డైనింగ్ టేబుల్ దగ్గర శైలేంద్ర ధరణి మీద లేని ప్రేమని తెగ ఒలకబోస్తాడు. దేవయాని ధరణి చేసిన కూర బాగోలేదని ఉప్పు తక్కువైందని అంటే శైలేంద్ర మాత్రం కూర చాలా బాగుందని అంటాడు. నాకోసమే చేశావా? నీతో నేను ప్రేమగానే ఉంటున్నా కదా అంటూ మాటలతో మాయ చేస్తాడు. తండ్రి ముందు బుద్ధి మంతుడు మాదిరిగా నటిస్తాడు.


శైలేంద్ర: అడ్మినిస్ట్రెషన్ వర్క్ నేర్చుకుని ఆ తర్వాత మరొక వర్క్ నేర్చుకుంటాను


ఫణీంద్ర: అలాగే నాకు కావలసింది నువ్వు వర్క్ నేర్చుకోవడం


శైలేంద్ర: అలాగే డాడ్ పని నేర్చుకుంటూ నాకు కావలసింది చేసుకుంటాను


ఫణీంద్ర: జగతి మీరు మరోసారి మన కాలేజ్ వర్క్ సిస్టమ్ శైలేంద్రకి ఎక్స్ ప్లేన్ చేయండి. అన్ని డిపార్ట్ మెంట్స్ గురించి డీటైల్ గా చెప్పండి. చిన్న విషయం దగ్గర నుంచి నేర్పించాలి


Also Read: రౌడీల నుంచి కళావతిని కాపాడిన రాజ్- రుద్రాణి అవమానానికి కావ్య సమాధానం ఏంటి?


నాకు తెలుసు బాబాయ్ మీరు మా డాడ్ చెప్తే మాట వింటారని అందుకే ఇలా చేశానని శైలేంద్ర అనుకుంటాడు. కొడుకు నటన నిజమని నమ్మేసిన ఫణీంద్ర తనని మెచ్చుకుంటాడు. ఎవరి మీద గౌరవంతో మీరు నన్ను ఆపుతున్నారో ఆ గౌరవంతోనే నేను అనుకున్నది సాధించుకుంటానని అనుకుంటాడు. వసు ఏంజెల్ తో కలిసి కారులో వెళ్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.


వసు: ఏదో మాట్లాడాలని అన్నావ్


ఏంజెల్: రిషి ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు రాసిన లవ్ లెటర్ తనకి కనిపించేలా తన రూమ్ లోనే పెట్టాను కానీ చదివాడో లేదో అర్థం కావడం లేదు. తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు


వసు: ఒకవేళ చదవలేదు ఏమో


ఏంజెల్: లేదు ఖచ్చితంగా చదివి ఉంటాడు. తనకి కనిపించేలా పెట్టాను. నాకు తెలిసి రిషి ఇంతకుముందు ఎవరినో లవ్ చేసి ఉంటాడు అనగానే వసు కంగారుపడుతుంది. నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు. నీకు రిషికి మధ్య ఏమైనా ఉందా?


వసు: మా ఇద్దరి మధ్య ఏం ఉంటుంది


ఏంజెల్: నిజం చెప్పు రిషి నిన్ను ప్రేమించడం కానీ నువ్వు రిషిని ప్రేమించడం ఏమైనా జరిగిందా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా?


వసు: ఉంది.. ఒక లెక్చరర్ కి మరొక లెక్చరర్ కి ఉన్న సత్సంబంధం


ఏంజెల్: అయితే రిషి ఇంకెవరినో ప్రేమించి ఉంటాడు. తన గతం ఎలా తెలుసుకోవాలి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు


వసు: నాకు ఎలా తెలుస్తుంది


ఏంజెల్: నీకే తెలుస్తుంది నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావ్. రిషిని ఒక స్టూడెంట్ లాగా అనుకుని స్టడీ చెయ్యి. తన మనసు తెలుసుకోవడం ఎలా?


కాలేజ్ లో శైలేంద్రని చూసి ఏదో ప్లాన్ చేశాడు అందుకే మేనేజర్ తో వినయంగా మాట్లాడుతున్నాడని జగతి భయపడుతుంది. మనం వెంటనే విషయం తెలుసుకోకపోతే మేనేజర్ ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడని మహేంద్ర అంటాడు. వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారని నిలదీస్తారు.


