Gruhalakshmi Latest Episode: నందు ఆవేశంగా తులసి దగ్గర ఉన్న హనీ చేతిలో పుస్తకం పక్కన పెట్టేసి గదిలోకి వెళ్ళి అడుకోమని అంటాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని తండ్రి నిలదీస్తాడు.


నందు: ఏం చేయమంటావ్ ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతున్నా


తులసి: ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది. చిన్న పిల్ల అని కూడ చూడకుండా హనీ మీద ఆ దౌర్జన్యం ఏంటి?


నందు: భయాన్ని నా గుండెల్లో దాచుకోలేకపోతున్నా. నిజాన్ని గుండెల్లో మోస్తూ భరించే ఓపిక లేదు. తులసి నా మాట వినడం లేదు. అటు వాళ్ళు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు


తులసి: ఎవరు బెదిరిస్తున్నారు? మనం ఎవరికీ భయపడుతూ బతకాల్సిన పని లేదు. మనం ఏ తప్పు చేయలేదు


నందు: హనీని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాం


Also Read: నిజం తెలిసి చెంప పగలగొట్టిన భవానీ- ఆదర్శ్ అంటే ఇష్టం లేదని తెగేసి చెప్పిన ముకుంద


తులసి: మీకు హనీకి ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ నాకు హనీకి సంబంధం ఉంది. ఈ మాట ఎవరికైనా చెప్తాను ఎవరికీ భయపడను


నందు: నీ ఫ్యామిలీని చంపేస్తానని చెప్పినా భయపడవా? నాన్నని రౌడీలతో కొట్టించింది వాళ్ళే. గుడి దగ్గర  మిమ్మల్ని కారుతో గుద్దించి చంపాలనుకుంది వాళ్ళే. రేపు ఇవే నిజాలు అయితే మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? హనీ కోసం మనం ఎందుకు నష్టపోవాలి. ఇదంతా అవసరమా? నా మాట విను ఇప్పుడే వెళ్ళి హనీని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను


తులసి: వాళ్ళు హనీని చంపేస్తే. స్వార్థంతో ఆలోచించొద్దు. ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? ఇంత టెన్షన్ భరించాల్సిన అవసరం ఏముంది? ఇక ఏం చేయాలో నేను చూసుకుంటానని ఆవేశంగా బయల్దేరుతుంది


నందు: ఇలా ఆవేశపడతావని చెప్పలేదు. హనీని పంపించేస్తే ప్రాబ్లం తీరిపోతుంది


కానీ తులసి మాత్రం తన దారికి అడ్డు రావొద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది. రత్నప్రభ ఇంటికి తులసి వచ్చేసరికి అక్కడ ఎదురుగా లాస్య ఉంటుంది. తులసి గురించి మాట్లాడుకోవడం మొత్తం వింటుంది. తులసికి నచ్చజెప్పలేడు కానీ బెదిరించి హనీని తీసుకొస్తాడని అంటుంది.


తులసి: కలలు కంటున్నావా? ఇక్కడికి వచ్చాక తెలిసింది వీళ్ళ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నువ్వేనని. మా చేతిలో చచ్చేని చావు దెబ్బలు తిన్నావ్ అయినా సిగ్గు లేదా? హనీ గురించి ఆలోచించడం మానేయండి. తనని వెనక్కి తెచ్చే ప్రయత్నాలు ఆపేయండి. తను నా దగ్గరే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాదు. ఇలాంటి పనికిరాని దాన్ని అడ్డం పెట్టుకుని నాతో యుద్ధం చేస్తే మీకే నష్టం


లాస్య: నీ మొగుడ్ని నీకు కాకుండా చేసుకున్నా నేను చేతకాని దాన్ని కాదు ఏమైనా చేస్తాను


తులసి: ఒప్పుకుంటాను కానీ ఏం లాభం కాపురాన్ని నిలబెట్టుకున్నావా? మరి చేతకాని దానివి కాక ఇంకేంటి?


రత్నప్రభ: లాస్య మీ పర్సనల్ విషయాలు పక్కన పెట్టి హనీ గురించి తేల్చు


తులసి: మీ సంగతి తెలిసి కూడా ఎలా హనీని అప్పగిస్తాను, తన గురించి మర్చిపోండి


లాస్య: అయితే నువ్వు కూడా నీ ఫ్యామిలిని కూడా మర్చిపో ఎవరూ దక్కరు


తులసి: అది నా ఫ్యామిలీ మాత్రమే కాదు ఒకప్పుడు నీ ఫ్యామిలీ కూడ


లాస్య: నువ్వు నా శత్రువు, నీకు హనీ ముఖ్యమో నీ ఫ్యామిలీ ముఖ్యమో తేల్చుకో


తులసి: నాకు హనీతో పాటు నా ఫ్యామిలీ కూడ ముఖ్యమే


లాస్య: ఈ క్షణం నుంచి నీ ఫ్యామిలీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియక చెమటలు కక్కేలా చేస్తాను. హనీ కోసం నీ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టుకోవడం అవసరమా?


తులసి: రిస్క్ తీసుకోవడం నాకేం కొత్త కాదు నాతో పెట్టుకుంటే నీకే ప్రమాదం. నేను ఉన్నంత వరకు అసలు నువ్వు నా ఫ్యామిలీ జోలికి రాలేవు


లాస్య: నేను ఒకప్పటి లాస్య కాదు ఏమైనా చేస్తాను 


Also Read: కళ్యాణ్ మాటలకి ఫీలైన అప్పు- భర్త ప్రేమకి మురిసిన కావ్య


ఈ తులసి కూడా ఒకప్పటి తులసి కాదు ఎంతకైన తెగిస్తుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వీళ్ళ గొడవ ఏంటో అర్థం కాక రత్నప్రభ దంపతులు అయోమయంగా చూస్తూ ఉంటారు.


విక్రమ్, దివ్య కాసేపు పోట్లాడుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇద్దరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. జాహ్నవికి పెళ్లి చేద్దామని దివ్య అంటుంది. అంత అర్జెంట్ ఏమొచ్చింది అది అమ్మ చూసుకుంటుందని అంటాడు. ఎవరూ చూడరు పట్టించుకోరు ఎందుకంటే జానూ నిన్ను ఇష్టపడుతుంది దివ్య నిజం చెప్పేస్తుంది.