Guppedanta Manasu Telugu Serial Today Episode: మహేంద్ర గన్‌ పట్టుకుని కోపంగా ఇంటి లోపలికి వస్తాడు. ఆయన వెనకాలే అనుపమ, వసుధార వస్తారు. మహేంద్ర గన్‌ విసిరిపడేసి కోపంగా చూస్తుంటాడు. అనుపమ కూడా మహేంద్రను కోపంగా చూస్తూ..


అనుపమ: ఎందుకు మహేంద్ర అంత ఆవేశం.


మహేంద్ర: అసలు నువ్వెందుకొచ్చావు అక్కడికి. ఎవరు రమ్మన్నారు నిన్ను అక్కడికి. బుల్లెట్‌ సరిగ్గా వాడి గుండెల్లోకి దిగుతుందనగా మధ్యలో వచ్చి చెడగొట్టావు. ఆ పాపిస్టోడికి ప్రాణం పోయడానికి వచ్చావా? వాడికి ఆయుష్షు పోయడానికి వచ్చావా ఏంటి? పానకంలో పుడకలాగా?


అనుపమ: నువ్వు కోపంతో వణికిపోతున్నావనే పానకంలో పుడకలాగా రావాల్సి వచ్చింది. నీ ప్రస్టేషన్‌ పీక్స్‌కి, పిచ్చి పరాకాష్టకు చేరుకుని ఏం చేస్తున్నావో అర్థం కానీ స్థితిలో ఉన్నావు కాబట్టి మధ్యలో రావాల్సి వచ్చింది.


మహేంద్ర: ఏయ్‌ నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు.


అనుపమ: ఎందుకు మహేంద్ర అరుస్తున్నావ్‌ ముందు కొంచెం వాటర్‌ తాగు కూల్‌ అవుతావు.


మహేంద్ర: నాకొద్దు వాటర్‌ వద్దు


అంటూ బాటిల్‌ను తోసేస్తాడు మహేంద్ర


మహేంద్ర: మంచినీళ్లు కాదు నువ్వు చేసిన దానికి ఫుల్‌ బాటిల్‌ మందు తాగినా నేను కూల్‌ అవ్వను.


వసుధార: ఎందుకు మామయ్య మేడం మీద కోప్పడుతున్నారు.


అనగానే మరింత ఆవేశంగా మీరు రాకపోయి ఉంటే వాణ్ని చంపేసేవాణ్ని అంటాడు. మనం ఆవేశపడితే రిషి సార్‌ ప్రమాదంలో పడతాడు అంటూ వసుధార అంటుంది. శైలేంద్ర తెలివిగా ప్లాన్‌ చేస్తున్నప్పుడు మనం కూడా ఆవేశపడకుండా వాడిని తెలివిగా దెబ్బతీయాలని అనుపమ చెప్తుంది. మహేంద్ర ఆవేశపడకుండా కాస్త శాంతంగా ఆలోచించు అని చెప్తుంది అనుపమ. దీంతో కూల్‌ అయిన మహేంద్ర ఒకసారి ముకుల్‌కు ఫోన్‌ చేయమని వసుధారకు చెప్తాడు. ఫోన్‌ చేయడానికి పక్కకు వెళ్లిన వసుధార ఇంటి ముందు రిషి కారు వచ్చి ఆగడం చూసి సంతోషంగా మహేంద్ర, అనుపమలకు రిషి సార్‌ కారు వచ్చింది. రిషి సార్‌ వచ్చారు అని చెప్పి బయటకు పరుగెడుతుంది. అందరూ బయటకు రాగానే  కారులోంచి రిషికి బదులు ముకుల్‌ దిగుతాడు. దీంతో వసుధార, మహేంద్ర, అనుపమ షాక్‌ అవుతారు.


ముకుల్‌: ఆరోజు చెప్పాను కదా సార్‌ అవుట్‌ స్కట్‌ లో దొరికిందని. అప్పుడే  హ్యాండోవర్ చేసుకుని స్టేషన్‌కు పంపించాం. ఇప్పుడు ఫార్మాలిటీస్‌ అన్ని ఫినిష్‌ చేసి తీసుకొచ్చాను. ఆ రోజు కారైతే దొరికింది కానీ రిషి సార్‌కు సంబంధించి క్లూస్‌ ఏమీ దొరకలేదు. మా కానిస్టేబుల్స్‌ కూడా మొత్తం వెతికారు.


దీనిపై అందరూ ఇంటి లోపలికి వెళ్లి కేసు గురించి మాట్లాడుకుంటారు. మనకు వాయిస్‌ రికార్డు దొరికిందని తెలియగానే దాన్ని డైవర్ట్‌ చేయడానికి  శైలేంద్ర కిరాయి మనుషులతో తనను పొడిపించుకున్నాడని మహేంద్ర చెప్పడంతో ముకుల్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇప్పటి నుంచి  చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైతే రాంగ్‌ స్టెప్‌ వేస్తామో అప్పుడే రిషికి ప్రమాదం అని ఇకపై తాను చేయబోయే  ఎంక్వైరీ గురించి మహేంద్ర వాళ్లతో చర్చించి వెళ్లిపోతాడు ముకుల్‌. వసుధార బాధగా రిషి కారు దగ్గరకు వచ్చి చూస్తుండిపోతుంది. ఇంతలో రిషి తనను పిలిచినట్లు కారులో కూర్చోమన్నట్లు ఫీల్‌ అవుతుంది. కారులో కూర్చున్న వసుధార రిషి లేడన్న నిజం గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంది.


ఆఫీసులో కూర్చున్న వసుధార రిషి గురించే ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు మహేంద్ర, ఫణీంద్ర వస్తారు.


మహేంద్ర: బోర్డు మెంబర్స్‌ అందరూ మీటింగ్‌ ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అమ్మ.


వసుధార: ఉన్నట్టుంది అంత సడెన్‌గా మీటింగ్‌ ఎందుకు ఏర్పాటు చేయమంటున్నారు మామయ్య.


మహేంద్ర: తెలియదమ్మా.. కాలేజీ యాజమాన్యం మీద, కాలేజీ విధానాల మీద వాళ్ల అభిప్రాయాలు ఉంటాయి కదమ్మా అవి చెప్పడానికే మీటింగ్‌ ఏర్పాటు చేయమన్నారేమో?


దీంతో వసుధార సరే మామయ్య మీటింగ్‌ ఏర్పాటు చేద్దాం అంటుంది. అయితే రిషి లేకుండా ఎలా మీటింగ్‌ ఏర్పాటు చేయగలం అంటూ ప్రశ్నిస్తాడు. నువ్వే ఏదో ఒక పరిష్కారం చూడమ్మా అంటాడు మహేంద్ర. అయితే నేను ఒక అబద్దం చెప్తాను. రిషి సార్‌ మిషన్‌ ఎడ్యుకేషన్‌ టూర్‌ మీద ఫారిన్‌ వెళ్లాడని ఒక నోటీసు పెట్టిద్దాం అని చెప్తుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే అని మహేంద్ర అడుగుతాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు వేరే మార్గం లేదని ఫణీంద్ర చెప్తాడు. నువ్వనుకున్నట్లే చేయమని మహేంద్ర, ఫణీంద్ర చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వసుధార అటెండర్‌ను పిలిచి నోటీసు బోర్డులో రిషి ఫారిన్‌ టూర్‌ వెళ్లారని నోటీస్‌ పెట్టిస్తుంది దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్