సాక్షి విషయంలో నేను పొరపాటు చేశాను క్షమించు రిషి అని దేవయాని ఏడుస్తుంది. పెద్దమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. నాదొక చిన్న కోరిక మిగిలిపోయింది తీరుస్తావా అని అంటుంది.. చెప్పండి పెద్దమ్మా తీరుస్తాను అంటాడు. పక్కన టేబుల్ మీద ఉన్న గ్లాస్ ఇవ్వమని అడుగుతుంది. అది రిషి అందిస్తే తీసుకుని విషం తాగాలని నా కోరిక నాన్న అని దాని తాగబోతుంటే పెద్దమ్మా అని అరిచి గ్లాస్ పడేస్తాడు. విషం ఏంటి మీరు విషం తాగాడమెంటి.. అంత కష్టం ఏం వచ్చింది నేను ఉన్నాను కదా అని రిషి బాధపడతాడు. మీకొచ్చిన కష్టం ఏంటి అసలు ఏం జరిగింది.. ఎందుకు ఇదంతా అని అడుగుతాడు. సాక్షి అని చెప్తుంది.


దేవయాని: తప్పు చేశాను రిషి. తన ప్రేమని చూసి నీకు సరైన జోడీ అనుకున్నాను. సాక్షికి నీతో పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను అలాంటిది ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. సాక్షి మారిపోయింది రిషి. నీతో పెళ్లి జరిపించకపోతే నన్ను జైలుకి పంపిస్తానని, కుటుంబం పరువు తీస్తానని ఎన్నెన్ని మాటలు అన్నదో(సాక్షి ఇంట్లో మాటలు మాట్లాడినవన్ని చూపిస్తారు) ఇందులో తన తప్పే కాదు నాది కూడా ఉంది కదా. తనే కరెక్ట్ అని నమ్మాను. ఇప్పుడు నిన్ను పెంచిన ప్రేమతో నీ పెళ్లి ఫలానా వాళ్ళతో అనే అధికారం నాకు లేదు కదా. సాక్షిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పలేను కదా. ఇచ్చిన మాట తప్పడం కన్నా ఇంత విషం తాగి చావడం మంచిది కదా. ఆ విషం ఏదో నీ చేతుల మీదగా తాగితే అదే తులసి తీర్థంగా తాగుతాను


రిషి: పెద్దమ్మా అలా మాట్లాడకండి


దేవయాని: ఇంతక మించి వేరే దారి లేదు రిషి. అసలు ఆ సాక్షి ఎవరు. తనకేదో మాట ఇచ్చాను.. నీ ఇష్టమే నా ఇష్టం.. నీ ఆనందమే నా ఆనందం. జగతిని ఇంటికి తీసుకొచ్చావ్ నేను ఏమైనా అడ్డుపడ్డాన, వసుధారకి ఎక్కువ ప్రాధాన్యత వద్దు అన్నా తను చాలా తెలివైనది కాలేజీకి మంచి పేరు తీసుకొస్తుంది అన్నావ్ నేనేమైనా అడ్డు చెప్పానా.. లేదు కదా . సాక్షి విషయంలో నేను మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నాను ఎందుకంటే తనకి నువ్వంటే పిచ్చి ప్రేమ. సాక్షి చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు. ఇన్ని చేసిన సాక్షి చివరికి నన్ను బెదిరించింది. నేనే మాట తప్పాను. తనని పెళ్లి చేసుకోమని నేను చెప్పలేను, చెప్పినా చేసుకోవద్దు.. మాటదేముంది పోతుంది. తను కేసు పెడితే నేను జైలుకు వెళతానేమో కానివ్వు. అవన్నీ జరగకూడదనే నేను ఈ ఏర్పాట్లు చేసుకున్నాను. రిషి రెండే రెండు మార్గాలు ఉన్నాయ్ ఒకటి సాక్షిని పెళ్లి చేసుకోమని అడగటం అలా ఆడగలేను అలా అడగటం ధర్మం కాదు. రెండోది సాక్షిముందు తల వంచడం అలా ఎప్పటికీ జరగదు అందుకే నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గ్లాస్ పారేశావ్ కానీ ఏదో ఒక టైం లో నేను ఇదే చేస్తాను అని అంటుంది.


Also Read: రిషిని పరుగులు పెట్టించిన దేవయాని- తన కొడుకిని వదిలేయమని ప్రాధేయపడ్డ జగతి


ఆ మాటలకి ఏమి మాట్లాడలేక రిషి బాధగా వెళ్ళిపోతాడు. అది చూసి తన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలాగా ఉందని దేవయాని లోలోపల సంతోషిస్తుంది. వసు వెళ్లబోతుంటే దేవయాని తనని పిలుస్తుంది. రిషిని నువ్వే కాపాడుకో అని దేవయాని వసు చేతులు పట్టుకుని అడుగుతుంది. అది విని వసు బిత్తరపోతుంది. సాక్షి బారి నుంచి రిషిని నువ్వే కాపాడు.. నువ్వు తెలివైన దానివి తెగువ ధైర్యం ఉంది అని అంటుంది. మేడమ్ రిషి సార్ ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు ఏం చెయ్యాలో రిషి సర్ కి తెలుసు.. అయినా మీరు సాక్షికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని వసు అడుగుతుంది.  


ఏనుగు పెద్దది అయినా చిన్న ముల్లు భయపెడుతుంది.. ఇక్కడ ఆ ముల్లు సాక్షి. ఏంటి మొన్నటి దాకా సాక్షిని వెంట పెట్టుకుని తిరిగి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నవా. నా రిషిని ఆ సాక్షి ఇబ్బంది పెడుతుంది, నన్ను బెదిరిస్తుంది. తన నుంచి నువ్వే రిషిని కాపాడాలి. రిషి మంచితనం నీకు తెలుసు కదా రిషికి నువ్వే సాయం చెయ్యాలి అని దేవయాని అంటుంది. అలాగే మేడమ్ అని వసు అంటుంది. రిషి దేవయాని మాటలు గురించి ఆలోచిస్తూ ఉండగా వసు కాఫీ తీసుకుని వస్తుంది. వద్దని అంటాడు. ఒక్కొక్కసారి వద్దనుకున్నవి కావాలని అనిపిస్తుంది ఆలోచించండి సార్ అని అంటుంది. ఇది నా విషయంలో జరిగింది అని మనసులో అనుకుంటుంది. వసు రెస్టారెంట్ లో రిషి కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.     


Also Read: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి