గుప్పెడంతమనసు మే 26 ఎపిసోడ్


మిష‌న్ ఎడ్యుకేష‌న్ చెక్‌ను రిషి అక్ర‌మంగా సార‌థికి ఇచ్చాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. జగతి హెడ్డుగా మినిస్ట‌ర్ సార‌థ్యంలో విచార‌ణ మొద‌ల‌వుతుంది. చెప్పు వసుధారా అని శైలేంద్ర అడగడంతో..రిషి కూడా వసుధార మనం తప్పుచేశామా చెప్పు అని నిలదీస్తాడు. వ‌సుధార మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉండిపోతుంది. 
జగతి: స‌మాధానం చెప్పు వసుధారా..రిషిసార్ జీవితం నీ చేతుల్లో ఉంది
మినిస్టర్: ఇస్తే ఇచ్చామని చెప్పు లేదంటే లేదని చెప్పు వసుధారా ఎవ్వరికీ భయపడొద్దు
రిషి: వసుధారా చెప్పు అని అరుస్తాడు
వసు: గుండెల్లో బాధను దాచుకుని కన్నీళ్లతో...  ఆ చెక్ రిషి సార్ ఇచ్చారని అబద్ధం చెబుతుంది
ఫణీంద్ర: వ‌సుధార మాట‌లు అబద్ధం. రిషి త‌ప్పుచేయ‌డు
జగతి: త‌ప్పు చేయ‌క‌పోతే ఈ సాక్ష్యాలు ఎలా వ‌స్తాయి
శైలేంద్ర: రిషికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్లుగా నాట‌కం ఆడుతూ వ‌సుధార అబ‌ద్ధం చెబుతుంద‌ని కోపంగా మాట్లాడుతాడు.
రిషి: నా క‌ళ్ల‌ల్లోకి సూటిగా చూసి చెప్పు...ఆ చెక్ నేను ఇచ్చానా అని మ‌రోసారి వ‌సుధార‌ను నిల‌దీస్తాడు రిషి. రిషి క‌ళ్ల‌ల్లోకి చూసి మీరే ఆ చెక్ ఇచ్చారు అని వ‌సుధార స‌మాధానం చెబుతుంది. జ‌గ‌తి మేడ‌మ్‌, వ‌సుధార ఇద్ద‌రు నేను త‌ప్పు చేశాన‌ని నిరూపించారు కాబ‌ట్టి తాను చెప్ప‌డానికి ఏం లేద‌ని రిషి ఎమోష‌న‌ల్‌ అవుతాడు. త‌ప్పు చేశాను...మ‌నుషుల్ని న‌మ్మి త‌ప్పు చేశాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. అడ్డంగా దొరికిపోయి దోషిగా నిల‌బ‌డ్డాన‌ని అంటాడు. మ‌నుషుల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పాయి. అంత‌కుమించి త‌ప్పు ఇంకేం ఉంటుంది. నేను చేసిన త‌ప్పును నిరూపించ‌డానికి మీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉన్నాయి. దోషిగా నేను మీ ముందు ఉన్నాను. నాకు శిక్ష ప‌డాలి అంటాడు. 
మినిస్టర్: ఈ విషయంలో జగతి మేడం తీర్పు చెప్పాలి
జగతి: కాలేజీ ఎండీ బాధ్య‌త‌ల నుంచి రిషి త‌ప్పుకోవాల‌ని జ‌గ‌తి తీర్పు చెబుతుంది. కాలేజీతో రిషికి ఎలాంటి సంబంధం ఉండ‌కూడ‌ద‌ు. ఇత‌ర విద్యాసంస్థ‌ల్లో ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి వీలులేదు. 


Also Read: కొడుకుని నిండా ముంచేసిన జగతి, రిషి-వసు మళ్లీ దూరం కానున్నారా!


రిషి కాలేజీకి దూరం కావడంతో ఎండీ సీటు తనకే దక్కుతుందని భావిస్తాడు శైలేంద్ర..కానీ మినిస్టర్ షాకిస్తాడు. రిషి త‌ర్వాత కాలేజీ ఎండీ బాధ్య‌త‌ల్ని జ‌గ‌తి చేప‌ట్ట‌బోతున్న‌ట్లు చెబుతాడు. జ‌గ‌తిని ఎండీగా అపాయింట్ చేస్తూ రెండు నెల‌ల క్రిత‌మే రిషి త‌న‌కు లెట‌ర్ పంపించాడ‌ని చెబుతాడు. ఇందుకు బోర్డు స‌భ్యుల ఆమోదం కూడా ఉంద‌ని చెబుతాడు. తమ ప్లాన్ రివర్స్ అవడంతో దేవయాని-శైలేంద్ర షాక్ అవుతారు.
రిషి: జ‌గ‌తి మేడ‌మ్ ఇక నుంచి డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ  ..  కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేద‌ు. మీరు విధించిన శిక్ష‌ను సంతోషంగా స్వీక‌రిస్తాన‌ు
జగతి: ఇది అభియోగం మాత్ర‌మే...నిజం నిరూపించి కాలేజీ ఎండీ బాధ్య‌త‌ల్ని తిరిగి స్వీక‌రించ‌వ‌చ్చు
రిషి: నాకు ఆ అవ‌స‌రం లేద‌ు ఈ క్ష‌ణం నుంచి ఇంట్లోనే కాదు మీ జీవితాల్లో కూడా ఉండ‌లేన‌ు. ఇప్పుడు ఈ రిషి మోస‌గాడు. నేర‌స్తుడు. శిక్ష‌ను మోస్తూ మీ ముందు ఉండ‌లేను. అందుకే ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దూరంగా వెళ్లిపోతున్నాన‌ు. నన్ను ఎవ‌రూ ఆప‌వ‌ద్ద‌ని, ఇక నుంచి రిషి ఒంట‌రి 
వ‌సుధార ఏదో చెప్పాల‌ని ప్ర‌య‌త్నించినా మాట విన‌డు. ఇది నాకు నేను విధించుకున్న శిక్ష , ఈ సంఘ‌ట‌న నా జీవితంలో ఓ మ‌చ్చ. నా చుట్టూ ఉన్న మ‌నుషుల మీద ఓ క్లారిటీ వ‌చ్చింది. ఎవ‌రేంటో పూర్తిగా తెలిసింది. వెళ్తున్నాన‌ని శైలేంద్ర‌, దేవ‌యానిల‌తో మాత్ర‌మే చెప్పి రూమ్ నుంచి వేగంగా బ‌య‌ట‌కు వెళ‌తాడు. రిషిని ఆపేందుకు జగతి,శైలేంద్ర వెంటపడతారు..


Also Read: 'గుప్పెడంత మనసు' రిషి ( ముఖేష్ గౌడ) తండ్రి కన్నుమూత


దేవ‌యాని-శైలేంద్ర‌
రిషిని కాలేజీకి దూరం చేయాల‌నే త‌మ ప్లాన్ ఫ‌లించినందుకు దేవ‌యాని, శైలేంద్ర ఆనంద‌ప‌డ‌తారు. కానీ ఎండీ సీట్ త‌న‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో శైలేంద్ర అసంతృప్తిగా ఉంటాడు. ఎండీ సీట్‌ను జ‌గ‌తికి ఇవ్వాల‌ని రిషి ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నాడ‌న్న‌ది ఇద్ద‌రికి అంతుప‌ట్ట‌దు. జ‌గ‌తిని నుంచి డీబీఎస్‌టీ కాలేజీని ఈజీగా చేజిక్కించుకోవ‌చ్చ‌ని దేవ‌యాని అంటుంది. కానీ శైలేంద్ర మాత్రం అంగీకరించడు. పిన్ని చాలా తెలివైంది, కష్టాలు ఎలా ఎదుర్కోవాలో పాఠాలు చెప్పడమే కాదు ఎవర్ని ఎలా ఎదుర్కోవాలో తనకి తెలుసు.. జగతి పిన్నికి ధైర్యం ఎక్కువ‌ని స‌మాధాన‌మిస్తాడు. జ‌గ‌తికి తెలివితేట‌లు, ధైర్యంతో పాటు భ‌యం ఎక్కువేన‌ని దేవ‌యాని అంటుంది. ఆమె భ‌యాన్ని ఉప‌యోగించుకొనే రిషిని డీబీఎస్‌టీ కాలేజీ నుంచే కాకుండా సిటీకి దూరంగా పంపించామ‌ని అంటాడు. అదే భ‌యంతోనే జ‌గ‌తిని ఎండీ సీట్ నుంచి దూరంగా పంపించాల‌ని అనుకుంటారు.రిషి మ‌ళ్లీ సిటీలో అడుగుపెట్టే అవ‌కాశం లేద‌ని ఇద్దరూ సంతోషిస్తారు..