Brahmamudi Telugu Serial Today Episode: అరుణ్‌ గుడి ముందరే ఉన్నానని చెప్పడంతో.. ముందు నువ్వు స్వప్నకు మాత్రమే కనిపించాలని రాహుల్‌ చెప్తాడు. అవును నాకు అంతా తెలుసులే అంటాడు అరుణ్‌. దీంతో  సంతోషంగా రుద్రాణితో మాట్లాడుతూ


రాహుల్‌: మామ్‌ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ కావ్య లాగా నేను గుడి చుట్టు 108 ప్రదక్షిణలు చేస్తాను.


రుద్రాణి: ఒరే పూల్‌.. పాపాత్ములను దేవుడు కరుణించడురా? పాపాత్ములు పాపాత్ములకు మాత్రమే హెల్ప్ చేయాలి. ఆ అరుణ్‌ అనే పాపాత్ముడు వస్తున్నాడు కదా అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది.  


కావ్య గుడిలో ప్రదక్షిణ చేస్తుంటే రాజ్‌ కౌంట్‌ చేస్తుంటాడు. మరోవైపు రూపాయి కాయిన్‌ నిలబెట్టడానికి అందరూ కుస్తీలు పడుతుంటారు. ఎవరు ముందు నిలబెడతారోనని పోటీ పడుతుంటారు. ఇంతలో అరుణ్‌ వచ్చి దూరం నుంచి స్వప్నకు హాయ్‌ చెప్తాడు. అరుణ్‌ను చూసిన స్వప్న లేచి వెళ్తుంటే కనకం కాయిన్‌ కిందపడిపోతుంది. దీంతో కోపంగా కనకం, స్వప్న చేయి పట్టుకుని


కనకం: ఏయ్‌ స్వప్న ఎందుకో నీకు అంత కంగారు.. ఎక్కడికే..


స్వప్న: ఇప్పుడే వస్తానమ్మా..


అంటూ స్వప్న వెళ్లగానే తింగరిది కళ్యాణ్‌ బాబుకు అప్పుకు పెళ్లి కావాలని నేను కష్టపడుతుంటే ఇది చెడగొట్టి వెళ్తుంది అంటూ మనసులో తిట్టుకుంటుంది కనకం. ఇంతలో అనామిక నా కాయిన్‌ నిలబడింది అంటూ లేచి హ్యాపీగా ఫీలవుతుంది. కనకం నిరాశగా ఎవ్వరూ చూడకుండా అనామిక కాయిన్‌ ను కింద పడేస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కాయిన్స్‌ అన్ని ఎందుకో కిందపడిపోతున్నాయి అంటుంది కనకం. దీంతో నిరాశగా అనామిక వాళ్ల అమ్మ శైలజ అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్వప్న అరుణ్‌ను వెతుక్కుంటూ వెళ్తుంది. రాహుల్‌, రుద్రాణి నవ్వుకుంటుంటారు. మరోవైపు కావ్య నీరసంగా ప్రదిక్షణ చేస్తూ కింద పడబోతుంటే రాజ్‌ పట్టుకుంటాడు. ప్రదక్షిణలు చాలు అని రాజ్‌ చెప్పడంతో ఎలాగైనా నాతో మీరే ప్రదక్షిణలు చేయించాలని కావ్య అడుగుతుంది. అక్కడున్న భక్తులు కూడా మధ్యలో ప్రదిక్షణలు ఆపేయకూడదని చెప్తారు. దీంతో రాజ్‌, కావ్యను ఎత్తుకుని ప్రదక్షిణలు చేయిస్తుంటాడు.


రాజ్‌: వామ్మో బరువు పెరిగావే..


కావ్య: జిమ్ కు వెళ్లి వంద కిలోలు వెయిట్లు మోస్తూ ఫోటోలు దిగితూ స్టేటస్‌లు పెడతారు కానీ  పెళ్లాన్ని ఎత్తుకుంటే మాత్రం బరువు అంటారు మీలాంటి వాళ్లు.


