Gruhalakshmi Telugu Serial Today Episode: నందగోపాల్‌ తాగొచ్చాడని బసవయ్య, ప్రసూనాంబ గట్టిగా అరుస్తుంటే నందగోపాల్‌ లేచి ఎవరు బుద్ది లేనోళ్లు అంటూ అరుస్తాడు. మేం తప్పు చేశామనే మమ్మల్ని పనోళ్లను చేశావని.. మరి మీ నాన్నా ఇప్పుడు తప్పుచేశాడు అయనకు ఎలాంటి శిక్ష వేస్తారు. అని ప్రశ్నిస్తాడు బసవయ్య. దీంతో నందగోపాల్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దివ్య వాళ్ల నాన్నను ఆపేందుకు వెళ్తుంటే.. తులసి వద్దని వారించి అనసూయ, పరంధామయ్యగార్లను తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. దివ్య ఏడుస్తూ ఉండిపోతుంది.


ఇంటికి వచ్చిన నందగోపాల్‌ ఇంట్లో సామాన్లు పగులగొడుతూ..ఉంటే వాళ్ల అమ్మా నాన్నా ఆపే ప్రయత్నం చేస్తారు.


నంద: వాళ్లు అక్కడ నన్ను అంతలా అవమానిస్తుంటే మీలో ఒక్కరైనా నావైపు మాట్లాడారా? వాళ్లను నిలదీశారా? ఎదురించారా? నా బంగారు తల్లి దివ్య ఒక్కతే ఈ నాన్న మీద జాలి పడింది. నన్ను అర్థం చేసుకుంది. నాకు సపోర్టుగా నిలబడింది.


తులసి: అక్కడ అవమానం జరిగింది ఆయనకు కాదు నాకు. బుద్ది లేకుండా తాగిన వాడిని తీసుకొస్తారా అని అడిగారు. అవమానం జరిగింది దివ్యకు. వాళ్ల నాన్న పచ్చి తాగుబోతు అని అక్కడ చెప్పుకుంటారు. దాన్నిప్పుడు నానా మాటలు అంటారు. ఏమని చెప్పుకుంటుంది. తప్పు ఆయన చేసి మనపై అరుస్తున్నారెందుకు?


అనగానే నేను ఎవరి కోసం ఇలా మారానో మీకు తెలియదా? క్షమించమని కాళ్లమీద పడ్డా నన్ను పట్టించుకోకపోవడం వల్లే కదా ఇలా తాగింది. అంటూ నందగోపాల్‌ ఆవేశంగా చెప్తాడు. మీరు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించారు. అక్కడ రాజ్యలక్ష్మీ మన దివ్యను పీక్కు తింటుంది. తాగి అరవడం కాదు అంటూ తిట్టి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.  దివ్య ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బసవయ్య అన్న  మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో విక్రమ్‌ అక్కడకు వస్తాడు. విక్రమ్‌ను చూసి దివ్య లేచి వెళ్లిపోతుంటే..


విక్రమ్‌: దివ్య ఆగు ఆ కన్నీళ్లేంటి?


దివ్య: ఏం లేదు.


విక్రమ్‌: నా దగ్గర కూడా దాపరికమా?


దివ్య: తెలిసి కూడా అడగడం దేనికి? మా వాళ్లకు అవమానం జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. మీ మావయ్య వాళ్లు అన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండిపోయావు.


అంటూ దివ్య ప్రశ్నించడంతో మీ నాన్నా తాగి రావడాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? అంటూ విక్రమ అడగడంతో దివ్య మౌనంగా ఉండిపోతుంది. మీ నాన్న ఎందుకు తాగాడని నేను అడగను కానీ ఈ పరిస్థితుల్లో మీ నాన్న వల్ల మన ఇంట్లో గొడవలు రావడం నాకు ఇష్టం లేదని చెప్తాడు విక్రమ్‌. నందగోపాల్ బెడ్‌రూంలో మందు తాగుతూ ఉంటాడు. బయట డైనింగ్‌ హాల్లో తులసి, అనసూయ, పరంధామయ్య కూర్చుని నందా కోసం ఎదురుచూస్తుంటారు. లాస్య, నందగోపాల్‌కు ఫోన్‌ చేస్తుంది. నందగోపాల్‌ ఫోన్‌ కట్‌ చేస్తుంటాడు. కంటిన్యూగా అలాగే ఫోన్‌ చేస్తుంది. నంద ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే తన ఇంటికి వచ్చేయమని నందును రెచ్చగొడుతుంది. నందా మాత్రం లాస్యను తిట్టి ఫోన్‌ కట్ చేస్తాడు. అనసూయ నంద దగ్గరకు వచ్చి భోజనానికి పిలుస్తుంది నంద రానని చెప్పడంతో ఆమె కోపంగా నందను తిట్టి వెళ్లిపోతుంది. రాజ్యలక్ష్మీ, బసవయ్య ఎదో కొత్త ప్లాన్‌ వేస్తుంటారు.


రాజ్యలక్ష్మీ: తమ్ముడు చెప్పిన పని చెప్పినట్లు చేయ్‌. ఎంత సమర్థించుకున్నా వాళ్ల నాన్నా చేసిన దిక్కుమాలిన పనికి కుమిలిపోతూ ఉంటుందిగా.. ఇక దివ్యకి మన మీద నోరు లేపడానికి అసలు ధైర్యం చాలదు.


బసవయ్య: నోరు లేపితే ఊరుకుంటానా ఎంటి? చూశావుగా పొద్దున విరుచుకుపడతా..


ముందూ వెనకా మంచి చెడ్డా చూడను అసలు భయపడను. మమ్మల్నే పనొళ్లుగా మార్చింది. ఇంతకంటే ఎం చేస్తుంది.


రాజ్యలక్ష్మీ: ఇదే మూడ్‌లో ఉండు.. అసలు తగ్గొద్దు.


అనగానే ఇద్దరూ కలిసి దివ్య కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీద పడకూడదని దానికోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్‌ అవుతారు. తులసి మార్కెట్‌కు వెళ్తుంటే.. పరంధామయ్య తులసితో పాటు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read : 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మకు విష భోజనం పెట్టిన సుమన - అన్నంలో పడ్డ కుభసం!