రత్నప్రభ నందుకి ఫోన్ చేసి హనీని పంపించకపోతే ఎంతకైనా తెగిస్తానని వార్నింగ్ ఇస్తుంది. అమెరికా నుంచి అన్నీ వదులుకుని వచ్చింది సామ్రాట్ ఆస్తిని తులసికి వదలడానికి కాదని అంటుంది. తమకి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదని నందు చెప్పినా కూడా రత్నప్రభ నమ్మదు.


రత్నప్రభ: తులసికి ఏదో ఒకరోజు ఆస్తి కావాలని అనిపిస్తే ఏం చేస్తావ్. మా మీద ఎదురుతిరిగే అవకాశం ఎవరికి ఇవ్వను. హనీ మీ దగ్గర ఉండకూడదు. తను నా ఇంట్లో ఉండాలి.


నందు: నాకు కాస్త టైమ్ కావాలి.


రత్నప్రభ: నన్ను బతిమలాడటం కాదు ఫ్యామిలీ కోసం తనని బతిమలాడుకో అనేసి కాల్ కట్ చేస్తుంది.


Also Read: కావ్య మనసు మార్చిన ఇంద్రాదేవి దంపతులు- తింగరిబుచ్చి అంటూ ప్రేమ చూపించిన రాజ్


జాహ్నవి విక్రమ్​కి మందు తాగించి తనకి దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తుంది. అటు తులసి ఇంట్లో దివ్య హనీతో సంతోషంగా ఆడుకుంటుంది. విక్రమ్, జానూ కలిసిపోయారని బసవయ్య వాళ్లు సంతోషపడుతూ ఉంటారు. తాగేసి ఉన్న విక్రమ్​ని జానూ తన గదికి తీసుకెళ్తుంటే వద్దని అంటాడు. కానీ తను మాత్రం వినిపించుకోదు. తాము అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకుంటారు. దివ్య పరంధామయ్యకి సేవ చేస్తూ ఉంటుంది. భోజనం చేసి ఇంటికి వెళ్లమని తులసి అంటుంది. కానీ దివ్య మాత్రం ఒక్కరోజుకి ఏం కాదులే పుట్టింటికి వస్తే గెంటేస్తావ్ ఏంటని అలుగుతుంది. తాతయ్య దెబ్బలకి ట్రీట్మెంట్ చేసి వెళ్తానని మొండికేస్తుంది.


రాజ్యలక్ష్మి జానూ తన పెద్ద కోడలు కాబోతుందని చెప్పి సంతోషంగా ఉంటుంది. బసవయ్య వచ్చి టెన్షన్​గా ఉందని అంటాడు. అంతా తాను అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం జరుగుతుందని.. సరిగా టైమ్​కి దివ్య కూడా ఇక్కడ లేదని అంటుంది.


బసవయ్య: ఇప్పుడు మత్తులో ఉన్నాడు కాబట్టి మాట వింటున్నాడు. మత్తు దిగితే ఎందుకు వింటాడు?


రాజ్యలక్ష్మి:  నేను ఎందుకు ఊరుకుంటాను. జానూకి చావు తప్పితే వేరే దారి లేదని బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడిస్తాను.


బసవయ్య: వాడు దివ్యకి తప్ప తన జీవితంలో ఎవరికి చోటు లేదంటే అప్పుడు జానూ పరిస్థితి ఏంటి?


రాజ్యలక్ష్మి: అప్పుడు నేనే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తాను


బసవయ్య: కన్నతండ్రిని జానూ జీవితాన్ని నాశనం చేస్తున్నానని అనిపిస్తుంది.


జానూ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. దివ్య పుట్టింటి నుంచి వచ్చేలోపు పంచాయతీ సెట్ చేస్తే తన కూతురు ఇంటి కోడలు అవుతుందని ప్రసన్న తెగ సంతోషపడిపోతుంది. దివ్య వస్తే విక్రమ్ తన మాట వినడని ఆ లోపు పని పూర్తి కావాలని అనుకుంటారు. అప్పుడే దివ్య ఎంట్రీ ఇస్తుంది. తనని విక్రమ్ గదికి వెళ్లకుండా చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే జానూ విక్రమ్ గదిలో నుంచి రావడం చూసి దివ్య షాక్ అవుతుంది.


రాజ్యలక్ష్మి: నువ్వు బావ గదిలో నుంచి వస్తున్నావ్ ఏంటి?


జానూ: రాత్రి బావ వద్దని చెప్పినా వినకుండా బాగా మందు కొట్టాడు. గదిలో పడుకోబెట్టి వెళ్దామని తీసుకెళ్లాను. నా చెయ్యి పట్టుకుని వదల్లేదు. పక్కన పడుకోమన్నాడు.. అక్క లేదని బావ పక్కన పడుకున్నాను అనేసరికి దివ్య కళ్లు తిరిగినట్టుగా సోఫాలో కూలబడిపోతుంది. అప్పుడే విక్రమ్ మత్తులో తూగుతూ బయటకి వస్తాడు.


రాజ్యలక్ష్మి: ఏంటి నువ్వు చేసిన పని నీకు బుద్ధి ఉందా?


Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!




విక్రమ్: దివ్య వీళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.



బసవయ్య: మీరిద్దరూ రాత్రంతా ఒకటే గదిలో పడుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాకపోవడం ఏంటి అల్లుడు. నా కూతురికి అన్యాయం చేయకు.


విక్రమ్: జానూ ఏంటి వీళ్లు అనేది?


బసవయ్య: నా కూతురు తల మీద చెయ్యి వేసి చెప్పు ఏం జరగలేదని..


రాజ్యలక్ష్మి: ఏ తప్పు చేయకపోతే ఒట్టు వేసి తప్పు చేయలేదని చెప్పు.


విక్రమ్: రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తు లేదు..


దివ్య: విక్రమ్ కాదు నేను చెప్తున్నా. తను కడిగిన ముత్యం. తను ఎలాంటి తప్పు చేయలేదు.


బసవయ్య: నీ మొగుడ్ని రక్షించుకోవడం కోసం నా కూతురు జీవితం అన్యాయం చేస్తావా?


ప్రసన్న: నువ్వే నా కూతురికి న్యాయం చేయాలి వదిన


తరువాయి భాగంలో..


గుడికి వెళ్లిన తులసి, అనసూయ మీద రౌడీలతో అటాక్ చేయిస్తున్నానని రత్నప్రభ నందుకి ఫోన్ చేసి బెదిరిస్తుంది. చేతనైతే వెళ్లి కాపాడుకోమని సవాల్ విసురుతుంది. దీంతో నందు కంగారుగా బయల్దేరతాడు.