Gruhalakshmi  Telugu Serial Today Episode:  హాస్పిటల్‌కు వెళ్లిన నందను లాస్య డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్తుంది. నంద వాళ్ళ నాన్నకు చెందిన ఫైల్‌ను డాక్టర్‌కు చూపిస్తాడు. నువ్వు రాకముందే డాక్టర్‌ గారికి మామయ్య గురించి మొత్తం చెప్పాను. మీ నాన్నను నార్మల్‌ చేస్తానని డాక్టర్‌ చెప్పారని లాస్య అంటుంది. దీంతో అనుమానంగా ఏ డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా ఈ జబ్బు తగ్గదని అంటున్నారు మీరెలా తగ్గిస్తారని నంద అడుగుతాడు. అదేం లేదు. నేను ఈ వ్యాధి మీదే పరిశోధనలు చేస్తున్నాను అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అంటాడు డాక్టర్‌. పేషెంట్‌ను రేపు తీసుకుని రండి ట్రీట్‌మెంట్‌  స్టార్ట్‌ చేద్దాం అని డాక్టర్‌ చెప్పగానే నంద వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో టాబ్లెట్స్‌ సరిచూసుకుంటుంది అనసూయ. తులసి లోపలి నుంచి వచ్చి


తులసి: ఎంటత్తయ్యా మందుల డబ్బా ముందేసుకుని కూర్చున్నారు.


అనసూయ: మీ మామయ్యకు వెయాల్సిన టాబ్లెట్స్‌ చూస్తున్నాను అమ్మ


తులసి: అది నా పని ఇటు ఇవ్వండి. ఇవ్వండి.


అనసూయ: ఇది ఒక వారంతోనో.. నెలతోనో అయిపోయే బాధ్యత కాదమ్మా.. నువ్వు మాత్రం ఎన్ని పనులని చూసుకుంటావు. ఇంట్లో ఉండి నేను చేసే పని మాత్రం ఏముంది. ముందు ఆ బాక్సు ఇలా ఇవ్వు అమ్మ


 అని అనసూయ అనగానే నేను బిజీగా ఉన్నప్పుడు మీకు ఇస్తానులే అత్తయ్య అంటుంది తులసి. నేను ఇలా ఊరికే కూర్చోలేకపోతున్నాను అంటుంది అనసూయ. ఇంతలో నంద అక్కడకు వచ్చి తను డాక్టర్‌ను కలిసిన విషయం చెప్తాడు. పరంధామయ్యను రేపే ఆ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దామని చెప్తాడు. అనసూయ సంతోషిస్తుంది. తులసి మాత్రం అనుమానిస్తుంది. అనసూయ ఈ డాక్టర్‌ గురించి నీకు ఎవరు చెప్పారని అడుగుతుంది. లాస్య డాక్టర్‌ గురించి చెప్పిందని నంద చెప్పడంతో అనసూయ, తులసి షాక్‌ అవుతారు.


తులసి: రేపు మనం ఆ డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం లేదు.


నంద: ఎందుకు తులసి


తులసి: లాస్య ఎలాంటిదో మనకు బాగా తెలసు. ఎప్పుడైనా ఒక మంచి పని చేసిందా?


నంద: ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు చేయకూడదని ఏముంది? నాన్న కష్టం చూడలేక తెలిసిన డాక్టర్‌ నే రిఫర్‌ చేసింది. దగ్గరుండి తీసుకెళ్లి మాట్లాడించింది. నేను కన్వీన్స్‌ అయ్యాను.


తులసి: ఎన్నైనా చెప్పండి లాస్య చెప్పిన డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి వీలులేదు. నేను ఒప్పుకోను.


