Gruhalakshmi Telugu Serial Today Episode: నంద, తులసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంటే ఎస్పై సీరియస్‌గా అల్జీమర్ పేషెంట్‌ను ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో.. ఏమయ్యారో మీకు కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా అంటూ నందాను తిడుతూ మీ భార్య చూడండి ఎలా కంగారు పడుతుందో అనగానే తులసి కోపంగా..
తులసి: తెలిసి తెలియకుండా మాట్లాడకండి సార్. నేను ఆయన భార్యను అని మీకెవరు చెప్పారు. మీకు ఇష్టం వచ్చినట్లు రిలేషన్స్ కలపకండి. మాకు మనోభావాలు ఉంటాయి. ఎస్పై గారికి మామయ్య గారి డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఇచ్చి రండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.
అంటూ తులసి బయటకు వెళ్లగానే ఎస్పై షాక్ అవుతారు. కానిస్టేబుల్స్‌ను వెంటనే నంద దగ్గర డీటెయిల్స్ తీసుకోమని ఆర్డర్ వేస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నంద, తులసి రోడ్ల మీద పరంధామయ్య కోసం వెతుకుతుంటారు. మరోవైపు పరంధామయ్య అలసటగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. రోడ్డు వెంబడి పోయేవాళ్లతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఇంతలో ఒక దొంగ వచ్చి పరంధామయ్య మెడలో గోల్డ్ చెయిన్ ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. కారులో వెతుకుతున్న తులసి, నందలకు పరంధామయ్యను దొంగ లాగుతుండటం కనిపిస్తుంది. వెంటనే కారు ఆపి నంద, తులసి దొంగను తరిమేసి పరంధామయ్యను సేవ్ చేస్తారు. అనసూయ ఒక్కతే ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది.
అనసూయ: చీకటి అయిపోయింది. ఆయన ఎక్కడున్నారో ఏంటో? ఇంతవరకు వాళ్లకు కనపడ్డారో లేదో? దేవుడా ఏంటయ్యా నాకీ ఖర్మ ఈ నాలుగు రోజులకే ఆయనను కాపాడుకోలేకపోతున్నాం. ఇక ముందు ముందు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు.
అంటూ బాధపడుతుండగానే పరంధామయ్య, తులసి, నందగోపాల్ వస్తారు. వాళ్లను చూసిన అనసూయ బాధతో కూడిన ఆనందంతో పరంధామయ్యను హగ్ చేసుకుంటుంది. పరంధామయ్య మన ఇల్లు కూడా నాకు గుర్తు రావడం లేదని బాధపడతాడు. తనకు ఎం అయిందని అడుగుతాడు. తులసి ఏం కాలేదని ఇకనుంచి మేమంతా నీకు తోడుగా ఉంటామని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తుంది. విక్రమ్, దివ్య నిద్రపోతుంటారు. ఇంతలో దివ్య వాటర్ తాగడానికి కిందకు రాగానే హాల్లో రాజ్యలక్ష్మీ కిందపడిపోయి ఉంటుంది. దివ్య కంగారుగా రూంలోకి వెళ్లి విక్రమ్‌ను తీసుకొస్తుంది. విక్రమ్, దివ్య రాగానే హాల్లో ఎవ్వరూ కనిపించరు దివ్య అరుపులకు ఇంట్లో అందరూ నిద్ర లేస్తారు.
బసవయ్య: నువ్వు సరిగ్గా చూశావా?
దివ్య: ఒట్టు నా కళ్లతో చూశాను. ఇక్కడే పడిపోయింది. విక్రమ్ నన్ను నమ్ము, మంచినీళ్ల కోసం కిందకు వచ్చాను. కిందపడిపోయి ఉంది. భయంగా అరుస్తూ నీ దగ్గరకు వచ్చాను.
అనగానే జాహ్నవి రాజ్యలక్ష్మీని పిలుస్తుంది. రాజ్యలక్ష్మీ తాపీగా నిద్ర లేచి వచ్చినట్లుగా వస్తుంది.
రాజ్యలక్ష్మీ: ఏమైందిరా అందరూ అర్ధరాత్రి ఇక్కడున్నారేంటి?
బసవయ్య: ఏముంది నీ పెద్ద కోడలు మళ్లీ మొదలు పెట్టింది సినిమా నీకేదో అయ్యిందట, రక్తంతో ఇక్కడ పడి ఉన్నావంట అరుస్తూ అందరినీ నిద్ర లేపింది.
దివ్య: మీరు ఇందాకా సృహతప్పి ఇక్కడ పడి ఉన్నారు కదా
రాజ్యలక్ష్మీ: ఇక్కడ పడి ఉండటమేంటి? నారూంలో నిద్రపోతున్నాను. జాను అరుపులు విని వస్తున్నాను.
అంటూ అందరూ కలిసి దివ్యను పిచ్చిదాన్ని చేస్తారు. దీంతో విక్రమ్ దివ్యను తీసుకుని రూంలోకి వెళ్తాడు. బసవయ్య, ప్రసూనాంబ, రాజ్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు అనసూయ హాల్లో కూర్చుని పరంధామయ్య గురించి ఆలోచిస్తుంది. ఇంతలో నంద, తులసి వస్తారు.
అనసూయ: అసలు మనిషికి ముసలితనమే ఒక శిక్ష, అది చాలదన్నట్లు ప్రతి దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే? ఇక ఇలాంటి మాయదారి జబ్బు కూడా మీద పడితే ఇంతకు మించిన నరకం ఉండదు.
తులసి: కష్టాలు తప్పించుకోలేం అనుకున్నప్పుడు దాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. దానితో కలిసి బతకడం నేర్చుకోవాలి. అంతే కానీ దాన్ని శత్రువులా చూస్తే అనుక్షణం బాధపెడుతూనే ఉంటుంది. ముసలితనం శరీరాన్ని బలహీనం చేస్తుంది.
అని తులసి మాట్లాడుతుండగానే పరంధామయ్య రూంలోంచి బయటకు వస్తాడు. నంద తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతాడు. అందరితో కూర్చున్న పరంధామయ్య పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. అయితే తనకు దెబ్బ తగిలి విషయమే తెలియకుండా ఉన్న పరంధామయ్యను చూసి నంద, తులసి, అనసూయ బాధపడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : స్వప్నను కాపాడిన అపర్ణ - రాజ్‌కు షాక్ ఇచ్చిన శ్వేత