తులసిని రెచ్చగొట్టి ఆస్తి చేజిక్కించుకున్నందుకు లాస్య తెగ సంబరపడిపోతుంది. డాక్యుమెంట్స్ నందు కంట పడకూడదు అని వాటిని దాచి పెట్టి వెనక్కి తిరిగేసరికి నందు ఉంటాడు. చూసేసి ఉంటాడా అని లాస్య భయపడుతుంది. చాలా భద్రంగా దాచావ్ అంత ముఖ్యమైన డాక్యుమెంట్సా అని అడుగుతాడు. అది నా రెజ్యూమ్ అని లాస్య కవర్ చేస్తుంది. అమ్మానాన్న దూరం అయ్యారు అని నందు ఫీల్ అవుతాడు. నాన్నని చూసుకోమని నీకు చెప్పాను కదా అని లాస్య మీద అరుస్తాడు. ప్రేమ్ శ్రుతి దగ్గరకి వస్తాడు.


Also read: దేవయానికి దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన వసు- మినిస్టర్ ని కలిసేందుకు వెళ్తున్న మహేంద్రని రిషి చూస్తాడా?


ఇద్దరు తులసి గురించి మాట్లాడుకుని బాధపడతారు. తులసి అద్దె ఇంటి కోసం తిరుగుతూ ఒక ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఎంత మంది ఉంటారు అని అడుగుతుంది. నేను మా అబ్బాయి అని తులసి చెప్తుంది. మరి మీ హజ్బెండ్ ఉండరా అని అడుగుతుంది. లేరు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారని తులసి చెప్తుంది. సింగిల్ గా ఉండే వాళ్ళకి మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అందరూ సరిగా ఉంటారని నమ్మకం లేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటకి తులసి సీరియస్ అవుతుంది. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోకుండా వేలెత్తి చూపించే హక్కు లేదని తులసి కాసేపు ఆమెకి క్లాస్ పీకుతుంది. సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు, సింగిల్ లేడికి ఇల్లు ఇవ్వడం అంతే కొరివితో తల గోక్కున్నట్టే అని ఆమె చెప్తుంది.


బయట నీలాంటి వాళ్ళ కోసం ప్రవచనాలు చెప్తున్నారు వాటిని విని మనసు మార్చుకోండి అని తులసి హెచ్చరిస్తుంది. పరంధామయ్యకి ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వాలో అర్థం కాక దివ్య వెతుకుతూ ఉంటుంది. తులసి గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. తులసి రోడ్లు పట్టుకుని ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. సింగిల్ గా ఉన్నవాళ్ళకి ఇల్లు ఇవ్వము అని అందరూ చెప్తారు. ఏ ఇంటికి వెళ్ళినా భర్త గురించి అడుగుతారు, సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పేస్తారు. తిరిగి తిరిగి అలిసిపోయి ఉంటే సామ్రాట్ ఫోన్ చేస్తాడు. సింగిల్ గా ఉన్నారా అని సామ్రాట్ అనేసరికి తులసి ఫైర్ అవుతుంది. సింగిల్ గా ఉండటం తప్పా అని అరుస్తుంది. ఎందుకు అని సామ్రాట్ అడిగేసరికి సింగిల్ గా ఉండటం వల్ల నాకు ఇల్లు ఇవ్వమని చెప్తున్నారు అని తులసి ఫీల్ అవుతుంది.


Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి


అందరూ భోజనం చేస్తుంటే అనసూయని ఇరికించడానికి లాస్య ప్రయత్నిస్తుంది. మనకి ఏ పండగ కలిసి రావడం లేదు అని అనసూయ మాట్లాడుతుంటే మళ్ళీ ఏం ప్లాన్ వేసిందో అని అంకిత మనసులో అనుకుంటుంది.


తరువాయి భాగంలో..


తులసికి దివ్య ఫోన్ చేసి బాధపడుతుంది. నువ్వు లేని కుటుంబం అసలు కుటుంబమే కాదని దివ్య ఏడుస్తుంది. మంచి రోజులు వస్తాయి నావల్ల ఇల్లు ముక్కలు కావడం నాకు ఇష్టం లేదని తులసి దివ్యకి నచ్చజెపుతుంది.