తులసిని ఒంటరి చేసి తన మీద అటాక్ చేయాలని లాస్య ప్లాన్ చేస్తుంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే తన కుటుంబం సభ్యుల శవాలుగా మారిపోతారని అంటుంది. ఈ విషయం కూడ చెప్పి చేస్తున్నావా అంటే అవునని అంటుంది. ఇంట్లో అనసూయ దంపతులు మాత్రమే ఉంటారు. లాస్య పంపిన రౌడీలు అనసూయ ఇంటికి వస్తారు. ఏదో చప్పుడు రావడంతో అనసూయ కంగారుగా భర్తని నిద్రలేపుతుంది. అప్పుడే రౌడీలు ఇంట్లో పవర్ కట్ చేస్తారు. ఇద్దరు ముసలోళ్ళు చీకట్లో నడుచుకుంటూ ఉండగా రౌడీలు అటు ఇటూ పరిగెడుతూ వాళ్ళని భయపెడతారు. డోర్ దగ్గరకి వెళ్ళి చూసి క్లోజ్ చేసే ఉందని అంటాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఇంట్లోకి ఎవరు వస్తారని అనుకుంటారు. ఎవరో లోపలికి వచ్చారని అనసూయ మాత్రం అనుమానపడుతుంది. చీకట్లో క్యాండిల్ కోసం వెతుకుతారు కానీ కనిపించకపోయే సరికి మళ్ళీ గదికి వెళ్లిపోతారు.


Also Read: ఆనందంగా సాగుతోన్న కృష్ణ, మురారీ జీవితంలో పెనువిషాదం!


రెస్టారెంట్ లో కూర్చుని తులసి పరధ్యానంగా ఉంటుంది. అది గమించిన హనీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఏం లేదని కవర్ చేస్తుంది. కానీ ఏదో ఉంది ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. కానీ తులసి మాత్రం విషయం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. రౌడీలు లాస్యకి ఫోన్ చేసి లేపేయమంటారా? అని అడుగుతాడు. తను చెప్పేవరకు ముసలోళ్ల జోలికి వెళ్ళొదని అంటుంది. తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. కంగారుగా లిఫ్ట్ చేసి వణికిపోతుంది.


లాస్య: మొదటి సారి తులసి గొంతులో కంగారువినపడుతుంది ఇదే నాకు కావలసింది. మాజీ మొగుడితో ఎంజాయ్ చేస్తుంటే కాల్ చేసి డిస్ట్రబ్ చేస్తున్నానా? అయినా నువ్వేంటి రాత్రి పూట ముసలోళ్ళని ఒంటరిగా వదిలేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేనా ఫ్యామిలిని కాపాడుకునే విధానం. అవతల వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అనేసరికి తులసి కంగారుగా అనసూయకి ఫోన్ చేస్తుంది.


అనసూయ: ఎక్కడ ఉన్నారు తులసి. నేనే ఫోన్ చేద్దామని అనుకున్నా. ఇంట్లో కరెంట్ పోయి చాలా సేపు అయ్యింది ఇల్లంతా చీకటి. ఇంట్లో ఎవరో దూరినట్టు అనిపిస్తుంది మీ మావయ్యకి చెప్తే నమ్మడం లేదు వెళ్ళి చూడటం లేదు. నువ్వైన చూడమని చెప్పు


తులసి: మీరు గది దాటి బయటకి రావొద్దు వీలైతే తలుపులు వేసుకోండి. మేం వెంటనే బయల్దేరి వచ్చేస్తున్నాం


తులసి కంగారుగా ఉండటం చూసి ఏమైంది ఎవరు ఫోన్ చేస్తున్నారని నందు అడుగుతాడు. ఏం లేదని అంటుంది. ఇంటికి వెళ్లిపోదాం పద అని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంట్లో మళ్ళీ ఏదో చప్పుడు కావడంతో అనసూయ భయపడిపోతుంది. ఏదో అలికిడి అయ్యింది వెతుకుదామని మళ్ళీ కిందకి వెళతారు. అప్పుడే దబాదబామని డోర్స్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. దీంతో అనసూయ మరింత వణికిపోతుంది. ఎవరు అంటే రాములమ్మ అంటుంది. భయంగా తలుపులు తీస్తారు. రాములమ్మ నిజంగానే వస్తుంది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉంటే మన ఇంట్లో పోయింది ఏంటని అంటుంది. ఇంట్లో ఎవరో దూరారని అనసూయ భయపడుతుంటే రాములమ్మ ధైర్యం చెప్తుంది. లాస్య మళ్ళీ తులసికి ఫోన్ చేసి భయపెడుతుంది. రెస్టారెంట్ కి వెళ్ళావ్ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటావ్ అంటుంది.


లాస్య: మీ ఇంట్లో ఉంది ఆకు రౌడీలు కాదు ప్రొఫెషనల్స్. జరిగింది హత్య అనే డౌట్ కూడ రాకుండా చేస్తారు


Also Read: అర్థరాత్రి రాజ్, కావ్య ఫన్ టైమ్ - రుద్రాణికి రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన కనకం




తులసి: అక్కడ ఉంది నా వాళ్ళు మాత్రమే కాదు నీ వాళ్ళు కూడా



లాస్య: నామీద అరవడం కాదు వెళ్ళి మీ అత్తామామని కాపాడుకో


తరువాయి భాగంలో..


తులసి కంగారుగా ఇంటికి వచ్చేస్తుంది. అనసూయ వాళ్ళకి ధైర్యం చెప్తుంది. రాములమ్మ కిచెన్ లో ఎవరో దొంగలు ఉన్నారని అనేసరికి కర్ర పట్టుకుని వెళ్తుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు. లాస్య మళ్ళీ తులసికి ఫోన్ చేసి రెండు ప్రాణాలు కాపాడుకున్నావ్.. రోజూ ఇలాగే కాపాడుకోలేవ్ కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.