Gruhalakshmi Telugu Serial Today Episode:  గార్డెన్‌లో కూర్చుని ఏడుస్తున్న దివ్యను విక్రమ్‌ ఓదారుస్తాడు. నేను మర్చిపోదామనుకున్నా ఆ అమ్మాయి నన్ను వెంటాడుతోంది. ఎందుకు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుందో అర్థం కావడం లేదు అంటుంది దివ్య.


విక్రమ్‌:  ఈసారి ఆ అమ్మాయి మళ్లీ కనిపిస్తే ఎదురు తిరుగు. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కాదు. ఏ చేస్తుందో చేసుకోమను . అసలు భయపడకు. నువ్వు భయపడుతున్నావని భయపెడుతుంది. నిజంగా ఆ అమ్మాయికి ఏమైనా జరిగి ఉంటే శవం కనిపించాలి కదా? కనిపించిందా? ముందా కాఫీ తాగు. దా కూర్చో తాగు


అంటూ దివ్యకు ధైర్యం చెప్పి కాఫీ తాగమంటాడు విక్రమ్‌. ఇదంతా పైన బాల్కనీలోంచి గమనిస్తున్న బసవయ్య, సంజయ్‌తో వీడా దివ్యకు ధైర్యం చెప్పి పాడు చేస్తున్నాడు పిలిచి మాట్లాడుదాం పద అనుకుంటారు. కిందకు వచ్చి విక్రమ్‌ను పిలిచి సంజయ్‌, బసవయ్య దివ్యకు పిచ్చి అని తెలిసి కూడా నువ్వు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. అంటూ విక్రమ్‌కు లేనిపోని కట్టుకథలు చెప్తారు. రాజ్యలక్ష్మీ వచ్చి కూడా విక్రమ్‌కు అదే చెప్తుంది. దివ్యను వీలైనంత ఎక్కువగా బయటకు రానివ్వొద్దని చెప్తుంది. దీంతో విక్రమ్‌ దివ్యను లోపలికి తీసుకెళ్తాడు. మరోవైపు తులసి కిచెన్‌లో ఒంటరిగా నిలబడి పరంధామయ్య మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో అనసూయ వచ్చి తులసిని ఓదారుస్తుంది.


అనసూయ: అమ్మా తులసి నన్ను చూసి ఏడవడం ఆపేసి నవ్వుతున్నావు కదూ.. అయన లాస్యను తన కోడలు అనుకోవడం బాగానే ఉంది. కానీ నీ మీద అరవడ ఏంటో నాకర్థం కావడం లేదు. అంత తప్పు నువ్వేం చేశావని.


తులసి: తప్పు మనది కాదు.. మామయ్యది కాదు. ఆయనకొచ్చిన జబ్బుది. ఆయనేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఆలా మాట్లాడుతున్నారు. జబ్బు తగ్గిపోయాక ఆరోజు మీరిలా మాట్లాడారు అని గుర్తు చేస్తే ఆయన చాలా బాధపడతారు.


అనసూయ: అసలు అలాంటి రోజు ఎప్పుడొస్తుందో..?


తులసి: ఎందుకు రాదు అటువంటి రోజు వస్తుందనే కదా మనం కొత్త డాక్టర్‌ గారితో ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నాం.


 అంటూ ఇద్దరూ బాధపడతారు. ఎన్ని సమస్యలు వచ్చినా మామయ్య ఆరోగ్యం కోసం అన్ని ఓర్చుకోవాలని అనసూయకు చెప్తుంది తులసి. తర్వాత హాల్‌లోకి వెళ్లిన అనసూయ  బట్టలు సరిగ్గా వేసుకోకుండా కూర్చున్న పరంధామయ్యను చూసి తిడుతుంది. ఇంతలో లాస్య కాఫీ తీసుకుని వస్తుంది. లాస్య మెడలో మంగళసూత్రం లేదని లాస్యని తిట్టి, అనసూయను తిడతాడు.


ఇంతలో తులసి పసుపుతాడు తీసుకుని వచ్చి అప్పటి వరకు ఈ పసుపుతాడు కట్టుకో అని లాస్యకు ఇస్తుంది. పసుపుతాడు తనకు తాను కట్టుకుంటుంటే పరంధామయ్య ఒక్క నిమిషం అంటూ లేచి మొగ్గుణ్ని ఎదురుగా పెట్టుకుని నువ్వేసుకుంటున్నావ్‌ అంటూ నందను పసుపుతాడు కట్టు అంటూ ఆర్డర్‌ వేస్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. నంద పసుపుతాడు కట్టగానే తులసి బాధగా వెళ్లిపోతుంది. పరంధామయ్య వెళ్లిపోతాడు.


నంద పసుపుతాడుకు ఒక్కటే ముడి వేశానని అనసూయకు చెప్తాడు. పిచ్చి నందు నువ్వు నాకు ఒక్కటే  ముడి వేశావు. కానీ నీ జీవితానికి నేనే పీటముడి వేస్తాను అని మనసులో అనుకుంటుంది. మరోవైపు విక్రమ్‌ ఒక్కడే హాల్‌లో కూర్చుని బాధపడుతుంటే వాళ్ల నాన్న వచ్చి ఓదారుస్తాడు. తులసికి దివ్య పరిస్థితి చెప్పావా? అని అడుగుతాడు. దీనికి విక్రమ్‌ చెప్పలేదంటాడు. ఎందుకు చెప్పలేదని అడిగుతే .. దివ్యనే చెప్పొద్దంది అనడంతో అయితే దివ్యకు పిచ్చి లేదేమోనని అనడంతో ఇద్దరూ ఆలోచనలో పడిపోతారు.


ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి చేసిన ప్రయోగాలే విఫలం అవుతుంటాయి. దివ్య విషయంలో కూడా డాక్టర్లు తప్పు చెప్పి ఉండొచ్చు కదా అంటూ వాళ్ల నాన్నగారు చెప్పడంతో విక్రమ్‌ ఆలోచనలో పడిపోతాడు.  మరోవైపు తులసి వాళ్ల పనిమనిషి రాములమ్మ కొత్త డాక్టర్‌ ను అడ్డం పెట్టుకుని లాస్య నాటకం ఆడుతుందేమోనని తనకు అనుమానం వస్తుందని తులసితో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: మాది ‘ఆదిపురుష్‘ కాదు, ఓం రౌత్ వీఎఫ్ఎక్స్‌పై ‘కల్కి‘ ఎడిటర్ సెటైర్లు