గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 04 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 04th Episode)
గుండె నిండా గుడిగంటలు సీరియల్ కీలక మలుపులు తిరుగుతోంది. శ్రుతి-రవిని తమింట్లోనే ఉంచేసుకుందాం అని శోభ-సురేంద్ర స్కెచ్ కి చెక్ పెట్టారు బాలు-మీనా. ఇద్దరూ కలసి రవి-శ్రుతితో మాట్లాడి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కక్షకట్టిన రోహిణి...శ్రుతి మీనాను సపోర్ట్ చేయడం చూసి పూలకొట్టు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ప్రభావతితో కలసి స్కెచ్ వేసి మున్సిపాల్టీ వాళ్లకి కంప్లైంట్ చేసి పూలకొట్టు తీయించేస్తుంది. మీనా బాధ చూడలేకపోయిన బాలు మొబైల్ పూలషాపు పెట్టించాలని ఫిక్సవుతాడు. అనుకున్నట్టుగానే బండికొని తీసుకొస్తాడు. డబ్బులు రౌడీయిజం చేసి సంపాదించాడని ప్రభావతి, రోహిణి నిందలేస్తారు..ఇంతలో పెద్దాయన వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు.
ఫైనల్లీ బండికి పూజ చేసి పూల అమ్మకం ప్రారంభించేసింది మీనా. మీనా-బాలు అన్యోన్యత..ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం చూసి మనోజ్ బాధపడతాడు..నాక్కూడా అలాంటి సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడో సక్సెస్ అయ్యేవాడిని అంటాడు. ఇక తనతండ్రి నుంచి డబ్బులు అడగకుండా ఉండాలంటే ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటుంది రోహిణి. నువ్వు గతంలో ఓ అమ్మాయిని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయావ్ కదా..తనని పెట్టుకుంటే డబ్బులు కక్కించవచ్చు అంటుంది. ఎలా కనుక్కోవాలని మనోజ్ అడిగితే.. ఏజెన్సీ ద్వారానే కదా ఫారెన్ వెళ్లి ఉంటుంది..అక్కడకు వెళ్లి ఎంక్వైరీ చేద్దాం అంటుంది. వెళ్లి కనుక్కుంటారు. ఆమె పేరు కల్పన. ఫారెన్లో ఉందనుకుంటున్నారు మనోజ్-రోహిణి..కానీ కల్పన లోకల్లోనే ఉంటుంది. కట్ చేస్తే బాలు కార్లో ప్రత్యక్షమవుతుంది.
అప్పట్లో మీనాను పెళ్లిచేసుకుంటానని మాటిచ్చిన మనోజ్...తండ్రి రిటైర్మెంట్ డబ్బులు కావాలనే కండిషన్ పెడతాడు. తీరా సత్యం ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్లి ప్రేయసి కల్పన చేతిలో పెడతాడు. ఆమె ఆ డబ్బుకోసమే మనోజ్ ని ట్రాప్ చేసిన కల్పన..ఆ తర్వాత మనోజ్ కి మోసం చేసి వేరే వ్యక్తితో పారిపోతుంది. మనోజ్ కి ఏం జరిగిందో అర్థంకాక ఉండిపోతాడు. ఆ తర్వాత అష్టకష్టాలు పడి తిరిగి ఇంటికి చేరుకుంటాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడే రోహిణి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అలా మిస్సైన కల్పన మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.
మనోజ్-రోహిణి వెతుకుతున్న కల్పన..బాలు కార్లో ప్రయాణిస్తోంది. క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడకు వెళుతోందో కానీ లోకల్ లోనే ఉంది అన్నది క్లారిటీ వచ్చేసింది. మనోజ్ ని మోసం చేసిన కల్పన ఆమె అని బాలుకి ఇంకా తెలియదు. ఇప్పుడు క్యాబ్ దిగిన తర్వాత కల్పన ఎక్కడకు వెళుతుంది? బాలుతో ఏమైనా గొడవపడుతుందా? అదే జరిగితే బాలు ఆమెను మర్చిపోడు. ఏదైనా సందర్భంలో మనోజ్ ద్వారా కల్పన గురించి తెలుసుకున్న బాలు హెల్ప్ చేసే అవకాశం ఉంది. రవి-శ్రుతి లైఫ్ ని నిలబెట్టిన బాలు..మనోజ్ కి కూడా మేలు చేస్తాడేమో? అప్పటికైనా బాలుపై ఉండే నెగెటివిటీ తొలగిపోతుందేమో చూడాలి. మరోవైపు మీనా-బాలుని టార్గెట్ చేసిన రోహిణికి వాళ్లే దిక్కవుతారు. ఆ డబ్బులు వసూలైతే మనోజ్ పై లక్షలు మింగినోడా అనే ముద్ర కూడా తొలగిపోతుంది. ఈ డబ్బులు తీసుకొచ్చి తండ్రి గురించి అడగకూడదు అనే కండిషన్ పెడుతుందేమో రోహిణి. ఏం జరుగుతుందో చూద్దాం...