గుండెనిండా గుడిగంటలు జూలై 11 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 11th Episode)

ప్రభావతిని మాయచేసి తండ్రిని కూడా తనతో పాటూ తీసుకెళ్లిపోతాను అని చెప్పి ఇంట్లోంచి వెళ్లకుండా ఉండిపోయాడు బాలు. ఈ హడావుడిలో పడి రోహిణి తండ్రి విషయం మర్చిపోయాం అని..ప్రభావతికి గుర్తుచేయాలి అనుకుంటాడు. మర్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూర్చుని ఉండగా అనుకోకుండా ప్రభావతి ఈ ప్రస్తావన తీసుకొస్తుంది. ఇంట్లో అందరూ కూడా ఇంతకీ మీ నాన్న ఏమయ్యారని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడంతో కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతుంది రోహిణి. ఆ టెన్షన్లో వాంతి వచ్చినట్టు అనిపించి పరిగెత్తుతుంది. రోహిణి గుడ్ న్యూస్ చెబుతుందని ఫిక్సైపోతుంది ప్రభావతి. అదే విషయాన్ని కామాక్షికి కాల్ చేసి చెప్పడం ...కామాక్షి ఏకంగా మామిడి పళ్ల బుట్ట తీసుకొచ్చేయడం కూడా జరిగిపోయింది. హాస్పిటల్ కి వెళ్లిన రోహిణి, మనోజ్ ఇద్దరూ ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తుంటారు ప్రభావతి, కామాక్షి. ఇంతలో ఇంటికి చేరుకున్న రోహిణి, మనోజ్... గుడ్ న్యూస్ కాదని నిజం చెప్పేస్తారు. ప్రభావతి నిరాశ చెందుతుంది. పెద్దకోడలు నెలతప్పింది అనుకుని అప్పటివరకూ నానా హడావుడిచేసి ఒ‍క్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఇదే అవకాశంగా బాలు మళ్లీ మనోజ్ పై సెటైర్స్ వేస్తుంటాడు. పనీపాటా లేకుండా పార్కులో పల్లీలు తినేవాడిని పిల్లల్ని ఎలా పోషిస్తానా అని టెన్షన్ పడ్డాడని..ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నాడని అంటాడు బాలు.

గుండెనిండా గుడిగంటలు జూలై 11 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

ఇంటికి తిరిగి వచ్చిన రోహిణి ప్రెగ్నెన్సీ కాదని చెప్పడంతో ప్రభావతి నిరాశపడుతుంది. నీకే మొదట బిడ్డ పుట్టాలని ముడుపుకూడా కట్టాను కదా అంటుంది. ఆ తర్వాత బాలు మీనా వెనుకే వెళ్లి..గ్లాసులో ఏదో ఇస్తాడు...ఎందుకు ఏంటి అని అడగకుండా తాగేయ్ అంటాడు. మీనా తాగేస్తుంది. ఏం జరిగిందని అడిగితే.. వికారంగా ఉంది, కళ్లు తిరుగుతున్నాయ్, వాంతి వస్తోంది అంటుంది మీనా. నాన్నోయ్ మా ఆవిడ తల్లికాబోతోంది నానమ్మకి కాల్ చేసి ముందు నాబిడ్డకే ఆస్తి రాయమని చెప్పు అంటాడు బాలు. పోనీలే నేను తీసుకొచ్చిన మామిడికాయలు వేస్ట్ కాలేదు అంటుంది కామాక్షి. ఇకపై మా ఆవిడ ఏపనీచేయదు..ఆస్తి మొత్తం వచ్చిన తర్వాత నీకు ముక్కుపుడక చేయిస్తానులే అంటాడు. స్పందించిన మీనా.. ఇదంతా మా ఆయన కావాలనే చేశాడు..అత్తయ్యని ఏడిపించేందుకు అని చెప్పేస్తుంది.  

పెద్దకోడలు తల్లైతే..మీ అత్తగారి ఆస్తిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావ్..నువ్వు మనోజ్ గాడు పనిపాటా లేకుండా దర్జాగా కూర్చుని తింటారని కలలు కన్నట్టున్నావ్..నీ కలా నిజం కాలేదు, ఆ కడుపు నిజం కాలేదు అని సెటైర్స్ వేస్తుంది. పెద్ద కోడలు తల్లైతే ఆస్తి మొత్తం నీ పెద్ద కొడుక్కే కదా వస్తుంది అప్పుడు ఆ పార్కులో పడుకునేవాడు తిని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేడు. అయినా మీనా ముందుగా ప్రెగ్నెంట్ అవుతుందేమో అనే భయంతో ఉన్నావ్ అని ఆడేసుకుంటుంది. బాలు-మీనా ఇంట్లో ఉండడం నాకు నచ్చడంలేదంటుంది ప్రభావతి. వాళ్ల వల్ల నాకు మనశ్సాంతి లేదంటుంది. రోహిమికే ముందు బిడ్డపుట్టాలి, మీనాకు పుట్టకూడదు అని కూడా కోరుకున్నాను...వాళ్లిద్దరూ నిన్నో మొన్నో పెళ్లైనట్టు హల్వాలు, మల్లెపూలు అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. మామూలు రచ్చ చేయట్లేదు..రూమ్ లేకుండా హాల్లో పడుకుని అరాచకం చేస్తున్నారు.. రూమ్ ఉంటే ఆ మీనా మోజులో పడిపోయి నా అత్తగారి ఆస్తి తన్నుకుపోతానే భయంగా ఉంది అంటుంది. ఓ కంటికి ఐ చెకప్ చేయించి మరో కంటిని వదిలేస్తావా..నిజానికి ఆస్తి వస్తే ఆబాలునే కూడబెడతాడు అంటుంది కామాక్షి. వాడు నన్ను తల్లిలా చూశాడా అంటే నువ్వు కొడుకులా చూశావా అంటుంది. రోహిణి ఫస్ట్ బిడ్డను కనాని...లేదంటే శ్రుతి కనాలి అంటుంది. ఇంకెక్కడి శ్రుతి..అట్నుంచి అటే శ్రుతిని తీసుకెళ్లింది రవిని ఇల్లరికం తీసుకెళ్లేందుకు అంటుంది. రవి కూడా తనతో మాట్లాడడం లేదని బాధపడుతుంది.

