గుండెనిండా గుడిగంటలు జూలై 28ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 28th Episode)

మీనా పూలుకడుతుంటే అక్కడకు వస్తుంది శ్రుతి. పూలు చాలా బావున్నాయ్ వీటితో నాకు పని ఉంది ఇవ్వు అని తీసుకుంటుంది. పూలదండ తీసుకుని చేతికి కట్టుకుని వాసన చూస్తూ వెళ్లిపోతుంది. శ్రుతి చాలా ఫాస్టుగా ఉంది..నా కొడుకు ఎలా వేగుతున్నాడో ఏంటో అనుకుంటుంది ప్రభావతి. షాక్ లో నిల్చున్న ప్రభావతిని చూస్తూ ఉండిపోతుంది మీనా. శ్రుతిని ఏమీ అనలేక ఎప్పటిలా మీనాపై ఫైర్ అయి వెళ్లిపోతుంది ప్రభావతి. 

మరోవైపు మీనాకు శ్రుతి సపోర్ట్ చేయడాన్ని భరించలేకపోతుంది రోహిణి. పైగా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మీనా కూడా గట్టిగా ఇచ్చి పడేస్తుంది కదా అది కూడా తట్టుకోలేకపోతుంది. పూలు అమ్ముకుంటూనే భర్తకు కారు కొనిచ్చింది మీనా. తండ్రి మలేషియాలో ఉన్నాడని, గొప్పింటి బిడ్డను అని చెప్పుకున్న రోహిణి మాత్రం మనోజ్ కి ఏమీ చేయలేకపోతుంది. మనోజ్ పార్కులో పల్లీలు తింటూ, గుడి ముందు అడుక్కుంటూ ఇలా రకరకాలుగా తప్పులు చేస్తూ దొరికిపోతుంటాడు. కక్కలేక మింగలేక భరిస్తుంటుంది రోహిణి. గట్టిగా మాట్లాడితే మీ నాన్ని అడిగి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం పెట్టించు అంటోంది ప్రభావతి. ఇప్పుడు శ్రుతి, మీనా కూడా అదే మాట అనడంతో రోహిణి రగిలిపోతుంటుంది. చదువులేని మీనా నన్ను అన్ని మాటలు అంటుందా? ఆ పూల కొట్టు చూసకునే కదా దాని పొగరు...అది లేకుండా చేయాలి, వ్యాపారం లేకుండా చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇందుకోసం ప్రభావతి సపోర్ట్ తీసుకోవాలని ఫిక్సవుతుంది

ఉదయాన్నే మీనా పూలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటుంది. అవెక్కడికి తీసుకెళ్తున్నావ్ అని ప్రభావతి అడ్డుకుంటుంది. పెద్ద ఆర్డర్ ఉంది పూలు కట్టాలి అందుకే ఫ్రిజ్ లో పెడుతున్నా అంటుంది శ్రుతి. నేను బయటకు వెళ్లాలి ఇక్కడె పడతా అని చెప్పి మీనా పూలు లోపల పెట్టేసి వెళ్లిపోతుంది. కోపంతో రగిలిపోతుంటుంది ప్రభావతి. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది శ్రుతి తల్లి శోభ. తన కూతురుకి తానే నచ్చజెప్పి పంపించాను అని అబద్ధం చెబుతుంది. ప్రభావతిని బుట్టలోపడేయాలని ఫిక్సవుతుంది. ఇంతలో పూలు కొనుక్కునేందుకు వచ్చిన కస్టమర్.. పూలమ్మాయ్ అంటూ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీనా లేదని ప్రభావతి చెబితే నువ్వు ఇవ్వొచ్చుకదా అంటుంది. ప్రభావతి పరువు పోయిందని బాధపడుతుంటే శోభ నవ్వుకుంటుంది. పూలు కొనుక్కునేందుకు వచ్చిన ఆమె వెళ్లిపోయిన తర్వాత నాక్కూడా పూలు ఇవ్వండి అనేసి డబ్బులిచ్చి పూలు తీసుకెళ్లిపోతుంది శోభ.

మీనా ఎంతపని చేశావ్..నన్ను పూలమ్ముకునేదాన్ని చేశావ్ అని తెగ బాధపడిపోతుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. అత్తను రెచ్చగొట్టేందుకు, మీనా పూలకొట్టు పీకించేసేందుకు ఇదే మంచి సమయం అని ఫిక్సవుతుంది. ఆ పూలకొట్టు వల్లే మీకు తలనొప్పి కదా దాన్ని తీయించేద్దాం అంటుంది. పూలుకొట్టు పెట్టేందుకు కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి...బాలు పర్మిషన్ తీసుకుని ఉండడు కదా .. అందుకే వాళ్లకి కాల్ చేస్తే చాలు వచ్చి పూలకొట్టు తీసుకెళ్లిపోతారు. మీనా వచ్చేలోగా అంతా అయిపోతుందనే సలహా ఇస్తుంది రోహిణి. అదేదో చేయి అంటుంది ప్రభావతి. ఇక నువ్వు పూలకొట్టు మర్చిపో మీనా అనుకుని నవ్వుకుంటుంది ప్రభావతి.