Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి తండ్రి, పిన్నిలను మీనన్ కిడ్నాప్ చేస్తాడు. రేఖ భయపడుతుంటే తన భర్త ఆమెతో జగద్ధాత్రిని ఉద్దేశించి ఏం కంగారు పడొద్దు మనల్ని కాపాడటానికి ఓ శక్తి వస్తుందని అంటాడు. ఇక మీనన్ దేవాతో వీళ్లని కాపాడటానికి అయినా యామిని చేస్తుందని యామిని పని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ వీళ్లని చంపేయమని మీనన్ చెప్తాడు.

మీనన్ యామినికి కాల్ చేస్తాడు. జగద్ధాత్రి, కేథార్ యామిని పక్కనే ఉంటారు. యామిని మీనన్‌తో మాట్లాడుతుంది. మీనన్ చెప్పిన పని చేస్తా రేపు ఉదయం వరకు టైం అడుగుతుంది. మీనన్ సరే అంటాడు. జేడీ, కేడీలు యామినిని సేఫ్ హౌస్‌కి తీసుకెళ్లమని రమ్యకి చెప్తుంది. ఇక ఇంట్లో బాబు ఏడుస్తుంటే కౌషికి పాలు ఇవ్వడానికి గదిలోకి తీసుకెళ్తుంటే ఆదిలక్ష్మీ ఆపి ఎవడో బిడ్డకి నువ్వు పాలు ఇవ్వడం ఏంటి జగద్ధాత్రికి ఇవ్వు డబ్బా పాలు పడుతుందని అంటుంది. వాడు నా బిడ్డ వాడికి డబ్బా పాలు పట్టాల్సిన అవసరం ఏంటి అని కౌషికి అడుగుతుంది. దాంతో ఆదిలక్ష్మీ వాడు నీ బిడ్డ కాదని రిపోర్ట్స్ చెప్పాయి అంత వరకు వాడికి ఈ ఇంటికి ఏం సంబంధం లేదని అంటుంది. 

వైజయంతి, నిషికలు కూడా ఆదిలక్ష్మీకి సపోర్ట్ చేయడంతో కౌషికి తనని తన  బిడ్డని వదిలేయమని అంటుంది. నాకు నా మాటకు ఈ ఇంట్లో విలులేదన్నమాట అయితే ఇప్పుడే నేను నా కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతామని ఆదిలక్ష్మీ అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు ఆదిలక్ష్మీకి నచ్చ చెప్పాలని చూస్తారు. ఆదిలక్ష్మీ మాత్రం నా కోడలు నా మాట వినడం లేదు నేను ఇప్పుడే వెళ్లిపోతా అని బ్యాగ్ తీసుకొని రావడానికి వెళ్తుంది. కౌషికి సురేశ్‌కి సారీ చెప్తుంది. మీ అమ్మ కోసం తప్పుగా అనలేదు అంటుంది. సురేశ్ కౌషికికి సంజాయిషీ చెప్పొద్దని నీ కష్టాల్లో నేను తోడు ఉండలేకపోయా వాడికి తండ్రి కంటే తల్లే అవసరం అని అంటాడు. ఆదిలక్ష్మీ కొడుకుని తీసుకెళ్లిపోతుంది. 

కేథార్ జగద్ధాత్రితో ఈసారి బావ వెళ్లిపోతే మరి తిరిగి రాడు అని అనిపిస్తుందని అంటుంది. ఓ ప్లాన్ కేథార్‌తో చెప్తుంది. కేథార్ బయటకు వెళ్లి ఆదిలక్ష్మీని బతిమాలుతాడు. ఇంతలో జగద్ధాత్రి బిందె తీసుకొని వచ్చి ఆదిలక్ష్మీ తల మీద పెట్టేస్తుంది. తల ఇరుక్కుపోయిందని ఆదిలక్ష్మీని జగద్ధాత్రి, కేథార్‌లు తీసుకొస్తారు. బూచి కావాలనే సెటైర్లు వేస్తాడు. బూచిని కొట్టబోయి బిందెతో ఒక్కటిస్తే వైజయంతికి తగులుతుంది. ఆదిలక్ష్మీ ఎవరో తన తల మీద బిందె పెట్టేశారు అని అంటే అందరూ జగద్ధాత్రిని చూస్తారు. జగద్ధాత్రి నేనేం చేయలేదని అంటుంది. కేథార్ బిందె పై నుంచి వచ్చి పడిందని అంటాడు. ఇక బిందె తీయడానికి బూచి చాలా ప్రయత్నిస్తాడు. 

బిందె తీయడానికి వచ్చే వ్యక్తి వారం వరకు రాడని వాడు వచ్చే వరకు అలాగే ఉండమని లేదంటే వేరే వాళ్లకి చెప్తే ఇష్టం వచ్చినట్లు కోసేస్తే ప్రాణాలు పోతాయని జగద్ధాత్రి భయపెట్టేస్తుంది. దాంతో ఆదిలక్ష్మీ వారం వరకు అలాగే ఉంటానని అంటుంది. ఇక పిన్ని గారు మీ కోసం ఫుడ్ తీసుకొస్తానని జగద్ధాత్రి కిచెన్‌కి వెళ్తుంది. కౌషికి వెళ్లి నువ్వు ముందు ఉండి ఎలా బిందె వేశావని అంటుంది. జగద్ధాత్రి తనకేం తెలీదు అంటే అదే నాకు అర్థం కావడం లేదని అంటుంది. నువ్వు ఎవరికీ దొరకవు జగద్ధాత్రి అని కౌషికి అంటుంది. ఇక జగద్ధాత్రి ఆదిలక్ష్మీ కోసం స్ట్రా, పెద్ద స్పూన్తో అన్నం ముద్దులు పెడుతుంది.ఇక ఆదిలక్ష్మీ సోఫాలో కూర్చొంటుంది. 

నిషిక, వైజయంతి వచ్చి కావాలనే ఆదిలక్ష్మీని రెచ్చగొడతారు. దాంతో ఆదిలక్ష్మీ కౌషికి కొడుకుని  ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తానని అంటుంది. జగద్ధాత్రి, కేథార్ ఆ మాటలు విని వాళ్లు అనుకున్నది జరగకుండా చేయకుండా చేయాలని అనుకుంటారు. ఇంతలో ఓ దంపతులు వచ్చి బాబు బాబు ఆ బాబు మా బాబు అంటాడు. జగద్ధాత్రి వాళ్లని అడ్డుకుంటుంది. కౌషికి బాబుని తీసుకురావడం చూసి మా బాబు అని అంటారు. కౌషికితో పాటు అందరూ షాక్ అయిపోతారు. కిడ్నాప్ అయిన బాబుల్లో మా బాబు కూడా ఉన్నాడని కిడ్నాప్ చేసిన ఆవిడను అడిగితే మీకు ఇచ్చామని అంటారు. 

ఆదిలక్ష్మీ ఆ బాబుని ఇచ్చేయమని అంటుంది. కౌషికి, సురేశ్‌లు వాళ్లు మా బాబు అని అంటారు. వాడు మా బాబే అని పోలీస్ కంప్లైంట్ కూడా చూపిస్తారు. కౌషికి దగ్గర నుంచి సుజాత బాబుని తీసుకుంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు పోలీసుల్ని పిలుస్తామని అంటే మేం కూడా కేసు పెడతాం అని సుజాత వాళ్లు అంటారు. అదంతా తన ప్లానే అని ఆదిలక్ష్మీ వైజయంతితో అంటుంది. జగద్ధాత్రి కేథార్‌తో వాళ్లని చూస్తే అనుమానంగా ఉందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!