రాజ్‌: ఇది శిక్షా.. ఆ దేవుడు నాకు పెట్టిన పరీక్షా..? నాకు బుద్ది వచ్చింది. ఇంకెప్పుడూ దేవుడి విషయంలో సరాదాకైనా ఆటలు ఆడకూడదని. ఇంత బరువు చచ్చావేంటే?


అంటూ కావ్యను మోస్తున్న రాజ్‌ను కుటుంబ సభ్యులందరూ ఆశ్యర్యంగా  చూస్తుంటారు.


అపర్ణ: ఏంటిదంతా?


రాజ్‌: అంటే తను ఉపవాసం కదా మమ్మీ కళ్లు తిరిగి పడిపోయింది. మధ్యలో ఆపకూడదని నేను పూర్తి చేయించాను. ఇదే లాస్ట్‌ వన్‌ నాట్‌ ఎయిట్‌ అయిపోయాయి.


అపర్ణ: నీవల్ల కానప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కడం దేనికి? నా కొడుకును ఇబ్బంది పెట్టడం దేనికి?


సుభాష్‌: ఇబ్బందేముంది? వాడి భార్యను వాడు మోశాడు.


అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అరుణ్‌ ను వెతుక్కుంటూ వెల్లిన స్వప్న కాలు జారి త్రిశూలం మీద పడబోతుంటే అపర్ణ వచ్చి చేయి పట్టుకుని కాపాడుతుంది.


అందరూ చూసి షాకింగ్‌ గా స్వప్న దగ్గరకు వస్తారు.


అపర్ణ: ఎంటిది? ఏం చేస్తున్నావు నువ్వు. ఒక్కక్షణం ఆలస్యం అయ్యుంటే ఏం జరిగి ఉండేది.


స్వప్న: థాంక్స్‌ ఆంటీ ఇవాళ మీరు నన్నే కాదు నా బిడ్డ ప్రాణాన్ని కూడా కాపాడారు.


కనకం: స్వప్న ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. నీకు ఏమైనా అయ్యుంటే మేము ఏమై పోయేవాళ్లం.


అంటూ అందరూ తిడుతుంటే స్వప్న కంగారుగా అరుణ్‌ వచ్చాడని ఇక్కడే ఉన్నాడని చెప్తుంది. వాడు దొరుకుతే కుక్కను కొట్టినట్లు కొడదామని అనుకున్నాను అంటుంది స్వప్న. వాడు ఊరు వదిలేసి వెళ్లాడు కదా ఇక్కడున్నాడు అంటావేంటి? అంటుంది కావ్య.


రాజ్‌: వాడు ఇక్కడ ఉండటమేంటి? స్వప్న  నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో


స్వప్న: లేదు రాజ్‌  వాడు ఫ్రెండుగా నటిస్తూ నన్ను మోసం చేస్తూ ఉండొచ్చు. కానీ నా కళ్లు నన్ను మోసం చేయలేవు.


రుద్రాణి: మళ్లీ ఇదో కొత్త నాటకమా?


స్వప్న: నాటకాలు ఆడటం మీ తల్లీకొడుకులకు బాగా అలవాటు


అనగానే అందరూ ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేయకు అంటూ స్వప్నను తిడుతూ.. అందరూ గుడి లోపలకు వెళ్తారు. అందరూ అభిషేకం చేస్తుండగా పంతులు కళ్లు మూసుకుని దండం పెట్టుకోమని చెప్పగానే అందరూ కళ్లు మూసుకుని దండం పెడుతుంటే శ్వేత వచ్చి రాజ్‌కు షాక్‌ ఇస్తుంది. పూజ తర్వాత అందరూ కోనేరులో దీపాలు వదులుతుంటే కళ్యాణ్‌, అప్పుతో మాట్లాడుతుంటాడు. శైలజ చూసి కోపంగా అనామికను అక్కడ చూడు అని చెప్తుంది. అప్పు, కళ్యాణ్‌లను చూసిన అనామిక కోపంగా చూస్తుండి పోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.