శైలేంద్ర: మేనేజర్ ని ఏం అడుగుతున్నావ్


మహేంద్ర: కాలేజ్ కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోకూడదు. కొన్ని మాత్రమే తెలుసుకోవాలి. బోర్డ్ మెంబర్ కి సంబంధించిన విషయాలు తెలిస్తే తట్టుకోలేవు. కొన్ని కొన్ని విషయాల గురించి నీకు తెలియకపోవడమే మంచిది


Also Read: దివ్య గ్రేట్ అని మెచ్చుకున్న విక్రమ్- కక్కలేక మింగలేక తిప్పలు పడుతున్న రాజ్యలక్ష్మి


జగతి: అసలే రోజులు బాగోలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీకు కాలేజ్ చూడటం తప్ప భారం తెలియదు. అందుకే మొత్తం తెలుసుకోవాలని ట్రై చేయకు


శైలేంద్ర: చేస్తే ఏమవుతుంది


మహేంద్ర: మంచి చేస్తే పేరు ప్రఖ్యాతలు వస్తాయి రిషిలాగా. అయినా నీకు ఎందుకు ఇవన్నీ సైలెంట్ గా ఉండవచ్చు కదా


శైలేంద్ర: బాబాయ్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా?


ఫణీంద్ర: మహేంద్ర ఏమైంది ఎందుకు సైలెంట్ గా ఉండమని అంటున్నారు


శైలేంద్ర: మేనేజర్ ని అడిగి డీటైల్స్ తెలుసుకుంటుంటే ఎందుకని అడుగుతున్నారు. పిన్నీ బాబాయ్ చెప్పకుండా ఉంటే నాకు వర్క్ ఎలా వస్తుంది డాడ్


ఫణీంద్ర: నేను చెప్పాను కదా మహేంద్ర కొన్ని కొన్ని విషయాలు మేనేజర్ ద్వారా తెలుసుకుంటాడు. గతంలో ఏదో తెలియకుండా మాట్లాడాడు. ఇప్పుడు తన వల్ల ఏ తప్పు జరగదని నేను హామీ ఇస్తున్నా. తను నేర్చుకోవాలని అనుకున్నది నేర్చుకొనివ్వండి


ఇక తనకి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. మీ బలం, బలహీనత మా డాడీ. నెమ్మదిగా ఒక్కొక్క పొర తప్పిస్తూ డాడీని దారిలోకి తెచ్చుకుంటాను. అప్పుడు డీబీఎస్టీ సామ్రాజ్యం నా గుప్పిట్లో ఉంటుందని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. ఇంట్లో దేవయాని పెట్టాల్సిన పెంట పెడుతుంది. ఇంట్లో ఇంతమంది ఉండి కూడా మేనేజర్ దగ్గర శైలేంద్ర నేర్చుకోవడం ఏంటని భర్తని నిలదీస్తుంది. డాడ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని పిన్నీ, బాబాయ్ వర్క్ లో బిజీగా ఉంటున్నారు అందుకే మేనేజర్ ని అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదని అంటాడు.


శైలేంద్ర: మేనేజర్ తో క్లోజ్ గా మాట్లాడి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నా. కానీ పిన్నీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మీరే చూశారు కదా


ఫణీంద్ర: జగతి మేనేజర్ తో మాట్లాడటానికి మీరు ఒప్పుకోండి. శైలేంద్ర చూడండి ఎలా బాధపడుతున్నాడో తనని వర్క్ నేర్చుకొనివ్వండి


శైలేంద్ర కాలాంతకుడిలాగా ఉన్నాడు. బావని అడ్డం పెట్టుకుని కాలేజ్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. వసు రిషి గురించి ఆలోచిస్తుంది. మనం మళ్ళీ రిషిధారలుగా మారాలి. మీరు నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకోవాలి. అందుకే ఏంజెల్ తో మీతో క్యాండిల్ లైట్ డిన్నర్ ఆరెంజ్ చేసేలా చేశానని అనుకుంటుంది. ఇంట్లో రిషి కోసం ఏంజెల్ అందంగా రెడీ అయి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి వచ్చి తనని చూస్తాడు.