అంటూ తులసి కరాకండిగా చెప్పి లొపలికి వెళ్తుంది. దీంతో నంద.. అమ్మ నువ్వైనా తులసికి చెప్పు అంటూ అనసూయను అడుగుతే ఆమె తనకేం అర్థం కావడం లేదంటుంది.  మరోవైపు దివ్య లాప్‌టాప్‌లో ఏదో వర్క్‌ చేసుకుంటుంటే విక్రమ్‌ వచ్చి ఎందుకంత ముభావంగా ఉన్నావు. మీ అమ్మ దగ్గరకు వెళ్లనివ్వలేదనా? అంటూ అడుగుతుంటే దివ్యకు ఫోన్‌ వస్తుంది. ఫోన్‌లో వ్యక్తి తమ పాపకు బాగా లేదని వచ్చి పాపను కాపాడమని అడుగుతుంది. నేను రాలేనని దివ్య చెప్పడంతో ఫోన్‌లో వ్యక్తి మీ హస్తవాసి మంచిదమ్మా మీరే వచ్చి కాపాడాలి అని రిక్వెస్ట్‌ చేయడంతో దివ్య సరేనని లోకేషన్‌ పెట్టమని అడగడంతో ఫోన్‌లో వ్యక్తి అడ్రస్‌ చెప్తుంది. ఇంతలో దివ్య వెళ్లబోతుంటే విక్రమ్‌ వద్దని వారిస్తాడు. ఇంతలో  అక్కడకు  రాజ్యలక్ష్మీ వచ్చి దివ్యను వెళ్లొద్దని చెప్తుంది. అయినా దివ్య వెళ్తుంది. నువ్వు చెప్పినా దివ్య వినడం లేదని బసవయ్య వెటకారంగా రాజ్యలక్ష్మీని అడుగుతాడు. అది నేను వేసిన వలలో పడుతున్నప్పుడు నామాట వింటే ఎంటి వినకపోతే ఏంటి అంటుంది రాజ్యలక్ష్మీ. బసవయ్య వాళ్ల అక్కను మెచ్చుకుంటాడు.


దివ్య కారులో డ్రైవింగ్‌  చేసుకుంటూ వెళ్తూ బాధపడుతుంది.


దివ్య: ఇంట్లో ప్రతి ఒక్కరూ నావైపు అనుమానంగా చూసేవారే నా మెంటల్‌ కండిషన్‌ గురించి కామెంట్‌ చేసేవారే తమాషా అయిపోయింది. ఇప్పుడు ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాను.


అని మనసులో అనుకుంటూ బాధపడుతూ వెళ్తుంది. మరోవైపు రాజ్యలక్ష్మీ, బసవయ్య మాట్లాడుకుంటుంటారు.


రాజ్యలక్ష్మీ: దాని బొంద అది ఒంటరిగా ఈరోజు బయటికి వెళ్లడం కాదు. నేనే కావాలని ఒంటరిగా బయటకు వెళ్లేలా చేసాను.


బసవయ్య: ఇప్పుడది ఒంటరిగా ఊపుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది అనుకో.. దాని మొగుడికి దానిమీద వీరలెవల్‌లో నమ్మకం పెరుగుతుంది.


దివ్య: నాకు కావాల్సింది అదే నేను మెంటల్‌గా పర్ఫెక్టుగా ఉన్నానని నిరూపించుకుంటాను.


రాజ్యలక్ష్మీ: అంత తేలిగ్గా అది అనుకున్నది జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు తమ్ముడు. మీ అక్క తెలివి లేనిది అనుకున్నావా?


అనుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. మరోవైపు దివ్య కారు కింద ఒక అమ్మాయి పడుతుంది. దివ్య దిగి చూసేసరికి ఆ అమ్మాయి రక్తపు మడుగులో చనిపోయినట్లు పడి ఉంటుంది. అది చూసి దివ్య భయంగా ఏడుస్తూ ఇక్కడ ఎవ్వరూ చూడలేదు అనుకుంటూ కారు తీసుకుని వెళ్లిపోతుంది.  మరోవైపు బసవయ్య వెటకారంగా రాజ్యలక్ష్మీని నీ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయినట్లుంది. ఇంతవరకు దివ్య ఆక్రందనలు వినిపించడం లేదు అంటాడు. ఇంతలో దివ్య కంగారుగా విక్రమ్‌ను పిలవడం చూసి అందరూ వచ్చి దివ్యను ఏమైందని అడుగుతారు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?