Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ చూపు వచ్చిందని ఇంట్లో అందరికీ చెప్తుంది. నిన్న రాని చూపు ఈ రోజు ఎలా వచ్చింది.. అందరినీ పిచ్చివాళ్లని చేసేస్తున్నావా అని పద్మాక్షి అడుగుతుంది. అంబిక కూడా లక్ష్మీని తిట్టబోతే ఒక్కనిమిషం అమ్మా అని అంబికను లక్ష్మీ అంటుంది.

Continues below advertisement

లక్ష్మీ అందరితో తనకు చూపు రావడానికి అంబిక కారణం అని ఓ స్పెషలిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లి కళ్లలో డ్రాప్ వేయించిందని అందుకే చూపు వచ్చిందని అంటుంది. వెటకారంగా లక్ష్మీని దండం పెట్టి మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా అని అంటుంది. యమున, వసుధ అంబికను పొగిడేస్తారు. లక్ష్మీని తిడుతూ ఉన్నా మా చెల్లికి ఎక్కడో లక్ష్మీ అంటే కాస్త ఇష్టమే అని అంటుంది. 

Continues below advertisement

విహారి లక్ష్మీని పక్కకి తీసుకెళ్లి నేను అంత పరాయి వాడినా.. నన్ను అంత దూరం పెట్టేశావా.. ఇన్నిరోజులకు నీకు ఓ చిన్న మంచి జరిగినా నాకు చెప్పాలి అనిపించలేదా.. నేను అంత పరాయి వాడినా.. నువ్వు ఇలా నన్ను దూరం పెట్టడం అస్సలు భరించలేకపోతున్నా అని విహారి ఏడుస్తాడు. ఏడ్వొద్దు అని లక్ష్మీ చెప్తుంది. ప్రేమించిన వాళ్లు దూరం పెడితే బాధ పడకుండా ఎలా ఉంటాం ఏడ్వకుండా అని విహారి అడుగుతాడు. విహారి ఏడ్వడం చూసి లక్ష్మీ హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఎందుకు లక్ష్మీ ఇలా నీలో ప్రేమ ఇలా దాచుకుంటున్నావ్ అంటే అని అడుగుతాడు. ఓదార్చడానికి ఇలా చేశా అని లక్ష్మీ అంటుంది. 

విహారి లక్ష్మీతో అందరికీ అంబిక అత్తయ్య నీ కళ్లు తెప్పించిందని చెప్పావ్ ఎందుకు అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ అంబిక రెండు వందల ఎకరాలు రాయించుకోవడానికి అంబిక రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లడం సంతకం పెట్టించడం గురించి చెప్తుంది. అందుకే నిజం దాచాను అని అందరికీ అబద్ధం చెప్పానని తాతయ్యగారు నా మీద పెట్టిన బాధ్యత అది అందుకే ఇలా చేశా అంటుంది. విహారి కోపంగా వెళ్తాడు. 

పద్మాక్షి వాళ్లు అంబికతో లక్ష్మీకి ఎందుకు చూపు తెప్పించావ్ అంటే మన కోసమే లక్ష్మీకి చూపు లేదు అని మనం ఏం చేసినా అందరూ మనల్ని అంటారు అందుకే ఇలా చేశా అని తన ప్లాన్ చెప్తుంది. ఇక విహారి అంబిక దగ్గరకు కోపంగా వస్తుంటే లక్ష్మీ ఆపేస్తుంది. అంబికమ్మని ఏం అనొద్దు అని అంటుంది. అంత చేసిన తర్వాత అడగకుండా ఎలా ఉండాలి.. మనల్ని కాదు అని అత్తయ్య ఫ్యాక్టరీ కట్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తారు.. మనకు ఎందుకు ఎదురు తిరుగుతారు. అన్నీ అడగాలి అని అంటాడు. ఇందులో అంబికమ్మ తప్పు లేదు అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ నచ్చచెప్పడంతో విహారి ఊరుకుంటాడు. ఈ క్షణం నిన్ను మనసారా హత్తుకోవాలి అని ఉంది కానీ బాధగా కూడా ఉంది అని విహారి లక్ష్మీతో చెప్తాడు.

 కావేరి నైట్ లక్ష్మీ దగ్గరకు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. నీకు చూపు రావడం అంటే మా అమ్మ నా దగ్గరకు వచ్చినట్లు ఉంది అని అంటుంది. మీ అమ్మ రెండు త్యాగాలు చేశారు కావేరి.. విహారి గారిని కాపాడారు. ఆవిడ చనిపోతూ కళ్లు ఇచ్చి నాకు మరో జీవితం ఇచ్చారు.. ఆవిడ త్యాగాలకు ఏం ఎవరం ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం.. నీకు మీ అమ్మకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం అని లక్ష్మీ అంటుంది. అలా అనొద్దు అక్క నేను మీకు రుణపడి ఉన్నా.. మా అమ్మ చెప్పగానే విహారి గారు నన్ను కాపాడటానికి వచ్చారు కానీ అమ్మ నేను కలిసినప్పుడే శాశ్వతంగా విడిపోయా అని ఏడుస్తుంది. నువ్వు మీ అమ్మ దూరంగా లేరు నా కళ్లతో మీ అమ్మ నిన్ను చూస్తుంది బాధ పడకు అని లక్ష్మీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.