Ammayi garu Serial Today Episode విరూపాక్షిని ఇరికించాలని విజయాంబిక, దీపక్‌లు వినోద్‌ని ఆపుతారు. అతనితో మీ మేడంని మేం ఇరికించాలని అనుకుంటున్నాం నువ్వు మాకు సహకరించాలని అతన్ని కొనేసి తమ ప్లాన్ చెప్తారు. ఈ ప్లాన్‌తో విరూపాక్షి పని అయిపోతుందని రూప ఎందుకు మనతో పెట్టుకున్నామా అని తల పట్టుకుంటుందని అంటుంది. 

Continues below advertisement


ఆనంద్ రాఘవని వెతికి వెతికి డీలా పడిపోతాడు. రాజు, రూపలు ఆనంద్‌ని కలుస్తారు. మీ ఇద్దరికీ పెళ్లి అయిందని సంతోషంగా ఉన్నానని అంటాడు. రాఘవ గురించి ఏమైనా తెలిసిందా అని రూప అడుగుతుంది. విజయాంబిక గుంట నక్కలా వెయిట్ చేస్తుందని ఏ మాత్రం అవకాశం దొరికినా అమ్మని చెడు చేయాలని చూస్తుందని అంటుంది. రాఘవని వీలైనంత త్వరగా వెతికి తీసుకొస్తానని ఆనంద్ అంటాడు. రాఘవని తీసుకొచ్చి ఆ పాపిష్టిదాన్ని తన్ని తరిమేయాలని రూప అత్తని ఉద్దేశించి అంటుంది. ఇక ఇంట్లో సూర్యప్రతాప్‌ ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. 


విరూపాక్షి, మందారం బయట నుంచి వస్తారు. విరూపాక్షి మనసులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే సూర్యతో మాట్లాడాలి అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ మందారానికి కాఫీ అడుగుతారు. మందారం అక్కడ ఉండదు. విరూపాక్షి కాఫీ అడ్డు పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటుంది. సుమ చూసి అక్క బావగారి కోసం కాఫీ చేస్తుందా నిజంగా బావగారు అక్కకి కాఫీ అడుగుంటే అంత కంటే అదృష్టం ఏముందని అనుకుంటుంది. 


విరూపాక్షి సూర్యప్రతాప్‌కి కాఫీ ఇస్తుంది. సూర్యప్రతాప్‌ చూసుకోకుండా కాఫీ తీసుకుంటాడు. కాఫీ టేస్ట్ చూసి విరూపాక్షి అని గుర్తు పట్టి లేచి విరూపాక్షిని కోపంగా చూసి కాఫీ కప్పు విసిరి కొడతాడు. ఇంట్లో ఎవరూ లేరా అని అరుస్తాడు. అప్పటి వరకు విరూపాక్షి కాఫీ ఇవ్వడం చూసి సంతోషపడిన అందరూ ఒక్కసారిగా భయపడతాడు. ప్రాణం పోయిన నీ చేతి నీరు కూడా తాగను అలాంటిది కాఫీ తాగుతానని అనుకున్నావా అని అరుస్తాడు. సూర్యప్రతాప్‌ ఆవేశ పడటంతో రుక్మిణి వచ్చి ఆవేశపడొద్దని అంటుంది. ఇదే అవకాశంగా విజయాంబిక, దీపక్‌లు సూర్యప్రతాప్‌కి ఆరోగ్యం బాలేదని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని అడుగుతారు. 


సూర్యప్రతాప్‌ కోపంగా నీ కోసం తనని ఈ ఇంట్లో ఉండనిచ్చా అంతే కానీ ఆమె మీద ప్రేమతో కాదు అని అంటుంది. విజయాంబిక విరూపాక్షితో రుక్మిణికి పెళ్లి చేశావ్ కదా ఇంకా ఈ ఇంట్లో ఎందుకు అని అంటుంది. దానికి రుక్మిణి నువ్వు కూడా ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉన్నావు కదా అసలు నీకు ఏ అర్హత ఉంది వెళ్లిపో అని అంటుంది. వాళ్లతో వద్దు అయ్యగారికి తీసుకెళ్లు అని రాజు అంటే గొడవ ఆగిపోతుందేమో అని విజయాంబిక నా తమ్ముడిని వలలో వేసుకోవడానికే కాఫీ ఇచ్చావ్ కదా నీకు వలలో వేసుకోవడం అలవాటే కదా అని సూర్యప్రతాప్‌కి రాఘవని గుర్తు చేస్తుంది. 


రుక్మిణి ఆవేశంతో విజయాంబికను కొడుతుంది. దీపక్ రుక్మిణిని కొట్టబోతే రాజు వచ్చి చేయి పట్టి నా భార్య మీద చేయి వేస్తే ప్రాణం తీస్తా అని అంటాడు. నీ ముఖం చూడటం అన్నా నీ గొంతు వినడం అన్నా నాకు అసహ్యంగా ఉంటుందని సూర్యప్రతాప్‌ అంటాడు. విరూపాక్షి సూర్యతో నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నా ఎన్ని తిడుతున్నా భరిస్తున్నా దానికి ఒక్కటే కారణం నిందించిన వాళ్లు నీ ఎదురుగా ఉన్నా నిందకు కారణం అయిన వాళ్లు నా ఎదురుగా లేరు. వాడు దొరికిన రోజు నిజం నీకే అర్థమవుతుందని అంటుంది. 


రాత్రి విరూపాక్షి పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో వినోద్ వచ్చి డాక్యుమెంట్లు ఇచ్చి సంతకం పెట్టిస్తాడు. తల్లీకొడుకులు తమ ప్లాన్ ప్రకారం మొత్తం జరుగుతుందా లేదా అని చూస్తుంటారు. మందారం వచ్చి డాక్యుమెంట్స్ చదమని అంటుంది. విరూపాక్షి చూస్తుంటే వినోద్ అడ్డుకుంటాడు. విరూపాక్షి సంతకాలు పెట్టేస్తుంది. పేదలకు ఇళ్లు పంపుతానని విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!