గుప్పెడంతమనసు మే 25 ఎపిసోడ్
శైలేంద్ర రిషిని చంపేస్తాడేమో అని భయపడిన జగతి..ఎలాగైనా రిషిని కాలేజీ నుంచి పంపించేసి బతికించుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ మేరకు వసుధార నుంచి గురదక్షిణ కావాలంటూ మాటతీసుకుంటుంది. రిషి ప్రాణాలు నిలబడాలంటే చెక్ గురించి అబద్దం చెప్పమని వసుధారను జగతి కన్నీళ్లతో అడుగుతుంది
జగతి: గురుదక్షిణ కష్టంగా అనిపిస్తే ఓ బిడ్డకు తల్లిగా అడుగుతున్నా...నా కొడుక్కి ప్రాణ భిక్ష పెట్టమని వసుధారను వేడుకుంటుంది జగతి. రిషి కాలేజీ నుంచి వెళ్లిపోవడం తనకు ఇష్టం లేదని, ఎంతో కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు..అలాంటిది రిషిని తానే కాలేజీ నుంచి వెళ్లగొట్టాల్సివస్తోంది
ఈ బాధను భరించలేకపోతున్నానని, ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నా. రిషి సంతోషం కంటే బ్రతికి ఉండటం ముఖ్యం. శైలేంద్ర ఉచ్చు నుంచి రిషి బయటపడిన తర్వాత ఏం చేయాలనేదాని గురించి ఆలోచిద్దాం
వసు: అబద్ధం చెబితే రిషి తనను అసహ్యించుకుంటాడని ఎమోషనల్ అవుతుంది. తమ బంధానికి తెరపడుతుందని, మళ్లీ తమ మధ్య దూరం పెరుగుతుందని, లైఫ్‌లో మళ్లీ రిషి నా ముఖం కూడా చూడరు
జగతి: రిషి కాలేజీలో ఉంటే శైలేంద్ర చంపేస్తాడు. రిషి ప్రాణాలను కాపాడటానికే ఇదంతా చేస్తున్నామని, రిషి తప్పకుండా అర్థం చేసుకుంటాడని వసుధారను కన్వీన్స్ చేస్తుంది
వసు: అబద్ధం చెప్పడానికి అంగీకరించని వసుధార రిషి పరువు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడా కానీ ఈ నిందతో పరోక్షంగా ప్రాణాలు తీయలేను అంటుంది కానీ ఆ తర్వాత జగతి కన్నీళ్లకు కరిగిపోతుంది..
Also Read: 'గుప్పెడంత మనసు' రిషి ( ముఖేష్ గౌడ) తండ్రి కన్నుమూత
రిషి-వసు
రిషిని తన క్యాబిన్‌కు రమ్మని మెసేజ్ చేస్తుంది వసుధార. రూమ్‌లోకి రిషి అడుగుపెట్టగానే అతడిని కౌగిలించుకొని బోరున ఏడ్చేస్తుంది. ఆమె కన్నీళ్లు చూసి రిషి కంగారు పడతాడు. ఏమైందని అడుగుతాడు. కానీ వసుధార మాత్రం మాట్లాడదు. ఏ మనిషికైనా జీవితంలో ఏది ముఖ్యమని రిషిని అడుగుతుంది. ప్రాణం ఉంటేనే పేరు, పరపతి నిలబడతాయి కదా అని అంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోతున్నానని వసుధారను ఓదార్చుతాడు. తన జీవితంలో చాలా సంతోషకరమైన రోజు ఇదని, ఎందుకు నువ్వు, జగతి మేడమ్ ఇలా కంగారు పడుతున్నారని వసుధారను రిషి అడుగుతాడు. కానీ వసుధార మాత్రం నిజం చెప్పకుండా దాచేస్తుంది. నువ్వు, మేడమ్ నా పక్కన ఉండగా నాకు ఎలాంటి ఆపద రాదని రిషి అంటాడు. ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ హాల్‌కు వెళతారు.
Also Read: గుప్పెడంతమనసులో ఉప్పెన, కాలేజీ నుంచి రిషి ఔట్ - కొడుకుపై నిందవేసిన జగతి!
కాన్ఫరెన్స్ హాల్‌లో మినిస్టర్, ఫణీంద్ర, దేవయాని, శైలేంద్రతో పాటు అందరూ సీరియస్‌గా ఉంటారు.నీ మీద అభియోగం వచ్చిందని రిషితో అంటుంది జగతి. అది నిజమో కాదో తెలియాలని అంటుంది. జగతి మాటలకు రిషి షాక్ అవుతాడు. ఒకదానికి యూజ్ చేయాల్సిన చెక్‌ను మరోదానికి వాడావని సారథి చేసిన ఆరోపణ గురించి రిషికి జగతి వివరిస్తుంది. తనకు మిషన్ ఎడ్యుకేషన్ చెక్ రిషి ఇచ్చాడని సారథి మరోసారి అందరి ముందు అబద్ధం చెబుతాడు. రిషి అతడిపై సీరియస్ అవుతాడు. సారథి అబద్ధం చెబుతున్నాడని అంటాడు. దేవయాని, శైలేంద్ర...రిషికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడుతారు. మిషన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోటి రూపాయల చెక్‌ను సారథికి ఎందుకు ఇచ్చావని చెక్‌ను చూపిస్తుంది జగతి. ఆ చెక్ చూసి రిషి షాక్ అవుతాడు. ఏ స్వార్థంతో ఈ పని చేశారని జగతి అనడంతో రిషి ఆమెపై ఫైర్ అవుతాడు. చెక్‌పై తాము సంతకం చేయలేదని అంటాడు. కానీ జగతి మాత్రం ఆ సంతకాలు ఒరిజినల్‌తో మ్యాచ్ అయ్యాయని అంటుంది.
శైలేంద్ర: రిషి తప్పుచేశాడంటే ఎవ్వరూ నమ్మరు..రిషి తప్పుచేశాడని ఎవరో చెప్పడం దానికి మీరిలా మీటింగ్ పెట్టడం బాలేదు. వసుధారా నువ్వైనా చెప్పు
రిషి: ఈ చెక్‌ను మనం ఇష్యూ చేశామా అని వసుధారను అడుగుతాడుకానీ వసుధార మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
మినిస్టర్: మిషన్ ఎడ్యుకేషన్ చెక్ పవర్ నీకు, వసుధారకు మాత్రమే ఉంది. మీకు తె లియకుండా ఆ చెక్ ఎలా బయటకు వస్తుంది
రిషి: వాళ్లు మనల్ని అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. భరించలేని నింద వేస్తున్నారని, మన వ్యక్తిత్వానికి సంబంధించిన బందించిన విషయంలో మౌనం సరికాదని వసుధారతో రిషి అంటాడు. రిషినే తనంతట తానుగా ఈ చెక్ ఇచ్చాడా...నువ్వు ఇచ్చావా అని మినిస్టర్ మరోసారి వసుధారను అడుగుతాడు. వసుధార మాత్రం మౌనం వీడదు. జగతి కోసం అబద్ధం చెప్పాలని వసుధార నిర్ణయించుకుంటుంది. వసుధార ఎంతకు సమాధానం చెప్పకపోవడంతో రిషి సీరియస్ అవుతాడు. గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది