గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 16 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 16 Episode)
రాత్రంతా సరిగా నిద్రపోని మనోజ్..పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోతుంటాడు. బాలు..రవి శ్రుతి సత్యంకి సైగ చేసి మరీ చూపిస్తాడు. అంతా చూసి నవ్వుతారు. రోహిణి ఉడుక్కుంటుంది. ప్రభావతి ఫైర్ అవుతుంది. నేను వ్యాపారం చేసుకోవాలి.. బుర్ర పనిచేయాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలి అంటాడు. స్వెట్టింగ్, దోమలు, కింద పడుకోవడం ఇబ్బంది అనగానే అదే ఇబ్బంది మేం కూడా పడ్డాం అంటుంది మీనా. ఏంటే నువ్వు మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అడిగితే.. జరిగిందే చెబుతున్నా అంటుంది మీనా. బాలు-మనోజ్ ఒకటేనా అని ప్రభావతి నోటికి పనిచెబుతుంది. మరోసారి మీనా బాలుని అవమానిస్తుంది.
షాప్ ఓపెనింగ్ కి ఎవర్ని పిలుస్తున్నారని శ్రుతి అంటే..ఇంకా ఆలోచించుకోలేదు అంటారు మనోజ్ రోహిణి. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుందని శ్రుతి సెటైర్ వేయడంతో అదేమైనా ఇంటిముందు పూలబండా అని అవమానిస్తుంది రోహిణి. చీఫ్ గెస్ట్ ని తీసుకురావాలని మనోజ్ అనడంతో.. ఫైర్ అవుతాడు బాలు. నువ్వు చేసే తప్పులన్నినీ కడుపులో పెట్టుకుని సపోర్ట్ చేసిన అమ్మను మించి ఎవరు నీకు మంచిజరగాలని కోరుకుంటారని కడిగిపడేస్తాడు బాలు. ఇక బాలు బాధ పడలేక..బెదిరింపులకు తలొంచి..తనకు ఇష్టం లేకపోయినా తల్లి ప్రభావతితో షాప్ ఓపెనింగ్ చేస్తారు. అందరూ వచ్చారు మీ వాళ్లు రాలేదని సత్యం అడిగితే.. మా వాళ్లను ఎవరూ పిలవలేదు అంటుంది మీనా. పిలవకపోయినా వస్తారుగా అని అవమానిస్తుంది ప్రభావతి. అంత సిగ్గుమాలినవాళ్లు ఎవరూ లేరంటుంది మీనా. అయినా వస్తే మాత్రం ఏం కొంటారేంటని అమానిస్తుంది.
ఇకనైనా పార్కుల్లో పడుకోకుండా , గుడిముందు అడుక్కోకుండా బాగుపడు అని అంటుంది కామాక్షి. ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం పడుతుందని ముందే చెప్పానంటుంది ప్రభావతి. ఇంతలో షాపు ఓనర్ వచ్చి.. ఓనర్ షిప్ మార్చిన పత్రాలు మనోజ్ కి ఇస్తుండగా.. మా అత్తయ్య చేతులమీదుగా తీసుకుంటాం అంటుంది రోహిణి. ఈ షాప్ ఇంత తక్కువకు ఇచ్చానంటే అందుకు కారణం బాలు అని అంటాడు షాప్ ఓనర్. డబ్బులిచ్చింది మా మనోజే కదా అంటుంది. అవునవును వాళ్ల మావగారు మలేషియా జైల్లో అంటూ అనబోతుండగా కామాక్షిని ఆపేస్తుంది ప్రభావతి.
షాపులో పనిచేసేవారిని పిలిచి పరిచయం చేస్తాడు ఫర్నిచర్ షాప్ మాజీ ఓనర్. ఇందులో ఉండేవారంతా కష్టపడి పనిచేస్తారని చెబుతాడు. చూద్దాంలెండి అంటాడు మనోజ్. మా మనోజ్ బాగా చదువుకున్నాడు..మా పార్లలమ్మ బాగా చదువుకుంది ఇద్దరూ కలసి షాప్ ని బాగా చూసుకుంటారు మీరు ప్రశాంతంగా వెళ్లిరండి అని చెబుతాడు బాలు.
రోహిణికి కంగ్రాట్స్ అని చెబుతుంది ఫ్రెండ్. మొత్తానికి మీ మావయ్య డబ్బులను ఎవ్వరి వాటా ఇవ్వకుండా మనోజ్ తో షాప్ పెట్టించేశావ్ అంటుంది. నువ్వు ఊరుకో అని ఆపుతుంది. నేను వెళ్తాను అంటుంది రోహిణి ఫ్రెండ్. నువ్వు ఇదైనా బాగా చూసుకో తనని టెన్షన్ పెట్టకు అని మనోజ్ కి చెప్పేసి వెళ్లిపోతుంది.
ఓపెనింగ్ లో సందడి చేసిన శ్రుతి తల్లి..ఇక్కడ అన్నిటికన్నా హయ్యెస్ట్ రేట్ ఏ వస్తువో అది నేను కొంటాను అంటుంది. అలా లక్షకు పైగా వెచ్చింది సోఫా కొంటుంది. మీనా బాలు కూడా ఓ గ్రైండర్ కొనుగోలు చేస్తారు. ఇదే అవకాశంగా మరోసారి అవమానిస్తుంది ప్రభావతి. శ్రుతి వాళ్లమ్మ భారీగా డబ్బులు వెచ్చింది కొన్నది..నువ్వు ఉన్నావ్ ఎందుకు అని అంటుంది. శ్రుతివాళ్లమ్మ రిచ్ కదా..బాలు వాళ్ల అమ్మ పూర్ కదా అని కామాక్షి సెటైర్ వేస్తుంది. అదృష్టం ఉంటేనే కోటీశ్వరులు అవుతారు అంటుంది.
ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు మీరే ఫస్ట్ బోణీ చేయండి అంటాడు మనోజ్..సరే అంటుంది శ్రుతి తల్లి. సత్యం మాత్రం మీనాను బోణీ చేయమను హ్యాండ్ మంచిది కు మంచి జరుగుతుంది అంటాడు. ఎక్కువ డబ్బులు పెట్టింది ఆవిడ కదా అంటాడు మనోజ్. అయినా పూలమ్ముకునేదాని చేతిలో ఏముంటుందని మరోసారి అవమానిస్తుంది. మీనా కొన్నదానికి నేను బిల్ ఇస్తాను అంటాడు సత్యం.. నేనిస్తాడు అంటాడు బాలు. నువ్వు డబ్బులిస్తే మనోజ్ తీసుకోడు అనుకుంటున్నావా అంటుంది.. మేం ఏదీ ఉచితంగా తీసుకోం అంటుంది మీనా.
ప్రభావతిని లాక్కెళ్లి పెద్ద క్లాస్ వేస్తాడు సత్యం. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావ్.. పదే పదే మీనాను అవమానిస్తున్నావ్ , మనిషిని మనిషిలా చూడడం ఎప్పుడు నేర్చుకుంటావ్ అంటాడు. వియ్యపురాలంటే డబ్బుండాలా..ఆస్తులుంటేనే మర్యాద గౌరవం ఇస్తారా? మీ కోడలిని వెనకేసుకు రావడానికి నన్నెందుకు అంటున్నారని అడుగుతుంది. ఆ డబ్బు నేను తీసుకుంటానా అంతా మనోజ్ కోసమే కదా అంటుంది. వాడికోసమే పాకులాడుతున్నావ్.. వాడికోసమే తప్పులు చేశావ్ అని క్లాస్ వేస్తాడు. నీ కొడుకు నీ చేయి మంచిది అని నీతో బోణీ చేయించలేదు..నీ మలేషియా కోడలు నీ బంగారు చేత్తో ఏదైనా కొనమని అడగలేదేం అని నిలదీస్తాడు. ఇన్నాళ్లూ నీ గారాబం వల్లే పనికిరాకుండా పోయాడు..ఇప్పటికైనా బాధ్యత తీసుకోనివ్వు అని క్లాస్ వేస్తాడు.
షాపులో ఎప్పటినుంచో పనిచేస్తున్న వాళ్లని పిలిచి వెళ్లిపొమ్మని చెబుతాడు మనోజ్. వాళ్లంతా షాక్ అవుతారు. మేం పనిచేయకుండా ఇంతకాలం ఈ షాప్ ఇంత బాగా నడిచిందా అని అడుగుతారు. మీరు ముసలైపోయారు..నాకు యంగ్ బ్లడ్ కావాలి అంటాడు