విక్రమ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని దివ్య జాహ్నవికి వార్నింగ్ ఇస్తుంది. కానీ జానూ మాత్రం వినిపించుకోకుండా దివ్యని చెడ్డదానిగా అనుకుని మాట్లాడుతుంది.


జానూ: నువ్వు అందించలేని ప్రేమని బావకి నేను అందిస్తాను


దివ్య: నీ మనసు తప్పు దారిలో ఆలోచిస్తుంది. అది నా కన్నా ఎక్కువగా నీకే నష్టం


జానూ: బావ నీకు దూరం అవుతాడని అలా మాట్లాడుతున్నావ్


దివ్య: నాకు విక్రమ్ ఎప్పుడూ దూరం కాడు. మా మధ్య ఉంది కేవలం అపార్థాలు మాత్రమే. కాలం మమ్మల్ని దగ్గర చేస్తుంది


జానూ: తప్పు నువ్వు చేసి దూరం నువ్వు పెంచి పరిష్కారాన్ని కాలానికి వదిలిపెడుతున్నావా? ఇక బావని వదిలిపెట్టను


దివ్య: ఖచ్చితంగా విక్రమ్ నాకు దగ్గర అవుతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. విక్రమ్ నిన్ను కేవలం మరదలిగా మాత్రమే చూస్తున్నాడు తెలుసుకో


ALso Read: కృష్ణమూర్తి ఆవేదన - టెన్షన్లో కావ్య - విగ్రహాల నిమజ్జనాన్ని రాజ్ ఆపగలుగుతాడా!


ధనుంజయ్ వాళ్ళు సామ్రాట్ కంపెనీని టేకోవర్ చేస్తున్నందుకు సంతోషపడుతూ ఉంటారు. నెమ్మదిగా సమయం చూసి పావులు కదపాలని రత్నప్రభ అంటుంది. త్వరపడకపోతే అప్పుల వాళ్ళు వెంట పడతారని చెప్తాడు.


రత్నప్రభ: కంపెనీ షేర్స్ కొన్ని అమ్మితే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో అప్పులు తీరుద్దాము. అప్పుడే మేనేజర్ వస్తే సామ్రాట్ కంపెనీ షేర్స్ ఫైల్ తీసుకుని రా అంటుంది.


మేనేజర్: అవి నా దగ్గర లేవు మేడమ్. సామ్రాట్ తన లాకర్ లో పెట్టుకుంటారు. దాని కోడ్ ఈ ఆఫీసులో ఎవరికి తెలియదు


రత్నప్రభ: మరి లాక్ తెలిసేది ఎలా


మేనేజర్: జీఎం కి తెలుసు. తనని అడిగితే తెలుస్తుంది


రత్నప్రభ: ఇంతకీ ఎవరు ఆ జీఎం


మేనేజర్: తులసి జీఎం


సరే మాట్లాడతానులే అనేసి ఫోన్ చేయకుండా ఆపేస్తుంది. ఆఫీసులో జరిగే ఈ విషయాలు తులసికి తెలియడానికి వీల్లేదని అంటుంది. అప్పుడే పెద్దాయన వస్తాడు. కంపెనీ విషయాలు అవగాహన వచ్చేవరకు పెద్దాయన్ని అడుగుతారు. లాక్ తెరవమని అంటే తెలియదని అంటాడు.


రత్నప్రభ: మీరు చెప్పకపోతే తెలుసుకోలేమా? ఏదో ఒకరోజు తులసి సీఈఓ సీట్లో కూర్చుంటుందని మీరు ఆశపడుతున్నారు ఏమో అది జరగని పని. బుద్ధిగా మాతో చేతులు కలిపి ప్రశాంతంగా బతకండి అని బెదిరిస్తుంది.


Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- మరి కృష్ణ ఇచ్చే రివర్స్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది!


నందు, తులసి మీటింగ్ కి వెళతారు. క్లయింట్స్ ని నందు మెప్పిస్తాడు. డీల్ ఒకే అవుతుంది.  


తులసి: ఇప్పుడు మాట్లాడినట్టే ఆరోజు కూడా మాట్లాడితే డీల్ ఒకే అయ్యేది కదా


నందు: అప్పుడు నువ్వు పక్కన లేవు


తులసి: నేను ఎప్పుడు మీ పక్కన ఉండటం కుదరదు


నందు: నువ్వు పక్కన ఉన్నప్పటి నందుకి లేనప్పుడు ఎలా ఉంటుందో చూశావ్ కదా


తులసి: పాతికేళ్లు పక్కన ఉన్నప్పుడు ఇలా అనిపించలేదు ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది


నందు: నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటానని మాట ఇస్తావా? కేఫ్ కి కొత్త డీల్ నీ చేతుల మీదుగానే మొదలవాలి


తులసి: మాట ఇచ్చి ఒకలా ఇవ్వకుండా ఒకలా నడుచుకునే అలవాటు నాకు లేదు. నేను లేకుండా మీ పనులు చేసుకోవడానికి అలవాటు పడితే మంచిది


విక్రమ్ చిరాకుగా ఉన్నప్పుడు జానూ వచ్చి ఇష్టమైన దోస తీసుకొచ్చానని అంటుంది. తను తినిపించడానికి ట్రై చేస్తుంటే ఆపుతాడు. అసలే కోపంలో ఉన్న విక్రమ్ జానూ మీద సీరియస్ అవుతాడు. దివ్య రూమ్ కి తీసుకొచ్చింది టిఫిన్ తినేశాను తినలేనని అంటాడు. దీంతో జానూ మొహం మాడ్చుకుని వెళ్తుంది. దివ్య అదంతా చూసి జాహ్నవిని కదిలిస్తుంది. నువ్వు ఇచ్చిన దోస తిన్లేదు ఇక ప్రేమ ఏం అందుకుంటాడని రెచ్చగొడుతుంది. తన చేతి కాఫీ తాగిస్తానని దివ్యతో ఛాలెంజ్ చేస్తుంది. మళ్ళీ విక్రమ్ ఫోన్ లో అరుస్తూ ఉండగా జానూ కాఫీ తీసుకొచ్చి తాగమని అనేసరికి అరుస్తాడు. ఆల్రెడీ కాఫీ తాగాను దివ్య ఇచ్చిందని చెప్తాడు. దివ్య వచ్చి ఆ కాఫీ తీసుకుని తాగుతుంది.


Also Read: కొనసాగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్, శైలేంద్రకి జగతి రివర్స్ పంచ్!


తులసి కిచెన్ లో ఉండగా నందు వచ్చి వంట చేస్తానని అంటాడు. ఆ మాటకి రాములమ్మ బిత్తరపోతుంది. తులసిని కిచెన్ లో నుంచి పంపించేసి తనే కష్టపడి వంట చేస్తాడు. అదంతా పరంధామయ్య, తులసి వాళ్ళు తొంగి చూసి నవ్వుకుంటారు. స్టవ్ వెలిగించకుండా వంట చేస్తున్నారని రాములమ్మ గాలి తీసేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న తులసికి దగ్గరుండి మరి వడ్డిస్తాడు.