గుండె నిండా గుడి గంటలు నవంబర్ 13 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 13th Episode
సత్యం తల్లి సుశీలమ్మ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్. ఇల్లంతా సందడిగా ఉంది. మీనా తల్లిపార్వతి, చెల్లెలు సుమతి వచ్చారు. రావడంతోనే ప్రభావతి చెలరేగి అవమానించడం..సుమతి గట్టిగా రిప్లై ఇవ్వడంతో సైలెంట్ అయింది వాతావరణం. ఆ తర్వాత సుమతికి త్వరగా పెళ్లవాలని సుశీలమ్మ దీవిస్తుంది. చదువు అవగానే పెళ్లి చేసేయండి అని పార్వతితో అంటాడు రవి. నువ్వు తర్వగా పెళ్లి చేసుకున్నావని నేను చేసుకోవాలా.. ఉద్యోగం చేసుకుంటా అని రిప్లై ఇవ్వగానే..శ్రుతి సూపర్ అని పొగిడేస్తుంది.
వీళ్లంతా సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రభావతి చూసి కుళ్లుకుంటుంది. మీ పెద్దమ్మాయిలా చిన్నమ్మాయి పెళ్లి కావాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అవ్వాల్సిందే అంటుంది ప్రభావతి. అంతా కలసి దుమ్మెత్తిపోస్తారు... అన్నం తింటున్నావా? గడ్డితింటున్నావా?నిన్నెలా పెంచారు? సంస్కారం లేదా? నోటికి హద్దు పద్దు లేదా? అని ఇంట్లో తలోమాట అంటారు. పుట్టినరోజు వేడుక జరుగుతుంటే.. చావుగురించి మాట్లాడుతున్నావ్ అని అంటారు. నేను తప్పుగా మాట్లాడానా అని కామాక్షిని అడిగితే నువ్వు అన్నది తప్పుకాదా అంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి. సుమతి నువ్వు పట్టించుకోకమ్మా దానితీరే అంత అంటుంది సుశీలమ్మ. అందరకీ చల్లగా రోజ్ మిల్క్ ఏదో చేసి ఇవ్వమ్మా అని సత్యం చెబుతాడు. నాక్కూడా అని ప్రభావతి అడిగితే... మీకు ఇవ్వకుండా ఉంటానా అత్తయ్యా అని ఇస్తుంది.
దాని మాటలు పట్టించుకోవద్దు..నాకు తెలిసినవాళ్లకి కూడా చెబుతాను అంటాడు సత్యం. సుమతి చెప్పిందే కరెక్ట్.. నాలా నిత్యం మాటలుపడేకన్నా.. ఉద్యోగం చేయాలి అంటుంది. అందరూ మీ అత్తలానే ఉండరులే అంటాడు సత్యం..అవును మా అత్తగారు దేవత అంటుంది మౌనిక. అవును నేను దయ్యాన్ని అంటుంది ప్రభావతి..అంత నోరేసుకుని అరిస్తే దయ్యం అనే అంటారు..
అదే సమయానికి శ్రుతి తల్లి వస్తుంది. ఇంట్లో ఇంత సంతోషం ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటా..ఏదో ఒకటి చేసి వీరి ఆనందాన్ని దూరం చేయాలని మనసులో అనుకుంటుంది. హ్యాపీ బర్త్ డే చెబుతుంది. మాలాంటి వాళ్ల ఇళ్లలోనే పెద్దవాళ్ల వేడుకు చేస్తాం అనుకున్నా.. మీరు కూడా బాగానే చేస్తున్నారుగా అంటుంది. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా అని శ్రుతి తల్లిని అడుగుతుంది కామాక్షి. అదేం ప్రశ్న అని అడిగితే..ఇదేం ప్రశ్న అంటుంది కామాక్షి. మీ ఇళ్లలో మగవాళ్లను ఉంచేసి..ఆడవాళ్లు ఇలా తిరుగుతుంటారా అని సుశీలమ్మ ఇచ్చిపడేస్తుంది. సైలెంట్ అయిపోతుంది శ్రుతి తల్లి.
రవి చెవి దగ్గర బెలూన్ పేల్చుతుంది సుమతి. పెద్ద సౌండ్ రావడంతో ఉలిక్కిపడతాడు రవి. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడే బెలూన్ లా పేలిపోతాడు అంటాడు. ఏమన్నావ్ నన్ను అంటూ రవికి రివర్స్ లో పంచ్ వేస్తుంది సుమతి. అక్కడే ఉన్న శ్రుతి తల్లి చిరాగ్గా చూస్తుంది. ప్రభావతి కూడా ఫైర్ అవుతుంది. ఏంటిది ఇదేనా పద్ధతి..పెళ్లికావాల్సిన పిల్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటుంది శ్రుతి తల్లి. తనేదో సరాదాగా అన్నది..నాకు లేని బాధ మీకెందుకు అని శ్రుతి క్లాస్ వేయడంతో పరిస్థితి చక్కబడుతుంది. సుమతిని సపోర్ట్ చేస్తుంది శ్రుతి. సంస్కారం అంటే ఇది..విశాలమైన మనసు అంటే ఇది...ఎప్పుడు బురదజల్లుదాం అని చూసేవారికి శ్రుతి సమాధానం చెప్పింది అని సెటైర్ వేస్తుంది మీనా. అందరి సంతోషం చూసి రగిలిపోతుంటుంది శ్రుతి తల్లి. మంచి అవకాశం పోయిందనుకుంటుంది. ఇంతలో మీనాను చూసి..దొరికింది అనుకుంటుంది
ఏంటి మీనా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నావ్ ? మీ ఆయన నగలు చేయించేవరకూ బంగారం వేసుకోను అన్నావ్ కదా...అందుకే గిల్ట్ నగలు వేసుకున్నావా అని అడిగేస్తుంది. నగల మీద మోజులేదని చెప్పేసి అన్నీ తిసిచ్చావ్ కదా..అందుకే నగలపై మోజుతో గోల్డ్ కవరింగ్ నగలు వేశావా అని అడుగుతుంది. అవి బంగారమే అని కవర్ చేస్తుంది ప్రబావతి. అవి గిల్ట్ నగలేంటి..బంగారం కదా..నేను చేయించాను అంటుంది సుశీలమ్మ. ఏం నాకు తెలియదా? ఏవి బంగామో..ఏవి కాదో అని గట్టిగానే మాట్లాడుతుంది శ్రుతి తల్లి. ఆమె మాటలు విని మనోజ్-ప్రభావతిలో కంగారు మొదలవుతుంది. ఎవరు ఏ మతలబు చేశారో అంటుంది. ఆ మాటలకు ప్రభావతి ఎంత కవర్ చేద్దాం అని ప్రయత్నించినా ఆమె మాత్రం తగ్గదు. ఇవి బంగారు నగలే అంటుంది మీనా. నాకు తెలిసింది చెప్పాను అంటుంది. ఎవరేేం దాచిపెడుతున్నారో అని సెటైర్ వేస్తుంది. బీరువాలో పెట్టిన బంగారం బయటకు వచ్చేసరికి గిల్డ్ నగలుగా ఎలా మారుతుందని పార్వతి అంటుంది. నువ్వు అలానే అనుకో.. అవి నిఖార్సైన బంగారం అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటుంది సుశీలమ్మ. మమ్మీ నువ్వు వచ్చింది బర్త్ డే విశెష్ చెప్పడానికి..చెప్పావ్ కదా ఇక పద అని తీసుకెళ్లిపోతంది శ్రుతి. నీ పని అయిపోయింది అనుకున్నా అంటుంది కామాక్షి..బతికిపోయారంటుంది.
తల్లిని బయటకు తీసుకొచ్చిన శ్రుతి..నువ్వు ఏదో గొడవ పెడుతూనే ఉంటావా అంటుంది. వాళ్లు గిల్ట్ నగలు వేసుకుంటున్నారు..నీ బంగారు నగలు మాయం చేయరని గ్యారంటీ ఏంటి అంటుంది. నువ్వు వద్దు...నీ బంగారం వద్దు...మా ఫ్యామిలీలో నువ్వు వేలు పెట్టకు..నువ్వు వెళ్లు..ఇంకోసారి మా ఇంటికి రావొద్దు అంటుంది శ్రుతి. నువ్వే వస్తావ్ అనుకుంటూ వెళ్లిపోతుంది.
మౌనికకు సంజూ కాల్ చేస్తూనే ఉంటాడు లిఫ్ట్ చేయదు..డౌట్ లేదు..ఇది గుడిలో ఉండి ఉండదు అనుకుంటూ తల్లిని నిలదీస్తాడు. మౌనికకు దేవుడిపై భక్తి ఎక్కువ అందుకే అక్కడే కాసేపు ఉండి వస్తానంది అంటుంది. ఏ గుడో చెప్పు వెళతాను అంటాడు. అదే వస్తుందిలే అంటుంది సంజయ్ తల్లి. నేను గుడి బయటే ఉంటాను అడ్రస్ చెప్పు అంటాడు. నువ్వు భోజనం చేయి అన్నా కానీ వెళ్లిపోతాడు సంజయ్.
ఇంటికి వెళతాను అంటుంది మౌనిక. కేక్ కట్ చేసేవరకూ ఆగు అంటారంతా. నేను వడ్డిస్తే తప్ప ఆయన అన్నం తినరు అంటుంది మౌనిక. ఏం పర్లేదులే అల్లుడిగారికి నేను చెబుతాను అంటుంది ప్రభావతి. వాడు వెధవ అనుకుంంటూ..కాసేపు ఉండు అంటుంది మీనా. సరే అంటుంది మౌనిక. కేక్ కట్ చేసేందుకు అరెజ్మెంట్స్ చేస్తారు...బాలు వస్తే కానీ కేక్ కట్ చేయను అంటుంది. మేమంతా ఉన్నాం కదా అంటే... వాడు కూడా ఉండాలి అంటుంది. వాడు పీకల దాకా తాగి తూగుతూ ఉంటాడు అంటుంది ప్రభావతి. వాడు తాగడానికి కాక ఎందుకు వెళతాడని మనోజ్ అంటాడు..ఎక్కువ మాట్లాడకండి అని గట్టిగా బదులిస్తుంది మీనా.
ఇంతలో బాలు ఎంట్రీ ఇస్తాడు..సుశీలమ్మ మనసు ఆనందంతో నిండిపోయే బహుమతి ఇచ్చాడు..ఈ వివరాలు గుండెనిండా గుడిగంటలు నవంబర్ 14 ఎపిసోడ్ లో...
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!