శ్రుతికి కాల్ చేసిన ప్రభావతి.. నువ్వు వచ్చేయమ్మా అంటుంది. మా నాన్నను కొట్టిన బాలు ఇంట్లో ఉండగా నేను రాలేను అంటుంది. నేను మావయ్యను కొడితే మీరు ఊరుకుంటారా అంటుంది. నన్ను కూడా చూడాలని లేదా అని ప్రభావతి అంటే..నేను వీడియో కాల్ చేస్తాను కానీ రాను అనేసి కాల్ కట్ చేస్తుంది. ఆ పిల్లకు అంత పొగరా తన మనస్తత్వమే అంతా అర్థంకావడం లేదని కామాక్షికి చెప్పి బాధపడుతుంది ప్రభావతి. వదినా జాగ్రత్త నీ నంబర్ బ్లాక్ చేస్తారేమో అని మరింత ఆడేసుకుంటుంది కామాక్షి. నువ్వే మంచిగా మాట్లాడి దార్లోకి తెచ్చుకోవాలి లేదంటే నీ కొడుకు నీకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది అంటుంది.నా కొడుకు నా మాట వింటాడు అని ప్రభావతి చెప్పినా.. ఇప్పుడు ఒక్కరోజే ఆ తర్వాత వారం, సంవత్సరం ఆ తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండిపోతాడు అంటుంది. నువ్వు ధైర్యం చెప్తావని పిలిస్తే భయపెడుతున్నావ్ అంటుంది ప్రభావతి. అందరితో కలసిపోయి అందర్నీ కలుపుకుపోతూఉండు..లేదంటే నీకే నష్టం అనేసి వెళ్లిపోతుంది కామాక్షి. 

బాలు ఉన్న ఇంటికి వెళ్లొద్దు..వాళ్లు ఎంత ఒప్పించాలని చూసినా నీ మనసు మార్చుకోవద్దు..అల్లుడుగారు మళ్లీ వస్తారు మీరు సంతోషంగా ఉంటారు అని సురేంద్ర, శోభ..శ్రుతికి నూరిపోస్తారు. అది నేను చూసుకుంటాలే అనేసి వెళ్లిపోతుంది శ్రుతి. తను అలా చెప్పేసి వెళ్లిపోయిందని అంటే మనం వద్దన్న పనే చేస్తుంది..అందుకే ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకు అంటాడు సురేంద్ర. 

మీనా దగ్గరకు వెళ్లిన రోహిణి వేడినీళ్లు అడుగుతుంది. ఇవాళ బాధగా ఉన్నట్టున్నావ్ అని అడుగుతుంది. ప్రగ్నెన్సీ రాకపోవడం అశుభం కాదుకదా అంటుంది. రోహిణి బాధపడకుండా సర్దిచెబుతుంది. నేను దానిగురించి ఆలోచించడమే లేదనేస్తుంది. అత్తయ్యకి ఏదీ గుర్తురాకపోతే అంతే చాలు అంటుంది. ఇంకేదీ అంటే అని మీనా అడిగితే మాట దాటేస్తుంది. నాకన్నా ముందు నీకే పెళ్లైంది నీకే ప్రెగ్నెన్సీ రాలేదు కదా అంటుంది. 

ఆ తర్వాత మనోజ్ ..రోహిణితో మాట్లాడుతూ మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ ఇంకా రాలేదా అని అడుగుతాడు. ఇంతలో సత్యం వచ్చి మీ అమ్మ ఏదని అడుగుతాడు..రూమ్ లో ఉన్నారు ఎవ్వరితోనూ మాట్లాడడం లేదంటుంది రోహిణి. ఇంతలో పార్సిల్ వస్తుంది..రవి పేరుతో.. ఆ మాట వినగానే పరిగెత్తుకుని బయటకు వస్తుంది ప్రభావతి. వీడెళ్లి శ్రుతివాళ్ల నాన్నకి సారీ చెబితే వస్తుందని మనోజ్ అంటాడు. నేనెందుకు చెప్పాలని బాలు అడిగితే.. నీ తండ్రిపై నీకు ప్రేమ ఉన్నట్టే శ్రుతికి కూడా ప్రేమ ఉంటుంది కదా అని ఫైర్ అవుతుంది ప్రభావతి. నేను కొట్టాను అంటున్నారు కానీ మీనాపై నిందవేశాడని మాట్లాడడం లేదు..మీనా ఎలాంటిదో మీకు తెలియదా అని అడుగుతాడు. ఇంట్లో అంతా కలసి ఉండాలని కోరుకోవాలి కానీ అందర్నీ వేరుచేస్తావ్, తోడికోడళ్లను వేరుచేస్తావ్ అని క్లాస్ వేస్తాడు. ఎవరికీ ఎవరిమీదా ప్రేమ లేకుండా మనసు విరగ్గొట్టేది నువ్వు అని ఇచ్చిపడేస్తాడు. 

మీ నాన్న ఏడి అంటూ మళ్లీ రోహిణిని టార్గెట్ చేసింది ప్రభావతి...మీ నాన్న వచ్చి తీరాల్సిందే అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి..