గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 28th Episode
ఇంట్లో మాయమైన మీనా బంగారం లెక్కలు తేల్చే పనిలో పడ్డారు బాలు-మీనా. మనోజ్ తీశాడని..ప్రభావతి సహాయం చేసిందనే క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆ నిజాన్ని మనోజ్ తోనే బయటపెట్టాంచాలని ప్లాన్ చేశాడు బాలు. పైగా పార్క్ ఫ్రెండ్ అప్పు ఇచ్చాడని చెప్పడంతో.. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లికూడా క్లారిటీ తీసుకుంటాడు బాలు. మీ అన్నయ్యను నమ్మి నేను పదివేలు కూడా ఇవ్వను..అలాంటిది లక్షలు ఎలా ఇచ్చాను అనుకున్నావ్ అని షాక్ ఇస్తాడు. దీంతో..ఇంకేం సందేహం లేదు..మీనా బంగారం అమ్మేసి మనోజ్ ఆ డబ్బులు తెచ్చాడని తెలిసిపోతుంది. స్వామీజీ దగ్గరకు వెళదాం, అంజనం వేద్దాం అని మీనా చెబితే..అవసరం లేదంటూ ఏకంగా స్వామీజీ ఇచ్చారని బాలు ఓ నిమ్మకాయ తెచ్చి ఇంట్లో ఇందర్నీ భయపెట్టేస్తాడు
దొంగతనం చేయని రవి, శ్రుతి, సత్యం కూల్ గా ఉంటారు..ప్రభావతి, మనోజ్ లో టెన్షన్ పెరుగుతుంది. ఈ నిమ్మకాయ దేవుడి దగ్గర పెట్టమన్నారు. 24 గంటల్లో నిజం బయటపడకపోతే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్లకి కాళ్లు చేతులు పడిపోతాయి..ఆ తర్వాత పూర్తిగా మంచం పడతాడు..మరణం సంభవిస్తుందని స్వామీ చెప్పారు అని అంటాడు బాలు. ముందు ఆ నిమ్మకాయ బయటపడేయ్ అంటాడు బాలు. మీరెందుకు భయపడుతున్నారని శ్రుతి అడుగుతుంది.
రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత భయంభయంగా నిమ్మకాయ దగ్గరకు వెళతారు..మనోజ్..ప్రభావతి. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోకుండా గుద్దుకుంటారు..నేను కాదు నేను కాదు అంటూ భయంభయంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ నిమ్మకాయను చూస్తే భయం వేస్తోంది అంటాడు మనోజ్. దీన్ని ఇంట్లోంచి బయటపడేద్దామా అని అడుగుతుంది ప్రభావతి. ఈ నిమ్మకాయ సమస్య నుంచి ఎలా బయటపడతాం అని ఆలోచిస్తాడు.. బయటపడేసినా కానీ మనకు ఏమైనా జరుగుతుందేమో అనుకుంటారు.
తెల్లారేసరికి..మనోజ్-ప్రభావతికి మూతి వంకరపోతుంది..చేతి పడిపోతుంది..పక్షవాతం వచ్చినట్టు కూలబడిపోతారు. ఇదంతా నిమ్మకాయ మహిమేనా అంటాడు బాలు. నేను పెట్టిన నిమ్మకాయ పవర్ ఇంత ఉంటుందని ఊహించలేదు అనుకుంటా అంటాడు. మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంది అత్తయ్యా అంటుంది మీనా. అయ్యో రోజూ ఏపని చేసినా చేయకపోయినా ఇల్లంతా తిరుగుతూ ఉండేదానివి..కానీ ఇప్పుడు ఎవరో ఒకరు సహాయం చేయకపోతే ఏమీ చేయలేని దుస్థితి వచ్చిందని బాలు ఆడేసుకుంటాడు. ఇంత జరిగినా ప్రభావతి, మనోజ్ మాత్రం బంగారం దొంగతనం చేసింది తామే అని మాత్రం ఒప్పుకోరు. రోహిణికి కూడా నిజం తెలుసినా చెప్పదు. మరి మనోజ్ , ప్రభావతి బయటపడతారా చూడాలి...
ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?