గుప్పెడంతమనసు జూన్ 23 ఎపిసోడ్


వసు ఆలోచనల్లో ఉన్న రిషి దగ్గరకు కంగారుగా వస్తాడు విశ్వనాథం. ఆయన కంగారుచూసి ఏం సార్ ఏంజెల్ కి ఏమైనా అయిందా అని అడుగుతాడు. లేదని చెప్పిన విశ్వనాథం...మన కాలేజీలో కేజీ బ్యాచ్ రేవ్ పార్టీలో చిక్కుకుని పోలీసులకు పట్టుబడ్డారు వాళ్లపై కేసు నమోదు చేస్తే రేపు పేపర్లో వస్తే కాలేజీ పరువుపోతుందని బాధపడతాడు, ఇప్పటికే SI తో మాట్లాడినా ప్రయోజనం లేదంటాడు. నేను చూసుకుంటానని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కి వెళతాడు రిషి. అక్కడ దిగగానే వసుధార కనిపించడంతో ఫైర్ అవుతాడు. పోలీసుల నుంచి కాల్ వస్తేనే తాను వచ్చానని క్లారిటీ ఇస్తుంది వసుధార. లోపలకు వెళ్లిన రిషిని చూసి SI షాక్ అవుతాడు. ( గతంలో కాలేజీలో వసుధార బావని అరెస్ట్ చేయిస్తాడు రిషి .. అప్పుడు అక్కడున్న SI).  రండి సార్ లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం అని తీసుకెళతాడు. అదేంటి వీళ్లొచ్చారు వీళ్లు మనల్ని బుక్ చేస్తారని టెన్షన్ పడతారు కేడీ బ్యాచ్. ఆ పోలీస్ కుశల ప్రశ్నలు వేసి మీరిద్దరూ ఇంకా పెళ్లిచేసుకోలేదా అని అడుగుతాడు. ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత స్టూడెంట్స్ గురించి రిషి రిక్వెస్ట్ చేయగానే SI సరే అంటాడు. బయటకు వెళ్లిన కానిస్టేబుల్ కేజీ బ్యాచ్ పేర్లు పిలవడంతో వాళ్లంతా తమపై రిషిసార్ ఏదో చెప్పి ఉంటారని భయపడుతుంటారు. బయటకు వచ్చిన రిషి, వసుధార థ్యాంక్స్ చెప్పేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత రిషి సార్ వల్లే మిమ్మల్ని వదిలేస్తున్నానని చెప్పి వదిలేస్తాడు. రిషి గొప్పతనం గురించి SI ఓ చిన్న క్లాస్ వేసి పంపించేస్తాడు.


Also Read: ప్రేమ వర్షంలో తడిసిముద్దయ్యేందుకు ఎదురుచూస్తోన్న వసు, ఎడారిలోనే ఉంటానంటున్న రిషి!


బయటకు వచ్చిన కేడీ బ్యాచ్ తో మీరు బైక్స్ పై నా కారుని ఫాలో అవండి అని చెబుతాడు. క్యాబ్ బుక్ చేసుకుంటున్న వసుధారతో అవసరం లేదు నా కార్లో వెళదాం రండి అని పిలుస్తాడు. ముందుకూర్చుంటున్న వసుధారతో బ్యాక్ సీట్లో కూర్చోమని కరాఖండిగా చెబుతాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటున్నారో అనుకుంటూ ఫాలో అవుతారు కేడీ బ్యాచ్. ఎక్కడికి తీసుకెళతున్నారు సార్ అని వసు అడిగితే సరదాకో, షికారుకో కాదు మీతో నాకేం పని ఉంటుందంటాడు. నా పర్సనల్ పనిపై తీసుకెళ్లడం లేదు కాలేజీ స్టూడెంట్స్ కోసం తీసుకెళుతున్నా మీకేదైనా శ్రమ ఉంటే ఇక్కడే దింపేస్తాను అంటాడు. మీరు చేసే పనిని నేను శ్రమ అనుకోలేదంటుంది వసుధార. ఇద్దరూ మనసులతో చాలా మాట్లాడుకుంటారు. ఈ రోజు వెనుకసీట్లో ఉండొచ్చు కానీ త్వరలోనే ముందుసీట్లోకి వచ్చే రోజొస్తుందని అనుకుంటుంది.


రిషి కేడీ బ్యాచ్ ని తీసుకుని నైట్ కాలేజీ దగ్గర ఆపుతాడు. మనం పగలే చదవవం నైట్ చదువుకునేవాళ్లు కూడా ఉన్నారా అనుకుంటారు కేడీ బ్యాచ్.  ఆ ప్లేస్ ని చూపిస్తూ ఇదేంటి, ఎప్పుడైనా వచ్చారా అని రిషి అడిగితే...ఈ సమయానికి బార్లో ఉంటాం అని చెబుతాడు పాండ్యన్. వీళ్లంతా డే టైమ్ లో వీలుకాక నైట్ టైమ్ చదువుకుంటున్నారు, ఆర్థికంగా వెనుకబడినవాళ్లు , మీ పార్టీలకోసం వేలకు వేలు ఖర్చుచేస్తారు, స్టూడెంట్స్ ని లెక్చరర్లని ఆటపట్టించేందుకు కూడా ఖర్చు చేస్తారు కానీ వీళ్లు ప్రతిరోజూ పరిస్థితులతో యుద్ధం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారని వాళ్లలో ఒక్కొక్కరి గురించి చెబుతూ కేజీ బ్యాచ్ కి క్లాస్ వేస్తాడు రిషి. మీరు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు కాబట్టి మీకు కష్టం తెలియదు. మీరు కష్టపడాలి అని చెప్పడం లేదు తెలుసుకోండి చాలు. ఒకర్ని ఏడిపిస్తే ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు కానీ ఆకలిగా ఉన్నవారికి ఓ ముద్ద అన్నం పెట్టండి మీకు అసలైన సంతోషాన్ని ఇస్తుందని చెబుతాడు. మీరు ఇప్పటికైనా మారాలి లేదంటే నేను తీసుకునే చర్యలు తీసుకుంటానని చెప్పేసి వెళ్లిపోతాడు.


Also Read: జూన్ 23 రాశిఫలాలు, ఈ రాశివారు బిజీ లైఫ్ లోంచి కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి!


మిషన్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీ గురించి కాలేజీలో డిస్కషన్ జరుగుతుంది. శైలేంద్ర అడ్డుపుల్ల వేయాలని ప్రయత్నించినా కాలేజీలో ఎవ్వరూ శైలేంద్ర మాటల్ని అంగీకరించరు. అయినా డబ్బుకోసం మిషన్ ఎడ్యుకేషన్ చేపట్టలేదు పేద విద్యార్థుల కోసం చేశాం..అందుకే డీబీఎస్టీ కాలేజీకి మంచి పేరొచ్చింది, దాన్ని నడిపించినందుకు రిషికి మంచి పేరొచ్చింది, దానికి కారణం రిషి అని జగతి అవునని ఫణీంద్ర పొగుడుతారు. కానీ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనదగ్గర స్టాఫ్ లేరుకదా కొత్తగా అపాయింట్ చేసి నేర్పించినా వాళ్లు హ్యాండిల్ చేస్తారో లేదో తెలియదు కదా అందుకే క్విట్ అవడం మంచిదంటాడు శైలేంద్ర. 
ఎపిసోడ్ ముగిసింది...