగతీ ఓ పక్క సంతోషపడుతూనే మరోపక్క బాధపడుతుంది. రిషి.. నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా? అని జగతీ అనగానే.. జీవితంలో ఇంక ఈ పిలుపు మీరు వినలేదనే బెంగ ఉండకూడదని పిలిచాను.. ఇంక నేను మీ జీవితాల్లోకి రానని చెప్పి వెళ్లిపోతాడు. వసుధార వెనుకే వెళ్లి హగ్ చేసుకుని ఏడుస్తుంది కానీ రిషి ఆమెను తోసేసి వెళ్లిపోతాడు.
రిషి: నువ్వు చెప్పింది అబద్ధం అని నేను నిరూపించగలను.. కానీ అందరి ముందు నువ్వు చిన్నబోవడం నాకు ఇష్టం లేక చేయని తప్పునకు దోషిగా నిలుచున్నాను. ప్రేమంటే స్వర్గమని అనుకున్నాను.. కానీ నరకం అని నువ్వు నిరూపించావు. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అని తెగేసి చెప్పేస్తాడు రిషి.
వసు: సార్ మీరు ఎన్ని అన్నా పడతాను.. కానీ మిమ్మల్ని కాపాడుకోడానికే చేశాను
రిషి: ఇంక నువ్వు కాపాడుకోవడమేంటి? నేను దాపరికాలు లేని ప్రేమను కోరుకున్నాను.. కానీ నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూనే బతికావు, దాపరికాల్లోనే బతికావ్"
వసు: "నేను కూడా మీతోపాటే వస్తాను, మీతోనే ఉంటాను" అంటూ వసుధార బతిమాలాడుతుంది. "కానీ నేను మాత్రం నువ్వున్న చోట నేను ఉండలేను. పెద్దల కుదిర్చిన బంధంతో నువ్వు మా ఇంట్లో ఉంటానంటే ఉండు.. కానీ నేను మాత్రం అక్కడ ఉండను. నువ్వు నా పక్కను ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను" అంటూ తెగేసి చెబుతాడు.
ఎంగేజ్మెంట్ రింగు తీసేసి వసుధార చేతిలో పెట్టి.. మన బంధానికి మనం పెట్టుకున్న పేరు రిషిధార. ఇప్పుడు వసుధార మాత్రమే మిగిలిందంటాడు.
ఎపిసోడ్ ముగిసింది...
Also Read: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!